అన్వేషించండి

Google Pixel 6: గూగుల్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. అదరగొట్టే కెమెరాలు.. ధర ఎంతంటే?

టెక్ దిగ్గజం గూగుల్ తన కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. అవే గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్లు.

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటిలో గూగుల్ తాజాగా రూపొందించిన టెన్సార్ ప్రాసెసర్‌ను అందించారు. గతంలో లాంచ్ అయిన పిక్సెల్ ఫోన్ల కంటే మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్)ను ఈ ఫోన్లు అందించనున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఇవి లాంచ్ అయ్యాయి. ఈ కొత్త పిక్సెల్ ఫోన్లు ఐపీ68 సర్టిఫైడ్ బిల్డ్‌తో లాంచ్ అయ్యాయి.

పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ధర
గూగుల్ పిక్సెల్ 6 స్మార్ట్ ఫోన్ ధర 599 డాలర్లు(మనదేశ కరెన్సీలో సుమారు రూ.45,000) కాగా, గూగుల్ పిక్సెల్ 6 ప్రో ధర 899 డాలర్లుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.67,500) ఉంది. కైండా కోరల్, సోర్టా సీఫోం, స్టార్మీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో తెలియరాలేదు.

గూగుల్ పిక్సెల్ 6 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9కాగా, పిక్సెల్ డెన్సిటీ 441పీపీఐగా ఉంది. గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కూడా ఉంది. లేజర్ డిటెక్ట్ ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మిగతా ఆండ్రాయిడ్ ఫోన్లలోని కెమెరాల కంటే వీటిని మరో మెట్టు పైన నిబబెట్టే కెమెరా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

128 జీబీ, 256 జీబీ కెమెరా ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, పైరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కూడా ఇందులో అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4614 ఎంఏహెచ్‌గా ఉంది. 30W వైర్డ్, 21W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 207 గ్రాములుగా ఉంది.

గూగుల్ పిక్సెల్ 6 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 10 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఇందులో అందించారు. పిక్సెల్ 6లో అందించిన టెన్సార్ ప్రాసెసర్‌నే ఇందులో కూడా అందించారు.

గూగుల్ పిక్సెల్ 6 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటి ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ కూడా ఇందులో ఉంది. పిక్సెల్ 6 తరహాలో చాలా ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి.

ఇందులో 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 5003 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 30W వైర్డ్, 21W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు.

యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, పైరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 210 గ్రాములుగా ఉంది.

Also Read: Apple Macbook Pro 2021: మోస్ట్ పవర్‌ఫుల్ యాపిల్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలుసా?

Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget