Google Pay: గూగుల్ పేలో ‘బై నౌ పే లేటర్’ ఆప్షన్ - ఇంకా రెండు అదిరిపోయే ఫీచర్లు
Google Pay Buy Now Pay Later : డజన్ల కొద్దీ గూగుల్ సేవలలో చెల్లింపు ప్లాట్‌ఫారమ్ అయిన గూగుల్ పే(Google Pay) కూడా ఒకటి . దీనికి సంబంధించి కంపెనీ కొత్త కొన్ని అదిరిపోయే ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Google Pay Latest News: డజన్ల కొద్దీ గూగుల్ సేవలలో చెల్లింపు ప్లాట్‌ఫారమ్ అయిన గూగుల్ పే(Google Pay) కూడా ఒకటి . దీనికి సంబంధించి కంపెనీ కొత్త కొన్ని అదిరిపోయే ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇవి ఆన్‌లైన్ షాపింగ్‌ను సులభంగా, పారదర్శకంగా చేయడానికి వినియోగదారులకు సహరిస్తాయి. చెల్లింపుకు ముందు కార్డ్ ప్రయోజనాలను చూడడంలో మీకు సహాయపడేలా ఇవి రూపొందించబడ్డాయి. అదనంగా వినియోగదారులు 'బై నౌ పే లేటర్' ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. కార్డ్ వివరాలను సురక్షితంగా ఆటోఫిల్ చేయవచ్చు.
చెల్లింపుకు ముందు కార్డ్ ప్రయోజనాలను చెక్ చేసుకోవాలి
* బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులతో అనేక ఆఫర్లను ఇస్తాయని మనకు తెలుసు. మీ కార్డ్‌తో ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో మీకు తెలిస్తే, మీరు దానిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు.
* క్రెడిట్ కార్డ్‌లు తరచుగా తమ వినియోగదారులకు క్యాష్‌బ్యాక్, హోటళ్లు లేదా హోటల్ బసల కోసం రీడీమ్ చేయగల ట్రావెల్ పాయింట్‌లు, రెస్టారెంట్‌లలో డైనింగ్‌పై తగ్గింపు వంటి అనేక రివార్డ్‌లను అందిస్తాయి.
* కానీ నిర్దిష్ట కొనుగోలుకు ఏ కార్డ్ మెరుగైన రివార్డులను ఇస్తుందో కొన్నిసార్లు కార్డ్ హోల్డర్‌లకు గుర్తుండదు.
* దీన్ని నిర్వహించడానికి చెక్అవుట్ సమయంలో ప్రతి కార్డ్ ప్రయోజనాలను చూపే కొత్త ఫీచర్‌ను Google Pay పరిచయం చేసింది. దీనితో మీరు సరైన కార్డ్‌ని ఎంచుకోవడం ద్వారా సరైన రివార్డ్‌లను పొందవచ్చు.
బై నౌ పే లేటర్ ఆప్షన్
* ఇప్పుడు కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి (BNPL) ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది. చాలా ప్లాట్‌ఫారమ్‌లు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
* ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆన్‌లైన్ షాపింగ్‌ను వేగవంతం చేయడానికి Google Pay వినియోగదారులకు అనువైన చెల్లింపు ఎంపికను అందించడం కోసం ‘ఇప్పుడు కొనుగోలు చేయి తర్వాత చెల్లించండి’ ఆప్షన్ ప్రవేశపెట్టింది.
* BNPLతో కొనుగోలుదారులు వెంటనే కొనుగోలు చేయవచ్చు.. మరీ ఆ మొత్తం మొత్తాన్ని ఒకేసారి చెల్లించడానికి బదులుగా వాయిదాల(EMI)లో చెల్లించవచ్చు.
* ఈ సంవత్సరం ప్రారంభంలో Google Pay Affirm, Zip వంటి BNPL ఎంపికలను ఏకీకృతం చేయడం ప్రారంభించింది.
* ఈ సేవలు వినియోగదారులు తమ చెల్లింపులను Google Pay నిబంధనల ఆధారంగా చిన్న, మరింత చిన్న భాగాలుగా విభజించడానికి అనుమతిస్తాయి.