అన్వేషించండి

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్‌కు గూగుల్ నివాళి - ఎలా చెప్పిందంటే?

క్వీన్ ఎలిజబెత్ II మరణానినికి నివాళిగా గూగుల్ హోం పేజ్ రంగులను మార్చింది.

బ్రిటన్‌కు రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణానికి నివాళిగా గూగుల్ తన హోం పేజ్ రంగులను మార్చింది. లోగో రంగును గ్రే కలర్‌కు ఛఏంజ్ చేసింది. సాధారణంగా గూగుల్ లోగో కలర్‌ఫుల్‌గా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కేవలం యూకేలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చింజన్ రంగు మారింది. మీరు గూగుల్ హోం పేజ్‌కు వెళ్లినా అదే రంగు కనిపిస్తుంది.

గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫా సీఈవో అయిన సుందర్ పిచాయ్ కూడా ఇంగ్లండ్ రాణి మరణానికి నివాళులు అర్పించారు. యాపిల్ కూడా క్వీన్ ఎలిజబెత్ మరణానికి నివాళిగా తన హోం పేజీని మార్చింది. అందులో క్వీన్ ఎలిజబెత్ యుక్తవయసులో ఉన్నప్పుడు ఫొటోలను చూడవచ్చు.

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌-II సెప్టెంబర్ 8వ తేదీన కన్నుమూశారు.  క్వీన్ ఎలిజబెత్‌-II వయసు 96 సంవత్సరాలు. 25వ ఏట నుంచి బ్రిటన్ రాణిగా ఉన్నారు. ఆమె స్కాట్లాండ్ లోని  బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు.  ఎలిజబెత్‌-2.. ఏప్రిల్‌ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్‌ స్ట్రీట్‌లో జన్మించారు.   గ్రీస్‌ యువరాజు, నేవీ లెఫ్టినెంట్‌ ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్‌ ఛార్లెస్‌, ప్రిన్సెస్‌ అన్నె, ప్రిన్స్‌ ఆండ్రూ, ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ సంతానం. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఎలిజబెత్‌ను ప్రకటించారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్‌ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్‌ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్‌ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

క్వీన్‌ ఎలిజబెత్‌-2 పట్టాభిషేక సమయంలో బ్రిటన్‌ ప్రధానిగా విన్‌స్టన్‌ చర్చిల్‌ ఉన్నారు. 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం  ఎలిజబెత్‌-2 చేతిలోనే ఉంటుంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్‌, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్‌ ఐల్యాండ్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నేవిస్‌, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌, ది గ్రెనాడైన్స్‌, తువాలుకు కూడా క్వీన్‌ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు.

2015 నాటికే ఎలిజబెత్‌-2 ఇప్పటికే క్వీన్‌ విక్టోరియాను దాటేసి బ్రిటన్‌ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. క్వీన్ ఎలిజబెత్  - 2 భర్త ఫిలిప్‌ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. 2002లో ఎలిజబెత్‌-II తల్లి మరణించిన సమయంలో అంత్యక్రియల్లో 1,600 ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. 

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget