Xiaomi Pad 5: షియోమీ సూపర్ ట్యాబ్లెట్ వచ్చేసింది - 10.95 ఇంచుల డిస్‌ప్లే, 8720 ఎంఏహెచ్ బ్యాటరీ - ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో తన కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే షియోమీ ప్యాడ్ 5.
షియోమీ మనదేశంలో కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే షియోమీ ప్యాడ్ 5. 10.95 ఇంచుల డిస్‌ప్లేతో ఈ ట్యాబ్లెట్ ఎంట్రీ ఇచ్చింది. 8720 ఎంఏహెచ్ బ్యాటరీని కంపెనీ ఇందులో అందించింది. 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉంది.
షియోమీ ప్యాడ్ 5 ధర
ఈ ట్యాబ్లెట్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా... 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద మే 7వ తేదీ వరకు వీటిపై రూ.2,000 తగ్గింపు అందించారు. కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మే 3వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
షియోమీ ప్యాడ్ 5 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 10.95 ఇంచుల 2.5కే+ డిస్‌ప్లేతో ఈ ట్యాబ్లెట్ ఎంట్రీ ఇచ్చింది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అందించారు.
6 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 8720 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. క్వాడ్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్, హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది. వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఓటీజీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
Also Read: OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
View this post on Instagram