Nintendo Switch 2: గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతి ఇవ్వనున్న నింటెండ్ స్విచ్-2 కన్సోల్
Nintendo Switch 2: గేమింగ్ ప్రియుల మనసు దోచిన నింటెండో స్విచ్‌కు సీక్వెల్ రాబోతోంది.దాదాపు 9 ఏళ్ల తర్వాత అప్‌డేట్ వెర్షన్‌ను సంస్థ తీసుకొస్తోంది. వేసవిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం

Nintendo Switch 2: జపాన్‌కు చెందిన నింటెండో వీడియో గేమ్ నుంచి మరో సరికొత్త కన్సోల్ రానుంది. ఎన్నో ఏళ్ల నుంచి నింటెండో స్విచ్( Nintendo Switch)కు సీక్వెల్ రాబోతుందన్న ఊహగానాలకు తెరదించుతూ సంస్థ అధికారికంగా తన నెక్ట్స్ జెన్-హ్యాండ్ హోల్డ్ గేమింగ్ కన్సోల్ నింటెండ్ స్విచ్-2 ట్రైలర్ విడుదల చేసింది. దాదాపు ఏడేళ్ల తర్వాత గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతులు పంచే విధంగా అప్‌డేటెడ్ వెర్షన్ నింటెండో స్విచ్-2 మార్కెట్‌లోకి తీసుకురానుంది.
ప్రత్యేకలు
నింటెండో స్వీచ్ కన్నా పెద్ద డిస్‌ప్లే(Disply), మాగ్నిట్క్ జాయ్ కాన్స్‌తో పాటు అత్యంత ఆకర్షణీయమైన డిస్‌ప్లే దీనిసొంతం. ఇది హైబ్రిడ్ కన్సోల్ చేసే స్టిక్‌డ్రిప్ట్ సమస్యను సైతం పరిష్కరిస్తుందని సమాచారం. ఈ ఏడాది కొత్త ప్రొడెక్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోపు నింటెండో స్వీకెల్ తీసుకొస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 2015లో లాంచ్ అయిన నింటెండో స్విచ్ గేమింగ్ ప్రియుల మనసు దోచింది. దాదాపు 9 ఏళ్లకు పైగా ఎన్నో అనుభూతలను పంచింది.
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం స్విచ్-2 తొలిఏడాదిలోనే 20 మిలయన్లు అమ్మకాలు సాగించేలా కంపెనీ ఉత్పత్తి చేయనుంది. ఇది నింటెండ్ స్విచ్ మరియు ప్లేస్టేషన్-5 అమ్మకాల కన్నా ఎక్కువే. ఇవి రెండు విడుదలైన ఏడాదిలో 15 మిలియన్లు మాత్రమే అమ్ముడుపోయాయి. స్విచ్-2 ధరపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్ చేస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం భారతదేశ కరెన్సీలో ఈ ధర రూ.35,500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గేమ్ కాట్రిడ్జ్‌లు ధర 69 నుంచి 79 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది.
జీపీయూ పనితీరు: 1.72 టెరాప్లాప్‌ల ప్రాసెసింగ్ పవర్‌ను అందజేస్తూ 561 మెగా హెడ్జ్‌ల వరకు క్లాక్‌స్పీడ్ అందుకుంటుదని అంచనా
సి.యూ.డి.ఏ. కౌంట్: మెరుగైన గ్రాఫిక్స్ అనుభూతిని పొందేందుకు 1536 కోర్‌లతో తీసుకురానున్నారు.
మెమరీ మరియు బ్యాండ్‌విడ్త్: కన్సోల్ 120 జీబీ బ్యాండ్‌విడ్త్‌తో 12 జీబీ LPDDR5X మెమరీతో రావొచ్చని అంచనా.
206 మి.మీటర్ల పొడవు, 115 మిల్లీ మీటర్ల వెడల్పు, 14 మి.మీటర్ల మందంతో కన్సోల్ రానుంది.





















