By: ABP Desam | Updated at : 22 May 2022 03:56 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ కొత్త ట్యాబ్లెట్ త్వరలో లాంచ్ కానుంది.
రియల్‌మీ ప్రస్తుతం రియల్‌మీ ప్యాడ్ అనే ట్యాబ్లెట్‌పై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రియల్‌మీ ప్యాడ్, రియల్‌మీ ప్యాడ్ మినీలను కంపెనీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన తర్వాతి ట్యాబ్లెట్‌ను తీసుకురావడానికి సిద్ధం అవుతుంది. దీన్ని ‘కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్’ అని కంపెనీ టీజ్ చేసింది. ఇప్పుడు దీని లాంచ్ తేదీ ఆన్‌లైన్‌లో లీకైంది.
ఈ ట్యాబ్లెట్ మే 26వ తేదీన మార్కెట్లో లాంచ్ కానుందని ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. దీంతోపాటు రియల్‌మీ పవర్ బ్యాంక్ ప్రో కూడా లాంచ్ కానుందని సమాచారం. ఈ కొత్త పవర్ బ్యాంక్ కెపాసిటీ ఏంటో ఇంకా తెలియరాలేదు.
రియల్‌మీ ప్యాడ్ స్పెసిఫికేషన్లు
గతంలో వచ్చిన లీకుల ప్రకారం... ఇందులో రెండు సీపీయూ వేరియంట్లు ఉండనున్నాయి. ఒక వేరియంట్లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్, మరో దాంట్లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ వేరియంట్లో ఎల్సీడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని రిజల్యూషన్ 2.5కేగానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 8360 ఎంఏహెచ్‌గా ఉండనుంది. స్టైలస్ సపోర్ట్ కూడా అందించనున్నారు. ఈ స్టైలస్‌ను రియల్‌మీ ప్యాడ్ పెన్ అని పిలవనున్నారు. దీని ధర 300 డాలర్ల రేంజ్‌లో ఉండనుంది.
దీంతోపాటు రియల్‌మీ ప్యాడ్ 5జీ కూడా లాంచ్ కానుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ వేరియంట్‌ను రియల్‌మీ ప్యాడ్ 5జీ మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ అని పిలవనున్నట్లు తెలుస్తోంది.
కంపెనీ ఇటీవలే రియల్‌మీ ప్యాడ్ మినీని మనదేశంలో లాంచ్ చేసింది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వైఫై ఓన్లీ ధర రూ.10,999 గానూ, ఎల్టీఈ మోడల్ ధర రూ.12,999గానూ ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Ambrane 50000 mah Power Bank: 50000 ఎంఏహెచ్ బ్యాటరీతో పవర్ బ్యాంక్ - ధర ఎంతంటే?
Itel 1es: రూ.2 వేలలోపే స్మార్ట్‌వాచ్ - 15 రోజుల బ్యాటరీ బ్యాకప్!
Samsung New Soundbar Lineup: ఈ సౌండ్ బార్ల కంటే టీవీలే తక్కువ రేటు - కానీ ఫీచర్లు మాత్రం అదుర్స్!
Realme Techlife Watch R100: రియల్‌మీ కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది - రూ.4 వేలలోపే సూపర్ ఫీచర్లు!
Noise Nerve Pro: రూ.900లోపు మంచి నెక్‌బ్యాండ్ కోసం చూస్తున్నారా - అయితే ఈ ఇయర్‌ఫోన్స్ మీకు మంచి ఆప్షన్!
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?