News
News
X

రూ.12 వేలలోపే నోకియా ట్యాబ్ - భారీ డిస్‌ప్లేతో!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా మనదేశంలో బడ్జెట్ టీ10 ట్యాబ్‌ను లాంచ్ చేసింది.

FOLLOW US: 

నోకియా మనదేశంలో బడ్జెట్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. అదే నోకియా టీ10 ట్యాబ్లెట్. ఈ కొత్త ట్యాబ్లెట్ గ్లోబల్ లాంచ్ జులైలోనే జరిగింది. ఇందులో 8 అంగుళాల డిస్‌ప్లే అందించారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్ పనిచేయనుంది.

నోకియా టీ10 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,799గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,799గా ఉంది. అమెజాన్, నోకియా ఇండియా వెబ్ సైట్లలో ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు.

నోకియా టీ10 స్పెసిఫికేషన్లు
ఇందులో 8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 450 నిట్స్‌గా ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

దీని బ్యాటరీ సామర్థ్యం 5250 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 12ఎల్ అప్‌డేట్ వస్తుందా లేదా అన్నది తెలియరాలేదు.

News Reels

ట్యాబ్లెట్ వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 2 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. స్టీరియో స్పీకర్లు, బయోమెట్రిక్ ఫేస్ అన్‌లాక్, ఐపీఎక్స్2 రేటింగ్, గూగుల్ కిడ్స్ స్పేస్, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో  ట్రూవైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను నోకియా ఇన్‌బిల్ట్‌గా అందించనుంది. దీని ధరను మనదేశంలో రూ.4,999గా నిర్ణయించారు. ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 128 ఎంబీ స్టోరేజ్ స్పేస్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 1450 ఎంఏహెచ్‌గా ఉంది. వీజీఏ కెమెరా కూడా ఈ ఫోన్‌లో ఉంది. డ్యూయల్ సిమ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్‌ను హైడ్ చేసుకోవచ్చు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Ocean Of Deals • Marketing | Deals | Tech Updates (@oceanof_deals)

Published at : 03 Oct 2022 11:35 PM (IST) Tags: Nokia T10 Nokia T10 Price Nokia T10 Features Nokia T10 Specifications Nokia T10 Launched Nokia Tablet

సంబంధిత కథనాలు

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

Netflix Profile Transfer: అందుబాటులోకి నెట్ ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్, ఇక పాస్ వర్డ్ షేరింగ్ కు చెక్!

Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ వచ్చేసింది - సోనీ, జేబీఎల్‌లో ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేయండి!

Nothing Ear Stick: నథింగ్ ఇయర్ స్టిక్ వచ్చేసింది - సోనీ, జేబీఎల్‌లో ప్రత్యామ్నాయాలపై ఓ లుక్కేయండి!

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి