అన్వేషించండి

Teen Instagram Account: ఆ వయసు గల వారికి సరికొత్తగా ఇన్​స్టా అకౌంట్స్​ - ఇకపై పేరెంట్స్​ కంట్రోల్​లో

మెటా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు వారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ లో టీన్‌ అకౌంట్స్‌ అకౌంట్​ను తీసుకొచ్చింది. పిల్లలకు ఇన్‌స్టాను సురక్షిత వేదికగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.

Instagram Teen Accounts : సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ చేతిలోనే ఉండడంతో సోషల్ మీడియా ప్లాట్ ​ఫామ్స్​ విపరీతంగా పెరిగిపోయాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ దీని మత్తులోనే ఉంటున్నారు. కొంతమంది దీనిని అవసరం కోసం వాడితే మరికొంత మంది బానిసగా మారుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల జీవితాలపై ఈ సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. చాలా సందర్భాల్లో ఈ విషయమై ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. 

ఈ నేపథ్యంలో మెటా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 18 ఏళ్లలోపు ఉన్న వారి కోసం ఇన్‌స్టాగ్రామ్‌ లో ఓ ప్రత్యేక అకౌంట్​ను తీసుకొచ్చింది. టీన్‌ అకౌంట్స్‌ పేరిట దీన్ని రూపొందించింది. పిల్లలకు ఈ ఇన్‌స్టా అనేది సురక్షిత వేదికగా మార్చేందుకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  

యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియా, కెనడాలోనూ ఈ కొత్త అకౌంట్లను తీసుకొచ్చారు. అలానే కొత్తగా ఇన్‌స్టాలో అకౌంట్ క్రియేట్ చేసుకునే 18 ఏళ్లలోపు వారికి కూడా ఇకపై టీన్‌ అకౌంట్లను మాత్రమే కేటాయిస్తారు. ఇప్పటికే ఉన్న ఖాతాలను కూడా 60 రోజుల్లో టీన్‌ అకౌంట్లుగా మార్చనున్నారు.

ఈ టీన్‌ అకౌంట్స్‌లో పేరెంటల్‌ కంట్రోల్స్‌ కూడా ఉంటాయి. దీంతో 16 ఏళ్లలోపు ఉన్న యూజర్స్​ డిఫాల్ట్‌ సెట్టింగ్స్‌ మార్చుకోవాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాల్సిందే. తద్వారా పిల్లలు ఉపయోగించే ఇన్‌స్టా ఖాతాపై తల్లిదండ్రులు నిఘా పేట్టే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ అకౌంట్లు డిఫాల్ట్‌గా ప్రైవేట్‌లో ఉంటాయి. ఈ అకౌంట్లు ఉన్న యూజర్స్​ కేవలం ఫాలో/ కనెక్ట్‌ అయిన అకౌంట్స్ నుంచి మాత్రమే మెసేజ్​ను అందుకోగలరు. ఇంకా సెన్సిటివ్‌ కంటెంట్‌పై కూడా పూర్తిగా నియంత్రణ ఉంటుంది. 

ఈ ఇన్​స్టా టీన్ అకౌంట్స్​తో లాభాలు ఇవే!

టీన్‌ అకౌంట్స్​ డిఫాల్ట్‌గానే ప్రైవేట్​ అకౌంట్లుగా వస్తాయి. తద్వారా కొత్తగా ఎవరైనా ఈ మైనర్ల అకౌంట్లను ఫాలో అవ్వాలనుకుంటే, ఆ రిక్వెస్టులను సదరు మైనర్ అకౌంట్లు యాక్సెప్ట్ చేయాల్సిందే. అలా వారు యాక్సెప్ట్​ చేయకపోతే వారు పోస్ట్ చేసిన  కంటెంట్‌ను చూడడం కుదరదు. 
 ఫాలో అయ్యే యూజర్స్​, లేదా  కనెక్ట్ అయిన యూజర్స్​ నుంచి మాత్రమే మెసేజ్​ వస్తాయి. 
ఈ టీన్ అకౌంట్స్​కు సెన్సిటివ్​ కంటెంట్‌ కంట్రోల్‌ కూడా ఉంటుంది. 

డైరెక్ట్‌ మెసేజ్‌లు, కామెంట్లలో వల్గర్ వర్డ్స్​ను  ఇన్‌స్టానే   ఫిల్టర్‌ చేసేస్తుంది

ఓ రోజులో ఇన్​స్టా యాప్​ వాడకం 60 నిమిషాలు దాటితే, కచ్చితంగా నోటిఫికేషన్‌ వస్తుంది.

రాత్రి 10  నుంచి ఉదయం 7 గంటల వరకు ఆటోమెటిక్​గా స్లీప్‌ మోడ్‌ ఆన్‌ అయిపోతుంది. ఆ సమయంలో నోటిఫికేషన్లు రావు.  డైరెక్ట్‌ మెసేజ్​లకు ఆటో రిప్లైస్​ వెళ్తాయి.

పేరెంట్స్‌ ఈ టీన్​ అకౌంట్లను తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. వారి సందేశాలను యాక్సెస్‌ చేయొచ్చు. రోజువారీ యూసేజ్‌ను కూడా ఎప్పటికప్పుడు చూడొచ్చు. నిర్ణీత సమయంలో ఇన్‌స్టా వాడకుండా ఉండేలా బ్లాక్ చేసే వెసులుబాటు ఉంది. 

 జనవరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఈ టీన్‌ అకౌంట్లు పూర్తి స్తాయిలో అందుబాటులోకి వస్తాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ram Charan Kadapa Durga Temple | కడప కనకదుర్గ గుడిలో రామ్ చరణ్, బుచ్చిబాబు | ABP DesamRam Charan in Kadapa Ameen Peer Dargah | అయ్యప్పమాలలో దర్గాలోపలికి రామ్ చరణ్ | ABP DesamPM Modi Meets Joe Biden in G20 Summit | పదవి దిగే ముందు మోదీ-బైడెన్‌ భేటీNizamabad Mayor Husband | మేయర్ భర్త ఉంటాడో పోతాడో తెలీదంటూ దాడి చేసిన వ్యక్తి సంచలన వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS News: తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
తెలంగాణ సీఎం రేవంత్ అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌- చిక్కులు తప్పవా?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Viral News : గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్‌ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
Matka OTT Rights Price: ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్‌ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
Google Chrome browser : క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
క్రోమ్‌ బ్రౌజర్ అమ్మేయండి- గూగుల్‌పై అమెరికా ఒత్తిడి
Vijay Deverakonda: లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
లవ్ లైఫ్ గురించి పబ్లిగ్గా చెప్పిన విజయ్ దేవరకొండ... ప్రేమలో పడాలంటే అప్పటిదాకా ఆగాల్సిందేనట
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Embed widget