జులై నెలలో బెస్ట్ 4 స్మార్ట్ ఫోన్స్ ఇవే - ధరకు తగ్గ ఫీచర్స్!
జులై నెలలో స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? ఫాస్టెస్ట్ ప్రొసెసర్, అదిరిపోయే కెమెరా సిస్టమ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ సామర్థ్యంతో తక్కువ ధరకే టాప్ నోచ్ ఫీచర్స్కావాలంటే ఓ లుక్కెయ్యాల్సిందే !
హై ఎండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫాస్టెస్ట్ ప్రొసెసర్, అదిరిపోయే కెమెరా సిస్టమ్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ సామర్థ్యం వంటి టాప్ నోచ్ ఫీచర్స్ కలిగిన మొబైల్‌ను తక్కువ ధరకే కావాలనుకుంటున్నారా? అందుకే మీకోసం ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం. రూ.40 వలే నుంచి రూ.50 వేల మధ్య ఉండే ఈ గ్యాడ్జెట్స్ స్మార్ట్ ఫోన్ యూజర్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు వీటిపై ఓ లుక్కేసి మీకు కావాల్సిన స్మార్ట్ ఫోన్‌ను కొనేయండి.
Xiaomi 14 Civi 5G
స్టైల్‌గా, అదిరే పెర్ఫార్మెన్స్తో నడిచే షావోమీ 14 సివి 5జీ ధర రూ. 42,999. షావోమీ 14 అల్ట్రా 5జీ, షావోమీ 14 5జీ కలిపితే ఈ ఫోన్. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో స్టన్నింగ్ 12-బిట్ అమోల్డ్ డిస్‌ప్లే వంటి స్లీక్ డిజైన్, హై ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. గరిష్టంగా 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్, 4,700mAh బ్యాటరీతో వచ్చింది. 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా సిస్టమ్ ఎటువంటి లైటింగ్ పరిస్థితులలోనూ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేస్తుంది.
Realme GT 6 5G
రూ.50 వేలలోపు స్మార్ట్ ఫోన్ కొనాలంటే ఇది బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ. 40,999. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే స్నాప్ డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో నడుస్తుంది. గరిష్టంగా 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్. 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ, 5,500mAh బ్యాటరీ వంటి టాప్ టైర్ పెర్ఫార్మెన్స్ జీటీ 6 5జీలో ఉన్నాయి. ఫ్రంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో బ్యూటిఫుల్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. గరిష్టంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్న దీని స్క్రీన్‌పై టీవీషోలను చూడటం, గేమ్‌లు ఆడటం వంటి ఎంచక్కా చేయొచ్చు. కెమెరా అద్భుతంగా ఉంది. డే లైట్, లో లైట్‌లోనూ అద్భుతమైన ఫొటో, వీడియో క్వాలిటీని అందిస్తుంది.
Vivo V30 Pro 5G
రూ.50వేల ధర లోపల లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో వివో వి30ప్రో 5జీ కూడా ఒకటి. వివో హై-ఎండ్ ఎక్స్ సిరీస్ లాంటి జీస్ ఆప్టిక్స్ ఫీచర్ ఉన్న ఫస్ట్ వీ సిరీస్ ఫోన్ ఇదే. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్టన్నింగ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వంటి ఫీచర్లతో వస్తోంది. అలానే 8200 చిప్ డైమెన్సిటీతో నడుస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజీని అందిస్తుంది.
OnePlus 12R 5G
వన్‌ప్లస్ 12ఆర్ 5జీ ఫోన్ ప్రస్తుతం రూ. 50వేలలోపే అందుబాటులో ఉంది. వీడియో గేమ్‌లు, ఫొటోలు, వీడియోలు అద్భుతంగా కనిపించేందుకు ఆడేందుకు 120Hz అమోల్డ్ స్క్రీన్‌ను ఈ ఫోన్ అందిస్తోంది. తడి చేతులతోనూ ఫోన్‌ను వాడేలా ఆక్వా టచ్ ఫీచర్‌ను అందిస్తోంది. ప్రైమరీ స్నాపర్ 50ఎంపీ, 5,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 100డబ్లూ ఫాస్ట్ చార్జింగ్ కల్పిస్తోంది.