అన్వేషించండి

Apple Airpods Pro 2nd Gen: అత్యంత ఖరీదైన యాపిల్ ఎయిర్‌పోడ్స్ వచ్చేశాయ్ - రేటు చూస్తే షాకే!

యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో 2వ తరం ఎయిర్‌పోడ్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి.

యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో రెండో తరం ఎయిర్‌పోడ్స్ లాంచ్ అయ్యాయి. మొదటి తరం ఎయిర్‌పోడ్స్ 2019లో లాంచ్ అయ్యాయి. వీటిలో ఫైండ్ మై సపోర్ట్ ఉన్న ఇన్‌బిల్ట్ స్పీకర్ అందించారు. యాపిల్ హెచ్2 చిప్ కూడా ఉంది. మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్‌తో ఇవి మార్కెట్లోకి వచ్చాయి. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇవి సపోర్ట్ చేయనున్నాయి.

యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో (రెండో తరం) ధర
వీటి ధరను అమెరికాలో 249 డాలర్లుగా (సుమారు రూ.19,850) నిర్ణయించారు. ఇక మనదేశంలో వీటి ధర రూ.26,900గా ఉంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఎయిర్‌పోడ్స్ ప్రో ధరను కూడా యాపిల్ రూ.19,900కు తగ్గించింది.

యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో (రెండో తరం) స్పెసిఫికేషన్లు
వీటిలో యాపిల్ హెచ్2 చిప్‌ను అందించారు. డాల్బీ అట్మాస్, పర్సనలైజ్ చేసిన స్పేషియల్ ఆడియో, హెడ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిని వినియోగదారులు కస్టమైజ్ చేసుకోవచ్చు. మెరుగైన ఆడియో క్వాలిటీ కోసం హై ఎక్స్‌కర్షన్ డ్రైవర్‌ను అందించారు. ప్రెజర్ కంట్రోల్స్ కూడా ఇందులో ఉండటం విశేషం.

ప్రస్తుతం ఎయిర్‌పోడ్స్ ప్రోలో అందుబాటులో ఉన్న యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కంటే రెట్టింపు ఏఎన్‌సీని ఇది అందించనుంది. ఫైండ్ మై బిల్ట్ అనే ఫీచర్ కూడా ఈ ఎయిర్‌పోడ్స్‌లో ఉంది. దీని ద్వారా వినియోగదారులు ఆడియో డివైస్‌ను ఫైండ్ చేయవచ్చు.

కనెక్టివిటీ విషయానికి వస్తే... కొత్త ఎయిర్ పోడ్స్ ప్రోలో బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. ఐపీఎక్స్4 స్వెట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. వీటిని లైట్‌నింగ్ కేబుల్ ద్వారా చార్జ్ చేయవచ్చు. ఇయర్ పోడ్స్ బరువు 5.3 గ్రాములుగా ఉంది. కేస్‌తో కలిపితే మొత్తం 50.8 గ్రాములుగా ఉంది.

యాపిల్ వాచ్ సిరీస్ 8ను యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో లాంచ్ చేసింది. వీటికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి జరగనుంది. యాపిల్ వాచ్ సిరీస్ 7 జీపీఎస్ ఓన్లీ వేరియంట్ ధ‌ర మనదేశంలో  రూ.45,900గా నిర్ణయించారు. మిడ్ నైట్, స్టార్ లైట్, గ్రీన్, సిల్వర్, ప్రొడ‌క్ట్ రెడ్ రంగుల్లో ఈ వాచ్ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

యాపిల్ వాచ్ ఎస్ఈ జీపీఎస్ వేరియంట్ ధర అమెరికాలో 249 డాలర్లుగా (సుమారు రూ.19,800) నిర్ణయించారు. మనదేశంలో జీపీఎస్ మోడల్ ధర ను రూ.29,900గా నిర్ణయించారు.  మిడ్ నైట్, సిల్వర్, స్టార్‌నైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయ్యాయి.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Lightning Safety Tips: ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
ఉరుములు, మెరుపుల సమయంలో స్మార్ట్ టీవీ, వై-ఫై రౌటర్ ప్లగ్ ఎందుకు తీసేయాలి?
Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
IND VS NZ 1st Test Result: తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం
తొలిటెస్టులో ఇండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లిన కివీస్ బ్యాటర్లు.. మారథాన్ ఇన్సింగ్స్ తో  డారిల్ , ఫిలిప్స్ అద్భుత పోరాటం, డ్రాగా ముగిసిన మ్యాచ్
Hyderabad Terror Attack: హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
హైదరాబాద్‌లో టెర్రర్ అలర్ట్.. 26/11 తరహా దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్!
Godavarikhani Murder: గోదావరిఖనిలో దారుణం.. ఫోన్ చేసి బయటకు పిలిచి సింగరేణి ఉద్యోగి హత్య!
గోదావరిఖనిలో దారుణం.. ఫోన్ చేసి బయటకు పిలిచి సింగరేణి ఉద్యోగి హత్య!
Mushrooms in Winter : చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?
చలికాలంలో పుట్టగొడుగులు తింటే ఆరోగ్యానికి మంచిదేనా? డైట్‌లో చేర్చుకోవడం లాభమా? నష్టమా?
AP Panchayat Elections Phase 1: ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
ఏపీ గ్రామ పంచాయతీ తొలి పోరు.. 3191 స్థానాలకు 26న పోలింగ్.. 758 సర్పంచ్‌లు ఏకగ్రీవం!
Who is Kota Rukmini: జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
జనసేనలో హాట్ టాపిక్‌గా కోట రుక్మిణి.. పవన్ విడాకుల రూమర్ల నుంచి రూ. 7 కోట్ల జాబ్స్ స్కాం ఆరోపణల వరకు! అసలు ఈమె ఎవరు?
Embed widget