By: ABP Desam | Updated at : 02 Oct 2023 06:43 PM (IST)
వాట్సాప్‌లో స్కాములు ఎక్కువ అయ్యాయి.
WhatsApp Scam: ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నందున భారతదేశంలో ఆన్‌లైన్ మోసాల కేసులు కూడా ఎంతో వేగంగా పెరుగుతున్నాయి. అదేవిధంగా మోసగాళ్ళు మోసం చేయడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. ప్రస్తుతం స్కామర్లు వాట్సాప్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారు. దీని ద్వారా వారు మీ బ్యాంకింగ్ వివరాలను పొంది మిమ్మల్ని మోసానికి గురి చేస్తారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇటువంటి మోసాలు, నేరాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.
తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలి
వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్‌లను లిఫ్ట్ చేసేటప్పుడు వినియోగదారులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎత్తకుండా ఉండటం మంచిది.
సమాచారం ఇచ్చే ముందు జాగ్రత్త
మీకు సంబంధించి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు కాల్ చేసింది ఎవరో నిర్థారించుకోండి. లేకపోతే మీ సమాచారం స్కామర్ల చేతిలో పడి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
ఎక్కువ ఫోర్స్ చేసేవారి దగ్గర జాగ్రత్తగా ఉండండి
స్కామర్‌లు తరచుగా సమాచారాన్ని త్వరగా అందించమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారు తమ మాటలతో మీలో కంగారు పుట్టిస్తారు.
అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి
తెలియని నంబర్ల నుంచి వచ్చిన లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. ఎందుకంటే అవి మోసపూరిత వెబ్‌సైట్‌లు కావచ్చు. దాని కారణంగా మీ డేటా దుర్వినియోగం అవుతుంది.
2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను స్టార్ట్ చేయండి
వాట్సాప్‌లో 2FAని యాక్టివేట్ చేయడం ద్వారా, మీరు అదనపు భద్రతను పొందవచ్చు. దీని ద్వారా స్కామర్‌లు మీ ఖాతాను యాక్సెస్ చేయడం కష్టతరం అవుతుంది.
మీకు వాట్సాప్ స్కామ్ ఎదురైతే ఏమి చేయాలి?
వారితో వెంటనే సంభాషణను ముగించండి. కాల్‌లో ఉంటే కట్ చేయండి లేదా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకుండా ఆపేయండి. మనీ ట్రాన్స్‌ఫర్ వంటి రిక్వెస్ట్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.
నంబర్‌ను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి
స్కామర్లు మిమ్మల్ని సంప్రదించకుండా నిరోధించడానికి, వారిని బ్లాక్ చేసి, వాట్సాప్‌కి రిపోర్ట్ చేయండి.
మరోవైపు అక్టోబర్ 4వ తేదీన ఐదు స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. గూగుల్ తన కొత్త పిక్సెల్ సిరీస్‌ను అదే రోజున మార్కెట్లో లాంచ్ చేయనుంది. అలాగే వివో వి29 సిరీస్ కూడా అక్టోబర్ 4వ తేదీనే విడుదల కానుంది. కొరియన్ దిగ్గ కంపెనీ శాంసంగ్ కూడా గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఉండనున్నాయి.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!
Fraud Loan Apps: ఈ 17 లోన్ యాప్స్ మీరు వాడుతున్నారా? - వెంటనే ఆపేసి అన్ఇన్స్టాల్ చేయండి!
Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?
ISRO Projects in 2024: ఇకపై SSLV రాకెట్‌తో ఇస్రో మరిన్ని ప్రయోగాలు, రాజ్యసభలో కేంద్రం వెల్లడి
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?
/body>