Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!
మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
Mobile Phone Caring Tips: స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మన జీవితంలో అంతర్భాగంగా మారింది. పక్కన వారి ఫోన్ పట్టుకుంటేనే వారికి కోపం వస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్ మనకు అవసరమైన అవసరాలను కూడా తీరుస్తుంది. కొన్నిసార్లు ఫోన్ చేతి నుంచి జారి అకస్మాత్తుగా నీటిలో పడటం లేదా వర్షంలో తడిసిపోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో అది చెడిపోయే ప్రమాదం ఉంది. మీ ఫోన్ పొరపాటున నీటిలో పడితే వీటిని వెంటనే చేయండి.
ముందుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి
ఫోన్ తడిగా ఉన్నప్పుడు ముందుగా దాన్ని ఆఫ్ చేయండి. దానిని అస్సలు ఉపయోగించవద్దు. మొబైల్ ఫోన్ నీటిలో పడితే దాని అంతర్గత భాగాలను నీరు షార్ట్ సర్క్యూట్ చేస్తుంది. కాబట్టి ఫోన్ పని చేస్తుందో లేదో చెక్ చేయడానికి ప్రయత్నించవద్దు. నీటిలో నుంచి బయటకు తీసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి.
క్లీన్ చేయండి
మొబైల్‌లో నీరు చేరితే, ఫోన్‌లోని అన్ని భాగాలను ఆరబెట్టడం అవసరం. దీని కోసం పేపర్ నాప్‌కిన్‌లను ఉపయోగించడం ఉత్తమం. ఇది కాకుండా మీరు ఫోన్‌ను తుడవడానికి సాఫ్ట్ టవల్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. మొబైల్‌ను సరిగ్గా శుభ్రం చేయండి.
బియ్యంలో పెట్టండి
ఫోన్‌ని షేక్ చేయడం ద్వారా బాగా ఆరబెట్టి ఆ తర్వాత దానిని బియ్యంలో పెట్టండి. మొబైల్‌ని పెద్ద పాత్ర లేదా పెట్టెలో పెట్టి అందులో రైస్ పెట్టండి. దీని తరువాత పై నుంచి పూర్తిగా పాత్రను మూసివేయండి. నానబెట్టిన ఫోన్‌ను పొడి బియ్యంలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే బియ్యం దాని తేమను వేగంగా గ్రహిస్తుంది.
బ్యాటరీని ఆరబెట్టండి
కనీసం 24 గంటల పాటు ఫోన్‌ను బియ్యం పెట్టెలో ఉంచండి. అది పూర్తిగా ఆరిపోయే దాకా ఆన్ చేయాలని కూడా అనుకోకండి. ఫోన్‌తో పాటు దాని బ్యాటరీ, ఇతర ఉపకరణాలు కూడా బియ్యంలో ఆరబెట్టవచ్చు.
ఛార్జింగ్‌లో మొబైల్‌ని అస్సలు ఉపయోగించవద్దు
మొబైల్‌లోకి నీరు చేరిన తర్వాత దానిని ఛార్జింగ్ పెట్టకండి. మీ మొబైల్‌లో నీరు పూర్తిగా ఆరిపోయే వరకు ఛార్జ్ చేయకండి. ఆరాక మాత్రమే మొబైల్‌ను ఆన్ చేయండి. మీరు మొబైల్‌ను ఛార్జ్ చేస్తే ఫోన్ షట్ డౌన్ కావచ్చు లేదా దానిలో పెద్ద సమస్య ఉండవచ్చు.
మొబైల్‌ని సర్వీస్ సెంటర్‌కి పంపండి
మొబైల్‌ను బియ్యంలో ఆరబెట్టిన తర్వాత దాన్ని ఆన్ చేసి ప్రయత్నించండి. ఫోన్ ఇప్పటికీ ఆన్ కాకపోతే దానిని సర్వీస్ సెంటర్‌కి పంపించండి. ఆన్ అయినా సరే ఎందుకైనా మంచిది ఒకసారి సర్వీస్ సెంటర్‌లో చూపించుకోవచ్చు, దీని వల్ల మీ మొబైల్‌లో ఏదైనా లోపం ఉంటే, దాన్ని కనిపెట్టి బాగు చేయవచ్చు.
View this post on Instagram