X Premium: ఉచితంగా రూ.13,600 విలువైన ఎక్స్ ప్రీమియం ప్లస్ - ఎవరికి లభిస్తుంది?
X Premium Free: ఎక్స్ ప్రీమియం వినియోగదారులను కొందరు వినియోగదారులకు ఉచితంగా అందించనున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపాడు.
Elon Musk: ఎలోన్ మస్క్ ఎక్స్ (ఇంతకు ముందు ట్విట్టర్) పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిరంతరం మార్పులు చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజూ కొన్ని కొత్త ఫీచర్లు లేదా అప్‌గ్రేడ్‌లను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి ప్రకటనే ఒకటి చేశాడు. ఎక్స్ ప్రీమియం, ప్రీమియం ప్లస్ సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.
ఎవరికి ఉచితం?
ఎలాన్ మస్క్ తన ఎక్స్/ట్విట్టర్ వినియోగదారులకు ఉచిత ప్రీమియం సేవను అందిస్తామని ప్రకటించారు. అయితే దీనికి ఎలాన్ మస్క్ ఓ కండిషన్ కూడా పెట్టాడు. ఎలాన్ మస్క్ ఒక పోస్ట్ కూడా చేశాడు. అదే సమయంలో కనీసం ఐదు వేల మంది అనుచరుల సంఖ్య ఉన్న వినియోగదారులు ప్రీమియం ప్లస్ సర్వీసుకు సంబంధించిన ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.
మీకు 2500కు పైగా వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్లు ఫాలోయర్లుగా ఉంటే ఎక్స్ ప్రీమియం సర్వీసులను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇదే నంబర్ 5000 దాటితే ఎక్స్ ప్రీమియం ప్లస్ సర్వీసులు కూడా ఫ్రీగా లభిస్తాయని ఎలాన్ మస్క్ తెలిపాడు.
Going forward, all 𝕏 accounts with over 2500 verified subscriber followers will get Premium features for free and accounts with over 5000 will get Premium+ for free
— Elon Musk (@elonmusk) March 28, 2024
Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?
ఓపెన్ ఏఐతో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ బుధవారం నాడు ఎక్స్ ప్రీమియం ప్లస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న గ్రోక్ ఏఐ చాట్ త్వరలో ప్రీమియం వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంటుందని తెలిపాడు. అంటే ఎక్స్ ప్రీమియం, ఎక్స్ ప్రీమియం ప్లస్ వినియోగదారులు అందరికీ ఇది అందుబాటులో ఉండనుందన్న మాట.
గత సంవత్సరం చివరలో ఎలాన్ మస్క్ ఎక్స్ ప్రీమియం ప్లాన్ ప్రారంభ రేటును నెలకు రూ. 244గా నిర్ణయించారు. అదే వార్షిక సబ్‌స్క్రిప్షన్ సంవత్సరానికి రూ. 2590గా ఉంది. అదే సమయంలో ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ రేటు నెలకు రూ. 1300గానూ, సంవత్సరానికి రూ. 13,600గానూ ఉంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?