అన్వేషించండి

AI To SI: కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!

AI To SI: ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్‌ను సూపర్ ఇంటెలిజెన్స్‌గా పేరు మార్చాలని ఇటీవల ఓ చర్చ మొదలైంది. AI పేరును SIగా మార్చడం వల్ల దాని నిజమైన ప్రమాదాలు వాస్తవంగా తగ్గుతాయా? అనే చర్చ మొదలైంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్రంప్ సూచనతో AI పేరు SIగా మారినా వాస్తవ ప్రమాదాలు అలాగే.
  • పేరు మార్పు సాంకేతికత, అల్గోరిథం, పనితీరును ఏమాత్రం మార్చదు.
  • ఆటోమేటెడ్ ఆయుధాలు, సైబర్ దాడులతో మానవత్వానికి ముప్పు పెరుగుతుంది.
  • ప్రమాద నివారణకు కఠినమైన నియంత్రణ, భద్రతా ప్రమాణాలు అత్యవసరం.

AI To SI: గూగుల్, మెటా, ఓపెన్‌ఏఐ, ఎన్విడియా వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలతో సమావేశమైన అనంతరం, ఆర్టికల్ ఇంటెలిజెన్స్ (AI)ను "సూపర్ ఇంటెలిజెన్స్" (SI)గా పేరు మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపింది. ఈ పేరు మార్పు చట్టపరంగా, రాజకీయంగా ఒక ముందడుగులా అనిపించినప్పటికీ.. సాంకేతిక, భద్రతా ప్రమాణాల నుండి ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. అదేమిటంటే, AI పేరును SIగా మార్చడం వల్ల దాని నిజమైన ప్రమాదాలు వాస్తవంగా తగ్గుతాయా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

పేరు మార్పుతో ఏమి మారుతుంది?  

సాంకేతికత అపారమైన శక్తి, సామర్థ్యం, ప్రపంచ ఆధిపత్యాన్ని సూచించడానికి "సూపర్ ఇంటెలిజెన్స్" అనే పదాన్ని ఉపయోగించవచ్చు. నిపుణులు, పెట్టుబడిదారులకు ఇది కేవలం ఒక సాధారణ సాంకేతికత కాదని, మానవ సామర్థ్యాన్ని అధిగమించే ఒక కొత్త విప్లవమని తెలియజేస్తుంది. అయితే, కేవలం పేరు మార్చడం వల్ల కోడ్, మెయిన్ అల్గోరిథం అలాగే ఉంటాయి. న్యూరల్ నెట్‌వర్క్ నిర్మాణం, శిక్షణ డేటా, స్వయంప్రతిపత్తి లేదా మెషిన్ లెర్నింగ్ లో ఎలాంటి మార్పు ఉండదు. దీనిని ఆర్టిఫిషీయల్ లేదా సూపర్‌ ఇంటెలిజెన్స్‌ అని పిలిచినా, యంత్రాల నిర్ణయ వేగం, ఆటోమేషన్, భారీ పరిమాణంలో డేటాను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఒకే విధంగా కొనసాగుతాయని నిపుణులు అంటున్నారు. కేవలం పేరు మార్చడం వల్ల ప్రమాదం తగ్గుతుందని భావించడం తప్పుడు భ్రమ మాత్రమే అంటున్నారు.  

Also Read: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!

సూపర్ ఇంటెలిజెన్స్  

సూపర్‌ఇంటెలిజెన్స్ వల్ల కలిగే ముప్పులను కేవలం ఊహాజనితమైనవిగా కొట్టిపారేయలేమని నిపుణులు అంటున్నారు. వాటిని ప్రధానంగా వివిధ కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది. ఒక వ్యవస్థ మానవ ఆలోచనను అధిగమించిన కొద్దీ, దాని ప్రాథమిక లక్ష్యాలను మానవ విలువలతో బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వాటిని నిలిపివేసే సామర్థ్యాన్ని హ్యూమన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.

మానవ ప్రమేయం లేకుండా దాడి చేయగల ఆటోమేటెడ్ ఆయుధాలు, డీప్‌ఫేక్‌లు, ఆడియో క్లోనింగ్‌ల ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయడం ఈజీ అవుతుంది. అలాగే, గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలపై సైబర్‌‌దాడుల ముప్పు పెరుగుతుంది. శారీరక శ్రమతో పాటు కోడింగ్, రైటింగ్, న్యాయ సమీక్ష వంటి "వైట్-కాలర్" ఉద్యోగాలు ఆటోమేషన్‌కు గురై నిరుద్యోగానికి దారితీస్తాయి. టెక్ కంపెనీలు బలం పుంజుకుని ప్రపంచ అసమానతలు పెరుగుతాయి. యంత్రాల తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మడం వల్ల వైద్య, న్యాయ రంగాల్లో ప్రాణాంతక పరిస్థితులు ఎదురుకావచ్చు. కాలక్రమేణా ఇది మానవ ఇంటెలిజెన్స్ ను బలహీనపరుస్తుంది.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!

 కృత్రిమ మేధస్సు (AI) పేరును “సూపర్ ఇంటెలిజెన్స్” (SI)గా మార్చడం రాజకీయ లేదా చర్చల దృష్టిని మార్చవచ్చు కానీ అది ఆ సాంకేతికతతో ముడిపడి ఉన్న ఏ వాస్తవ ప్రమాదాలనూ తొలగించదు. ఈ వ్యవస్థలను మనం ఎంత సురక్షితంగా, పారదర్శకంగా, నైతికంగా, జవాబుదారీగా తీర్చిదిద్దుతామనే దానిలోనే అసలైన సవాలు ఉంది. ప్రమాదాన్ని నివారించడానికి కేవలం పేర్లు మార్చడం సరిపోదని,  అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు, కఠినమైన సాంకేతిక నియంత్రణ అత్యవసరంగా అవసరమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. 

Also Read: మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!

Frequently Asked Questions

AI పేరును SIగా ఎందుకు మార్చాలని ప్రతిపాదించబడింది?

ఆర్టికల్ ఇంటెలిజెన్స్ (AI) పేరును

AI పేరును SIగా మార్చడం వల్ల దాని ప్రమాదాలు వాస్తవంగా తగ్గుతాయా?

లేదు, పేరు మార్చడం వల్ల కోడ్, మెయిన్ అల్గోరిథం, న్యూరల్ నెట్‌వర్క్ నిర్మాణం లేదా శిక్షణ డేటాలో ఎలాంటి మార్పు ఉండదు. కేవలం పేరు మార్చడం వల్ల ప్రమాదం తగ్గుతుందని భావించడం తప్పుడు భ్రమ అని నిపుణులు అంటున్నారు.

సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే ప్రధాన ముప్పులు ఏమిటి?

సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల ఆటోమేటెడ్ ఆయుధాలు, డీప్‌ఫేక్‌లు, సైబర్ దాడులు, ఉద్యోగ నష్టాలు, అసమానతలు పెరగొచ్చు. మానవ ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం హ్యూమన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.

AI/SI ప్రమాదాలను నివారించడానికి నిపుణులు ఏం సూచిస్తున్నారు?

ప్రమాదాలను నివారించడానికి కేవలం పేర్లు మార్చడం సరిపోదని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు, కఠినమైన సాంకేతిక నియంత్రణ అత్యవసరంగా అవసరం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
WhatsApp Android Redesign: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
Advertisement

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Hyderabad dating app scam: డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
డేటింగ్ పేరుతో పబ్‌కు తీసుకెళ్లి 29వేలు బిల్ కట్టించింది. హైదరాబాద్ టెకీకి షాక్ ఇచ్చిన సుందరి
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Embed widget