WhatsApp Android Redesign: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
WhatsApp Android Redesign: వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త డిజైన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఐఫోన్ లాంటి నావిగేషన్ అభివృద్ధి చేయనుంది.

WhatsApp Android Redesign: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలో కొత్త ఐఫోన్ లాంటి సరికొత్త నావిగేషన్ డిజైన్ లభించనుంది. యాప్ ఇంటర్‌ఫేస్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు కంపెనీ ఈ మార్పులు చేపడుతోంది.
నావిగేషన్ బార్
వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యాప్ దిగువ నావిగేషన్ బార్ కోసం సరికొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి రౌండ్ కార్నర్స్ ఉండటం వల్ల ఇది ఒక ఫ్లోటింగ్ బార్‌లా కనిపిస్తుంది. ఈ డిజైన్ ఐఫోన్‌లోని వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌ను చాలావరకు పోలి ఉంటుంది. ఐఓఎస్‌లో యాపిల్ డిజైన్‌ను పోలిన విధంగా నావిగేషన్ ఎలిమెంట్లను తీసుకొచ్చింది. అదే కాన్సెప్ట్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్‌లోనూ తీసుకువస్తున్నారు. అయితే, ఇది ఐఫోన్ డిజైన్‌ను పూర్తిగా కాపీ చేయకుండా గూగుల్ డిజైన్ కు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ కొత్త డిజైన్ లైట్ థీమ్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే డార్క్ థీమ్‌లో మాత్రం ఈ తేడా అంతగా కనిపించకపోవచ్చు.
Also Read: మీ ఫోన్ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
బీటా వెర్షన్
ఈ కొత్త మార్పు ప్రస్తుతం ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా వెర్షన్ 2.26.38.10లో డెవలప్ చేశారు. దీని అర్థం ఇది ఇంకా బీటా కస్టమర్లకు అందుబాటులోకి రాలేదని, సాధారణ యూజర్లకు చేరేందుకు కొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. దాదాపు మూడేళ్ల క్రితం చాట్స్, కమ్యూనిటీస్, అప్‌డేట్స్, కాల్స్ వంటివి స్క్రీన్ దిగువకు మార్చిన వాట్సాప్.. ఇప్పుడు అదే నావిగేషన్ బార్‌కు కొత్త రూపాన్ని ఇస్తోంది. యాప్‌ను మరింత ఆకర్షణీయంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి మెటా కొత్త సాంకేతికతను తీసుకొస్తుంది. అయితే ఈ కొత్త డిజైన్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తారనేదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
ట్రెండింగ్ వార్తలు






















