WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
WhatsApp AI Identifier: మెటా వాట్సప్‌లో సరికొత్త ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఏఐ కంటెంట్, ఏఐ ఇమేజ్‌లు, ఏఐ వీడియో, ఆడియాలోను గుర్తించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

WhatsApp AI Identifier: భారత్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ 'వాట్సప్'. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ దీనిని ఉపయోగిస్తారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి మెటా వాట్సప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా... వాట్సప్ పోస్ట్‌లో ఉపయోగించిన ఫొటో, వీడియో, మీడియాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సృష్టించారా లేదా ఎడిట్ చేశారా? అనేది తెలుసుకునేందుకు కొత్త ఫీచర్‌ను మెటా తీసుకొచ్చింది. మొదటిగా ఐఫోన్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త AI ఫీచర్ సెలెక్టెట్ బీటా టెస్టర్లకు మాత్రమే కనిపిస్తోంది. టెస్టింగ్ తర్వాత ఆండ్రాయిడ్, iOS యూజర్లకు విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి సాధారణ యూజర్లకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
Also Read: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
AI కంటెంట్ లేబుల్
వాట్సప్ ఈ కొత్త ఫీచర్‌ను iOS బీటా వెర్షన్ 26.34.10.70 ద్వారా టెస్ట్‌ఫ్లైట్ వినియోగదారులకు అందిస్తోంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత, వాట్సప్‌లో వచ్చే ఏఐ కంటెంట్, ఫొటోలు, మార్ఫింగ్ వీడియోలకు ఈ లేబుల్ యాడ్ అవుతుంది. దీంతో వాట్సప్ యూజర్లు ఈజీగా ఏఐ కంటెంట్ అని గుర్తించగలుగుతారు. ఒకసారి AI కంటెంట్ లేబుల్ యాడ్ అయితే.. ఆ లేబుల్‌ను తొలగించడానికి అవకాశం ఉండదు.
Also Read: Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్
త్వరలోనే అందుబాటులోకి
ఈ ఫీచర్‌ను ఏయే దేశాల్లో అందుబాటులోకి వస్తుందో మెటా ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతానికి, ఐఫోన్ వినియోగదారులు తమ వాట్సప్ ఛానెల్లో AI కంటెంట్ లేబుల్స్ కనిపించకపోతే, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాట్సప్ ఈ ఫీచర్‌ను క్రమంగా వ్యక్తిగత ఖాతాలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఏఐ కంటెంట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. కొన్ని దేశాలలో, AI ద్వారా క్రియేట్ చేసిన మీడియా గురించి ఛానల్ అడ్మిన్లు చట్టబద్ధంగా సమాచారం అందించాల్సి ఉంటుంది. చాలా వేగంగా విస్తరిస్తోన్న ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు వాట్సప్ త్వరలో ఈ ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read: స్క్రీన్షాట్లు తీసే అలవాట్లు జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది! కొత్త పరిశోధనలో షాకింగ్ ఫలితాలు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















