అన్వేషించండి

Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్

టిమ్ కుక్ Apple CEO పదవికి రాజీనామా చేశారు, ఇకపై ఆయన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసుకుందాం.

Apple CEOగా దాదాపు 15 సంవత్సరాల పాటు కంపెనీని నడిపించిన టిమ్ కుక్ పదవీకాలం ముగిసింది. 2026 ఆగస్టు 31 CEOగా ఆయన చివరి రోజు సేవలు పూర్తయ్యాయి. అయితే, టిమ్ కుక్ Apple కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. ఆయన కంపెనీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నేటి (సెప్టెంబర్ 1) నుంచి జాన్ టర్నస్ Apple కొత్త CEOగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత ఉందో తెలుసుకుందాం.

టిమ్ కుక్ నికర ఆస్తి విలువ వివరాలు

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, టిమ్ కుక్ మొత్తం నికర ఆస్తి విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు అని సమాచారం. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 26 వేల కోట్లకు సమానమని చెప్పవచ్చు. ఆయన ఆస్తిలో ప్రధాన భాగం Apple నుంచి వచ్చిన షేర్లు, జీతం, ఇతర చెల్లింపుల ద్వారా సమకూర్చుకున్నారు.

టిమ్ కుక్ వద్ద Apple సంస్థకు చెందిన 30 లక్షలకు పైగా షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను బట్టి ఆయన మొత్తం ఆస్తి అంచనా సైతం ఎప్పటికప్పుడూ మారుతుంటుంది. అందుకే టిమ్ కుక్ నికర ఆస్తి విలువ కాలక్రమేణా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది.

15 ఏళ్ల పాటు Apple సీఈవోగా బాధ్యతలు

ఆగస్టు 2011లో టిమ్ కుక్ Apple CEOగా బాధ్యతలు చేపట్టారని తెలిసిందే. యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తర్వాత ఆయన ఈ బాధ్యతను చేపట్టారు. టిమ్ కుక్ నాయకత్వంలో Apple సంస్థ iPhoneతో పాటు యాపిల్ వాచ్ (Apple Watch), ఎయిర్ పాడ్స్, ఇతర విభిన్న సేవల్లో కంపెనీని ముందుకు తీసుకెళ్లింది.

టిమి కుక్ హయాంలో Apple ప్రపంచంలోనే అత్యంత పెద్ద, విలువైన టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కంపెనీ వ్యాపారంతో పాటు సప్లై చైన్, ఇతర కీలక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంతో టిమ్ కుక్ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు.

Apple కొత్త సీఈవో ఎవరు?

Apple సంస్థ 2026 ఏప్రిల్‌లోనే నాయకత్వ మార్పును తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జాన్ టర్నస్ 2026 సెప్టెంబర్ 1న Apple CEOగా బాధ్యతలు చేపడతారు. టర్నస్ ప్రస్తుతం యాపిల్ కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

టిమ్ కుక్ ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా Appleలోనే పనిచేస్తారు. ఆయన కంపెనీ బోర్డు, ఇతర బాధ్యతలతో కలిసి పనిచేస్తారు. అలాగే, తన అనుభవంతో Apple భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించనున్నారు.


CEOగా తన చివరి రోజున టిమ్ కుక్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. తన ఎక్స్ ఖాతాలో.. తన చివరి రోజు గురించి ప్రస్తావించారు. యాపిల్ CEOగా తన హోదా ఇక మారుతుందని, కానీ ఆపిల్ కమ్యూనిటీ పట్ల తన ప్రేమ ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు.     

తన ఈ పోస్ట్‌లో కుక్ ఇలా రాశారు, "CEOగా నా చివరి రోజున ఆపిల్ కమ్యూనిటీకి బోలెడంత ప్రేమ. రేపు నా హోదా (టైటిల్) మారుతుంది, కానీ ఆపిల్ కమ్యూనిటీ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. ఎల్లప్పుడూ నాకు ప్రేరణగా నిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా కృతజ్ఞతలు అపారమైనవి, మరియు నా జీవితంలోని తదుపరి అధ్యాయం కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను."  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget