అన్వేషించండి

Android Apps వినియోగదారులకు అలర్ట్ ! మీ మొబైల్‌లో ఈ యాప్స్ ఉంటే రిమూవ్ చేయండి: MHA వార్నింగ్

పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి, ప్రజలలో అవగాహన పెంచడానికి కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా హెచ్చరికలు, సలహాలను జారీ చేస్తోంది. తద్వారా సైబర్ నేరాలను నివారించవచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆండ్రాయిడ్ యాప్స్‌తో ఆర్థిక సైబర్ నేరాలు పెరుగుతున్నాయని I4C హెచ్చరించింది.
  • ప్రమాదకర యాప్‌లు ఫోన్ నియంత్రణతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి.
  • నమ్మకమైన యాప్ స్టోర్‌ల నుండి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలని MHA సూచించింది.
  • అనుమానాస్పద యాప్‌లకు దూరంగా ఉండండి, మోసాలను 1930కు నివేదించండి.

మోడ్రన్ డేస్‌లో ఒకవైపు కమ్యూనికేషన్ మాధ్యమాల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థల వరకు ప్రతి ఒక్కరి చేతిలో టెక్నాలజీ వాడకంతో ఇంటర్నెట్ ఉంటుంది. టెక్నాలజీ వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో సైబర్ నేరాలు సైతం అంతే వేగంగా పెరుగుతున్నాయి. టెక్నాలజీని వాడి ఆన్‌లైన్ మోసాలు, బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు కాజేస్తున్నారు. ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్‌లైన ఫేక్ యాప్స్, డేంజరస్ యాప్స్ వల్ల సైబర్ నేరగాళ్లు మీ మొబైల్ ఫోన్లను కంట్రోల్ లోకి తెచ్చుకుంటున్నారు. ఆ తరువాత వారి సమ్మతి, అనుమతి లేకుండా ఆర్ధిక లావాదేవీలు జరిపి బ్యాంక్ ఖాతాలో ఖాళీ చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ (MHA) పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం కొత్త అడ్వైజరీని జారీ చేసింది.

I4Cకి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ త్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ప్రకారం, ఆండ్రాయిడ్ యాప్‌లతో ముడిపడి ఉన్న ఆర్థిక మోసాల కేసులు పెరిగినట్లు తెలిపింది. ఈ యాప్‌ల ప్రచారం ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే యాడ్స్ ద్వారా జరుగుతోంది. సంబంధిత విభాగం గత వారం బుధవారం (ఆగస్టు 26) జారీ చేసిన అడ్వైజరీలో ‘Night Play, Kyss, Reloop, Vimo, Rivo, Nexo, Vixa’ వంటి పేర్లతో నడుస్తున్న appsను గుర్తించింది. ఇవే కాకుండా ఈ తరహాకు చెందిన మరికొన్ని వేరియంట్లు కూడా యాక్టివ్‌గా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది.

MHA అడ్వైజరీలో ఏం చెప్పింది?

ఆ అడ్వైజరీ ప్రకారం, కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే ఈ విభాగం.. వినియోగదారులను మొదట అశ్లీల కంటెంట్ ఇచ్చే వెబ్‌సైట్‌లకు తీసుకెళ్లే ప్రకటనల ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని తెలిపింది. ఆ తర్వాత ఈ వెబ్‌సైట్‌లలో గూగుల్ ప్లే స్టోర్ (Google Play store) బయటి సోర్స్ నుంచి ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అంటే APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులను ప్రేరేపిస్తుంటారు.

మొబైల్ ఫోన్‌లో యాప్ పూర్తిగా ఇన్‌స్టాల్ అయిన తర్వాత, అది వినియోగదారుని నుంచి ఫోన్ యాక్సెసిబిలిటీ యాక్సెస్‌తో సహా అనేక అనుమతులను కోరుతుంది. వినియోగదారులు గనుక పొరపాటున ఈ యాప్‌ వాడేందుకుగానూ ఈ అనుమతులన్నీ ఇచ్చేస్తే, ఆ మాల్వేర్ ఫోన్‌పై నియంత్రణను తెచ్చుకుంటుంది. దాంతో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ యాప్ నిరంతరం యాక్టివ్‌గా ఉంటుంది.

సైబర్ నేరగాళ్లు యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను ఉపయోగించి ఫోన్ స్క్రీన్‌పై కనిపించే సమాచారాన్ని చదవడంతో పాటు కొన్నిసార్లు బటన్‌లను క్లిక్ చేయగలరు. ముఖ్యంగా వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) లేదా పిన్ నంబర్లను నమోదు చేయగలరు. దాంతో ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసి మీ డబ్బును కూడా బదిలీ చేస్తారు. దీనివల్ల సంబంధిత వ్యక్తి బ్యాంక్ ఖాతాకు అనధికారిక ప్రవేశం పొంది మీ క్యాష్ ఆన్‌లైన్ ద్వారానే దొంగిలించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ ద్వారా పంపే సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం సైతం పెరుగుతుంది.

మంత్రిత్వ శాఖ (MHA) సూచించిన ఉపాయాలు ఇవే

NCTAU ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి కొన్ని సలహాలు ఇచ్చింది. యాప్‌లను కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర నమ్మకమైన యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రకటనలు, అనుమానాస్పద వెబ్‌సైట్‌లు లేదా తెలియని లింక్‌ల ద్వారా ప్రచారం చేసే ఏ రకమైన APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం చేయవద్దు. ఏదైనా అనుమానాస్పద యాప్‌కి కూడా ఫోన్ యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇవ్వకూడదు. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను క్రమం తప్పకుండా చెక్ చేసుకుని, మీ ప్రమేయం లేకుండా లేదా తెలియకుండా ఇన్‌స్టాయి అయిన యాప్‌లను వెంటనే రిమూవ్ చేయాలి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఎనేబుల్ చేసి ఉంచాలి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి. 

మీ బ్యాంక్ ఖాతాలు, UPI లావాదేవీలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఏదైనా నకిలీ యాప్ లేదా సైబర్ నేరాలకు గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా ప్రభుత్వ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. 

Frequently Asked Questions

ఆండ్రాయిడ్ యాప్‌ల వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఏ సంస్థ హెచ్చరించింది?

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్‌ల వల్ల ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయని అది పేర్కొంది.

ప్రమాదకరమైన యాప్‌లు మొబైల్ ఫోన్‌లను ఎలా నియంత్రిస్తాయి?

అవి సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వ్యాప్తి చెంది, బయటి నుండి APK ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయమని కోరతాయి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత, అవి యాక్సెసిబిలిటీ అనుమతులు అడిగి, ఫోన్‌ను నియంత్రిస్తాయి.

సైబర్ మోసాల నుండి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

యాప్‌లను Google Play Store నుండే ఇన్‌స్టాల్ చేయాలి. అనుమానాస్పద యాప్‌లకు యాక్సెసిబిలిటీ పర్మిషన్ ఇవ్వకూడదు, Android OS ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి.

సైబర్ మోసానికి గురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి?

వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయాలి. లేదా ప్రభుత్వ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!
AI Chatbots: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?
Wired vs Wireless Internet: వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
వైర్డ్ వర్సెస్ వైర్‌లెస్ ఇంటర్నెట్.. మీ ఇంటికి ఏ కనెక్షన్ బెస్ట్?
Advertisement

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget