మోహన్ పెదపాటి స్వస్థలం రాజమహేంద్రవరం దగ్గర్లోని కొండగుంటూరు, ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు.
Open AI Hacking: ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన భారత టెకీలు.. ఏపీకి చెందిన ఒకరు.. లోపాన్ని సరిదిద్దుకున్న సంస్థ!
Open AI Hacking: ఏపీకి చెందిన మోహన్ పెదపాటి సహా ముగ్గురు భారతీయులు ఓపెన్ ఏఐని హ్యాక్ చేశారు. బగ్ బౌంటీ పరిశోధనలో భాగంగా ఈ హ్యాకింగ్ జరిగింది.

- ఏపీకి చెందిన మోహన్ పెదపాటి, హ్యాక్ట్రాన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు.
Open AI Hacking: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ 'ఓపెన్ ఏఐ' ను ముగ్గురు భారతీయులు హ్యాక్ చేశారు. వీరిలో ఒకరిది ఏపీ కావడం విశేషం. ఈ ముగ్గురు టెక్ పరిశోధకులు ‘ఓపెన్ ఏఐ’ హ్యాక్ చేసి సంచలనం సృష్టించారు. ఆ సంస్థ నిర్వహించిన బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా హ్యాక్ చేశారు. ఓపెన్ ఏఐ ఇటీవల బగ్ బౌంటీ ప్రోగ్రామ్ నిర్వహించగా.. సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ హ్యాక్ట్రాన్ ఏఐకు చెందిన హర్ష్ జైశ్వాల్, మోహన్ పెదపాటి, రాహుల్ మైనీలు పాల్గొన్నారు. ఈ ముగ్గురు టెక్ పరిశోధకులు 72 గంటల పాటు కృషి చేసి, ఓపెన్ ఏఐ ప్రైవేట్ రిపాజిటరీలో బగ్‌ను గుర్తించి, యాక్సెస్ చేయగలిగారు. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐకు వివరించారు. ఆ లోపాన్ని ఓపెన్ ఏఐ సరిచేసుకుంది. బగ్ బౌంటీ కింద వీరి 6,500 డాలర్ల అంటే సుమారు రూ.6.23 లక్షల రివార్డు అందించింది.
హ్యాక్ట్రాన్ సహ వ్యవస్థాపకుడు
మోహన్ పెదపాటి, హర్ష్ జైస్వాల్, రాహుల్ మైనీ ఈ ముగ్గురు పరిశోధకులు సైబర్‌సెక్యూరిటీ స్టార్టప్ హ్యాక్ట్రాన్ AIలో పనిచేస్తున్నారు. వీరు చాలా ఏళ్లుగా సాఫ్ట్వేర్ లోపాలను కనుగొనడం, సిస్టమ్‌లను పరీక్షించడం, బగ్-బౌంటీ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం వంటివి చేస్తున్నారు. హ్యాక్ట్రాన్ ప్రకారం మోహన్, మైనీలతో పాటు జైస్వాల్ ఈ ఓపెన్ ఏఐ బగ్ కనుక్కోవడానికి పరిశోధన చేశారు. ఓపెన్ ఏఐని హ్యాక్ చేసిన టీమ్‌లో ఒకరైన మోహన్ పెదపాటి.. హ్యాక్ట్రాన్ ఏఐ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ సంస్థకు సీటీవోగానూ ఉన్నారు. ఏపీలోని రాజమహేంద్రవరం దగ్గర్లోని కొండగుంటూరు ప్రాంతానికి చెందిన మోహన్.. సంపత్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. నూజివీడు ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి... ఎథికల్ హ్యాకింగ్‌పై ఆసక్తితో సైబర్ సెక్యూరిటీ కంపెనీ స్థాపించారు. అనేక సాఫ్ట్ వేర్ సంస్థలకు చెందిన బగ్‌లను గుర్తించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నట్లు మోహన్ పెదపాటి తెలిపారు.
Also Read: గ్రే గ్రోత్ నుంచి గ్రీన్ గ్రోత్ వైపు అడుగులు - డీకేతో కలిసి ది ఎర్త్ సెంటర్ ప్రారంభించిన చంద్రబాబు
మోహన్ పెదపాటి వెబ్ ఎక్స్‌ప్లాయిటేషన్, సోర్స్-కోడ్ రివ్యూ, మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీలో నైపుణ్యం కలిగి ఉన్నారు. హ్యాక్ట్రాన్కు ముందు, ఆయన ఎలక్ట్రోవోల్ట్ ఇన్ఫోసెక్ను స్థాపించి, క్యూర్53లో సెక్యూరిటీ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అతను ఈగెన్ వెక్టర్స్లో డేటా సైన్స్ ఇంటర్న్‌గా కూడా పనిచేశారు. అక్కడ స్పీచ్ రికగ్నిషన్ కోసం రికరెంట్ న్యూరల్ నెట్‌వర్క్‌లను పరిశోధించారు.
Also Read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
Frequently Asked Questions
మోహన్ పెదపాటి స్వస్థలం ఎక్కడ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















