అన్వేషించండి

AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

AI Danger: మానవాళికి ఏఐ నుంచి పెనుముప్పు ఉందని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. అయితే దీనిపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కృత్రిమ మేధస్సు (AI) అణు ఆయుధాల స్థాయి ముప్పు కలిగించవచ్చు.
  • ఆంత్రోపిక్ నిపుణుడు ఈవాన్ హుబింగర్ మానవాళి ఉనికికే ముప్పు అన్నాడు.
  • సైబర్‌దాడులు, తప్పుడు సమాచారం, ఆయుధాలకు AI వాడకం ప్రమాదకరం.
  • ఏఐ పర్యవేక్షణ, నిబంధనలు, అంతర్జాతీయ సహాయం అత్యవసరమని నిపుణులు.

AI Danger: కృత్రిమ మేధస్సు (AI) మన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. హెల్త్, ఎడ్యుకేషన్, సైన్స్, సాంకేతికతలో AI గణనీయమైన మార్పులను తీసుకువస్తున్నప్పటికీ, దాని వల్ల వచ్చే ప్రమాదాల గురించి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఆంత్రోపిక్‌తో సంబంధం ఉన్న ఒక నిపుణుడు ఇటీవల చేసిన ఓ హెచ్చరిక ఏఐపై మరింత ఆందోళన రేకెత్తిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో, అత్యంత అధునాతన AI, అణ్వాయుధాలతో సమానమైన స్థాయిలో మానవులకు ముప్పు కలిగించవచ్చని ఆయన అంటున్నారు.  

ఏఐ మానవాళికి పెద్ద ముప్పు 

ఏఐ సెక్యూరిటీపై పనిచేసే ఆంథ్రోపిక్ ఎక్స్‌పర్ట్ ఇవాన్ హుబింగర్, ఏఐ వ్యవస్థలు మరింత అభివృద్ధి చెందింతే, మానవాళి ఉనికికే ముప్పును ఎదురవ్వచ్చని హెచ్చరించారు. రాబోయే దశాబ్దంలో ఏఐ మానవుల స్థానాన్ని భర్తీ చేసే అవకాశం 10 శాతానికి పైగా ఉందని ఆయన అంచనా వేశారు. అయితే ఈ అంచనాకు ఒక కచ్చితమైన ఆధారం లేదని, కేవలం జరగబోయే ప్రమాదాల అంచనా మాత్రమే అన్నారు. 

అణ్వాయుధాలతో పోలిక ఎందుకు?

అణ్వాయుధాలు భారీ విధ్వంసం సృష్టిస్తాయి. ఏఐ వల్ల జరిగే ముప్పు భిన్నమైన రీతిలో ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు సైబర్‌దాడులు, తప్పుడు సమాచారం, నిఘా, ఆయుధ కార్యకలాపాలను చాలా వేగంగా, భారీ స్థాయిలో సులభతరం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైబర్ దాడులు, గూఢచర్యం, మోసం, ఆయుధాలకు తప్పుడు మార్గంలో ఉపయోగించడానికి ఏఐను ఉపయోగించే అవకాశం ఉందని ఆంథ్రోపిక్ ఇటీవలి నివేదికలో తెలిపింది. వీటిల్లో కొన్నింటిని తాము అడ్డుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. రాబోయే మూడు సంవత్సరాలలో ఏఐ మానవ నాగరికతను నాశనం చేయడం ప్రారంభిస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.  

Also Read: యాపిల్ షాకింగ్ నిర్ణయం.. ఐఫోన్ 17 సహా ఓల్డ్ మోడళ్ల ధరలు భారీగా పెంపు

AI చాలా శక్తివంతంగా  

AI వ్యవస్థలు తమ సామర్థ్యాలను సొంతంగా మెరుగుపరచుకునే సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉందని నిపుణులలో నెలకున్న ప్రధాన ఆందోళన.  ఏఐ, సూపర్‌ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై  పరిశోధనలు ఈ చర్చకు దారితీసింది. ఏఐ అభివృద్ధి వేగాన్ని ప్రశ్నిస్తూ, ఆంథ్రోపిక్ మాజీ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ కూడా కంపెనీకి రాజీనామా చేశారు. ముందుకెళ్లాలనే ఏఐ కంపెనీల మధ్య పోటీ, భద్రతాపరమైన ఆందోళనలను బయటకు రాకుండా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Also Read: Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి

ఏఐకి భయపడాల్సిన అవసరం ఉందా?

ప్రెజెంట్ AI గురించి వినిపిస్తున్న హెచ్చరికలు భవిష్యత్తు అవకాశాలపై ఆధారపడి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. AI మానవాళిని అంతం చేస్తుందనే వాదనలపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఎక్స్‌పర్ట్స్ దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తుంటే, మరికొందరు మరింత జాగ్రత్త ఉండాలని, తక్షణ ప్రమాదాలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. అయినప్పటికీ, ఏఐ వినియోగం పెరగడంతో, భద్రతా నిబంధనలు, పర్యవేక్షణ, అంతర్జాతీయ సహాయం అవసరంపై ఏకాభిప్రాయం పెరుగుతోంది. ఏఐ శక్తి వేగంగా పెరుగుతున్న కొద్దీ, భద్రతా వ్యవస్థలను మరింత వేగంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. 

Also Read: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!

Frequently Asked Questions

కృత్రిమ మేధస్సు (AI) వల్ల ప్రధానంగా వచ్చే ప్రమాదాలు ఏమిటి?

నిపుణుల ప్రకారం, అధునాతన AI వ్యవస్థలు అణ్వాయుధాలతో సమానమైన స్థాయిలో మానవాళికి ముప్పు కలిగించవచ్చు. ఇవి సైబర్ దాడులు, తప్పుడు సమాచారం, గూఢచర్యం, ఆయుధ కార్యకలాపాలను వేగవంతం చేయగలవు.

AIని అణ్వాయుధాలతో ఎందుకు పోలుస్తున్నారు?

అణ్వాయుధాల వలె AI భారీ విధ్వంసం సృష్టించగలదు. అత్యంత శక్తివంతమైన AI సైబర్ దాడులు, తప్పుడు సమాచారం వ్యాప్తి, నిఘా, ఆయుధ కార్యకలాపాలను సులభతరం చేస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

AI శక్తి గురించి నిపుణులలో ప్రధాన ఆందోళన ఏమిటి?

AI వ్యవస్థలు తమ సామర్థ్యాలను సొంతంగా మెరుగుపరచుకునే సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇది సూపర్‌ఇంటెలిజెన్స్ వంటి అంశాలకు దారితీయవచ్చు.

AI నుండి మానవాళికి తక్షణ ప్రమాదం ఉందా?

ప్రస్తుత AI హెచ్చరికలు భవిష్యత్తు అవకాశాలపై ఆధారపడి ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, భద్రతా నిబంధనలు, పర్యవేక్షణ అవసరమని ఏకాభిప్రాయం పెరుగుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
Advertisement

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget