అన్వేషించండి

Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి

Wired Earphonesతో ఫోన్‌ను ఛార్జ్ చేయడం తేలిక. అయితే ఛార్జింగ్ పోర్ట్‌ను బ్లాక్ చేయకుండా ఇయర్‌ఫోన్‌లు పెట్టుకునే సులభమైన ట్రిక్ మీకు ఉపయోగపడుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్మార్ట్‌ఫోన్లలో 3.5mm జాక్ లేకపోవడంతో Type-C పోర్ట్ సమస్య.
  • USB Type-C అడాప్టర్‌తో ఒకేసారి ఆడియో, ఛార్జింగ్ చేసుకోవచ్చు.
  • అన్ని అడాప్టర్‌లు ఆడియో, ఛార్జింగ్ సపోర్ట్ చేయవు, సరిచూడాలి.
  • కొనేముందు ఫోన్ మోడల్, ఛార్జింగ్ సామర్థ్యం తప్పక తనిఖీ చేయండి.

నేటి రోజుల్లో ఎక్కువశాతం స్మార్ట్‌ఫోన్లలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ రావడం లేదు. అలాంటి పరిస్థితిలో మీరు Wired Earphones వాడితే తరచూ  సమస్య ఎదురవుతుంది. ఫోన్‌లోని USB Type-C పోర్ట్‌ను ఛార్జింగ్‌కూ, ఆడియో కోసం ఉపయోగించాల్సి వస్తుంది. ఫోన్ ఛార్జ్ చేస్తూనే Wired Earphones పెట్టుకోవడం కష్టమే. అయితే, దీనికి ఒక సులభమైన విధానం ఉంది.

ఒక చిన్న అడాప్టర్ చాలు

మీ సమాచారం కోసం మీ ఫోన్‌లో కేవలం USB Type-C పోర్ట్ మాత్రమే ఉంటే మీరు యూఎస్‌బీ టైప్-సి లేదా audio and charging adapterను ఉపయోగించుకోవాలి. ఈ చిన్న డివైస్ ఫోన్‌లోని ఒక Type C పోర్ట్‌ను 2 వేర్వేరు కనెక్షన్లుగా మారుస్తుంది. సాధారణంగా ఇందులో ఒక పోర్ట్ Wired Earphones కోసం, మరో పోర్ట్ Charging Cable కోసం వాడుకోవాలి. దాంతో ఒకేసారి పాటలు వినొచ్చు, అదే సమయంలో కాల్ చేయొచ్చు. అలాగే ఫోన్ బ్యాటరీని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. 

 ఎలా ఉపయోగించాలి?

ముందుగా మీ ఫోన్‌లోని USB Type-C పోర్ట్‌లో ఆడియో outputతో పాటు ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేసే adapterను పెట్టాలి. ఆ తర్వాత Wired Earphonesను adapterలోని ఆడియో పోర్ట్‌కు కనెక్ట్ చేయాలి. Charging Cableను మరో పోర్ట్‌లో పెట్టాలి. కనెక్షన్ అయిన తర్వాత ఫోన్ Earphonesను ఆడియో డివైస్‌గా గుర్తించాలి. ఇప్పుడు మీరు మ్యూజిక్, పాడ్‌కాస్ట్ లేదా వీడియోలు వింటూనే ఫోన్‌ను ఛార్జింగ్ చేయవచ్చు. 

ప్రతి Type C Adapter పనిచేయదు

మార్కెట్‌లో దొరికే ప్రతి USB Type C splitter ఆడియో, ఛార్జింగ్ రెండింటినీ ఒకేసారి సపోర్ట్ చేయదు. కొన్ని adapters కేవలం ఛార్జింగ్ లేదా డేటా ట్రాన్స్‌ఫర్ కోసం మాత్రమే తయారవుతాయి. అందుకే కొనే సమయంలో Audio + Charging support ఉందో లేదో తప్పకుండా చెక్ చేయాలి. మీ Wired Earphonesలో USB Type-C connector ఉంటే అడాప్టర్ కంపాటిబిలిటీని కూడా చూడటం అవసరం.

డిజిటల్ నుంచి అనలాగ్ కన్వర్టర్.. 

కొన్ని Type C Wired Earphonesలో DAC అంటే Digital to Analog Converter ఉంటుంది. అలాగే కొన్ని ఫోన్లు లేదా accessories ఆడియో సిగ్నల్‌ను వేరే విధంగా హ్యాండిల్ చేస్తాయి. అందుకే adapter, ఫోన్ మధ్య compatibility అవసరం. తక్కువ ధర లేదా నాసిరకం quality ఉన్న adapterను వాడితే ఆడియోలో శబ్దం, మైక్రోఫోన్ సమస్య లేదా ఛార్జింగ్ ఇబ్బంది అవుతుంది.

Wireless Earphones కొనాల్సిన అవసరం లేదు

మీకు Wired Earphones ఇచ్చే మెరుగైన, బ్యాటరీ లేని సౌకర్యం కావాలంటే కేవలం ఛార్జింగ్‌తో ఉపయోగించడానికి Wireless Earphones కొనాల్సిన పనిలేదు. సరైన compatible adapter మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఎక్కువసేపు ఫోన్‌లో వీడియోలు చూసే, గేమ్స్ ఆడే లేదా కాల్ సమయంలో ఫోన్‌ను ఛార్జ్ చేయాలనుకునే వారికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది.

కొనే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

మీరు Adapter తీసుకునేటప్పుడు మీ ఫోన్ మోడల్ compatibilityను తప్పకుండా చెక్ చేయండి. అందులో simultaneous audio, ఛార్జింగ్ సపోర్ట్ ఉందో లేదో కూడా చూడండి. మీకు Fast Charging అవసరమైతే అడాప్టర్ ఛార్జింగ్ కేపబిలిటీను కూడా చెక్ చేయాలి.

 

Frequently Asked Questions

స్మార్ట్‌ఫోన్‌లలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లేకపోవడం వల్ల ఎలాంటి సమస్య ఎదురవుతుంది?

3.5mm జాక్ లేని ఫోన్‌లలో, USB Type-C పోర్ట్ ఛార్జింగ్, ఆడియో రెండింటికీ ఉపయోగించబడుతుంది. దీనివల్ల ఫోన్ ఛార్జ్ చేస్తూనే వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వాడటం కష్టమవుతుంది.

USB Type-C పోర్ట్ ఉన్న ఫోన్లలో ఛార్జింగ్ చేస్తూనే ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడానికి పరిష్కారం ఏమిటి?

దీనికి USB Type-C ఆడియో మరియు ఛార్జింగ్ అడాప్టర్ ఉపయోగించవచ్చు. ఈ చిన్న డివైస్ ఒక Type-C పోర్ట్‌ను ఆడియో, ఛార్జింగ్ కోసం రెండు వేర్వేరు కనెక్షన్లుగా మారుస్తుంది.

ఆడియో+ఛార్జింగ్ అడాప్టర్‌ను ఎలా ఉపయోగించాలి?

మొదట అడాప్టర్‌ను ఫోన్ USB Type-C పోర్ట్‌లోకి పెట్టాలి. తర్వాత వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌ను అడాప్టర్‌లోని ఆడియో పోర్ట్‌కు, ఛార్జింగ్ కేబుల్‌ను మరొక పోర్ట్‌కు కనెక్ట్ చేయాలి.

మార్కెట్‌లో దొరికే అన్ని Type-C స్ప్లిటర్‌లు ఆడియో, ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తాయా?

లేదు, అన్ని Type-C స్ప్లిటర్‌లు ఆడియో, ఛార్జింగ్ రెండింటినీ ఒకేసారి సపోర్ట్ చేయవు. కొనే ముందు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget