అన్వేషించండి

AI analyzes Characters: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!

AI analyzes Characters: ఏఐ మీ క్యారెక్టర్ ను విశ్లేషిస్తుందా? అంటే అంత స్పష్టమైన నమూనాలేం లేవని నిపుణులు చెబుతున్నారు. కానీ సుదీర్ఘ సంభాషణలతో అంచనా వేసే అవకాశం ఉందంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • AI సంభాషణల నుండి యూజర్ల ఆలోచనలు, ప్రవర్తనలను రికార్డు చేస్తుంది.
  • గత చాట్‌ల ఆధారంగా AI మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదు.
  • చాట్‌లను విభజించి, AI అంచనాల ఖచ్చితత్వాన్ని పోల్చి చూడండి.
  • గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ, AI అంచనాల పరిమితులను అర్థం చేసుకోండి.

AI analyzes Characters: ఈ రోజుల్లో, ఏ చిన్న విషయమైనా ఏఐను అడిగేస్తున్నాం. తమ చదువులు, ఉద్యోగాలు, ఇష్టాయిష్టాలు, రోజువారీ సమస్యల గురించి కూడా చర్చిస్తున్నారు. మీ గత చాట్‌ల ఆధారంగా ఏఐ మీ వ్యక్తిత్వం గురించి అంచనా వేస్తుందా? సమాధానం తెలుసుకోవడానికి, మీరే స్వయంగా ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు. మనం AIతో మాట్లాడుతున్నప్పుడు, మన ఆలోచనలను, ప్రవర్తనను తెలియజేసే అనేక విషయాలను అది రికార్డ్ చేస్తుంది. ఉదాహరణకు, మీరు అడిగే ప్రశ్నలు, ఒక సమస్యను మీరు ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నారు, మీకు ఎంత సమాచారం కావాలి, నిర్ణయాలు తీసుకోవడంలో మీ ప్రాధాన్యతలు ఏమిటి వంటివి. కేవలం ఒకటి లేదా రెండు చాట్‌ల నుంచి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టం, కానీ సుదీర్ఘ సంభాషణల ద్వారా ఈ నమూనాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ నమూనాలు మీ ప్రవర్తన గురించి అంచనాలు వేయడానికి AIకి సహాయపడతాయి.

ఈ టెస్ట్ చేయండి 

ఒక AI చాట్‌బాట్‌తో మీరు గతంలో అడిగిన గురించి అడగండి. మీ వద్ద పాత చాట్ టెక్స్ట్ ఉంటే, దాన్ని కాపీ చేసి కొత్త చాట్‌లో అడగొచ్చు. ఆ తర్వాత, AIకి మీ వ్యక్తిత్వాన్ని నేరుగా వివరించడానికి బదులుగా, ఇలాంటి ప్రశ్న అడగండి.

"ఈ సంభాషణ ఆధారంగా నా గురించి ఏం ఊహించవచ్చు? నా ఆలోచనా శైలి, నిర్ణయాలు తీసుకునే విధానం, ఇష్టాలు, సంభాషణలను విశ్లేషించండి. చాట్‌ ఆధారంగా మాత్రమే స్పందించండి, మీకు సందేహం ఉన్నచోట ఊహించుకో." దీనిపై ఏఐ స్పందించిన తీరును జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా, మీ సంభాషణలో మీరు ఎప్పుడూ గమనించని నమూనాలను అది గుర్తిస్తుందో లేదో చూడండి.

మీ పాత చాట్‌లను రెండు పార్టులుగా చేయండి. సంభాషణలోని మొదటి భాగాన్ని AIకి అందించి, మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయమని అడగండి. ఆ తర్వాత, దాని అంచనాలు ఎంతవరకు సరిపోతున్నాయో చూడటానికి రెండో పార్టుతో పోల్చండి. 

ఉదాహరణకు, చాట్‌లోని మొదటి భాగాన్ని చూసిన తర్వాత, మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు అనేక ఎంపికలను తూకం వేస్తారని AI చెబితే, అటువంటి నమూనా నిజంగా కనిపిస్తుందో లేదో చూడటానికి సంభాషణలోని రెండో భాగాన్ని చూడండి.

ఏఐ చెప్పే ప్రతీదాన్నీ నమ్మవద్దు

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఏఐ ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి సంబంధించిన మానసిక పరీక్షను నిర్వహించలేదు. అది మెయిన్‌గా మీ టెక్స్ట్, ప్రశ్నలు, సంభాషణ సరళి నుంచి సాధ్యమయ్యే విషయాలను రాబడుతుంది. మీరు ఒక నిర్దిష్ట అంశం గురించి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటే, మీకు దానిపై ప్రత్యేక ఆసక్తి ఉందని AI భావించవచ్చు. కానీ దీని అర్థం మీ మొత్తం వ్యక్తిత్వం దాని ఆధారంగానే నిర్ణయిస్తుందని కాదు. 

గోప్యత విషయంలో జాగ్రత్త  

పాత చాట్‌లను AI మోడల్‌కు అందించే ముందు, వాటిలో ఎలాంటి వ్యక్తిగత సమాచారం లేదని నిర్ధారించుకోండి. ఫోన్ నెంబర్లు, ఇమెయిల్‌లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్, వ్యక్తిగత డాక్యుమెంట్లు, మరొక వ్యక్తికి సంబంధించిన ఇతర సున్నితమైన సమాచారాన్ని తొలగించడం ఉత్తమం. 

Frequently Asked Questions

ఏఐ వ్యక్తిత్వాన్ని ఎలా విశ్లేషిస్తుంది?

ఏఐ మన గత చాట్‌లలోని ప్రశ్నలు, సమస్య పరిష్కార విధానం, సమాచారం అవసరాలు, నిర్ణయ ప్రాధాన్యతలను రికార్డ్ చేస్తుంది. ఈ సంభాషణల నమూనాల ఆధారంగా వ్యక్తిత్వం గురించి అంచనా వేస్తుంది.

ఒకటి రెండు చాట్‌ల నుండి ఏఐ వ్యక్తిత్వాన్ని కచ్చితంగా అంచనా వేయగలదా?

ఒకటి లేదా రెండు చాట్‌ల నుంచి వ్యక్తిత్వాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టం. సుదీర్ఘ సంభాషణల ద్వారా ఈ నమూనాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

ఏఐ చేసే వ్యక్తిత్వ అంచనా మానసిక పరీక్షతో సమానమా?

కాదు, ఏఐ వ్యక్తిత్వానికి సంబంధించిన మానసిక పరీక్షను నిర్వహించదు. ఇది ప్రధానంగా మీ టెక్స్ట్, ప్రశ్నలు మరియు సంభాషణ సరళి నుండి సాధ్యమయ్యే విషయాలను మాత్రమే రాబడుతుంది.

పాత చాట్‌లను ఏఐకి ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పాత చాట్‌లను ఏఐకి అందించే ముందు, వాటిలో ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్‌లు, పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంకింగ్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం లేదని నిర్ధారించుకోవాలి. సున్నితమైన సమాచారాన్ని తొలగించడం ఉత్తమం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
స్పెషల్ డే రోజు రిటైర్మెంట్‌ ప్రకటించిన Mohammed Shami.. అభిమానులకు భావోద్వేగ సందేశం
HYDRA Hyderabad Water Crisis: తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
తగ్గిన జలమండలి నీటి సరఫరా - ట్యాంకర్లపై హైడ్రా బుల్డోజర్ - నలిగిపోతోంది ప్రజలే - ఎందుకీ టార్చర్?
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
CM Chandrababu: ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
ఎన్నికల కంటే ప్రజలే ముఖ్యమని భావించాం, అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
Lynn Cocaine Ban: డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
డోపింగ్ టెస్టులో KKR పట్టుబడ్డ  విధ్వంసకర బ్యాటర్..  కొకైన్ వాడినట్లు నిర్ధారణ.. ఆ ఆట‌గాడిపై వేటు వేసిన క్రికెట్ రెగ్యులేటర్
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
దీపావళి అమావాస్య: అలక్ష్మిని తరిమి, మహాలక్ష్మిని ఆహ్వానించే నియమాలు ఇవి!
Embed widget