అన్వేషించండి

Google Dark Web Reporting: డార్క్ వెబ్‌లో మీ డేటా ఉందా? - గూగుల్ ద్వారా తెలుసుకోండిలా!

‘గూగుల్ వన్’ ద్వారా డార్క్ వెబ్ రిపోర్టింగ్ సర్వీసును కూడా కంపెనీ అందిస్తుంది.

‘గూగుల్ వన్’ అనే సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సర్వీసును కంపెనీ అందిస్తుంది. దీని ద్వారా అదనపు స్టోరేజ్, గూగుల్ ఫొటోస్ ఎడిటింగ్ ఫీచర్ వంటి ఫీచర్లు, సర్వీసులను గూగుల్ అందిస్తుంది. అయితే దీనికి నెలవారీ నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను గూగుల్ వన్ ద్వారా మనదేశంలో అందిస్తుంది. అదే డార్క్ వెబ్ రిపోర్టింగ్ ఫీచర్.

గూగుల్ వన్ డార్క్ వెబ్ రిపోర్టింగ్ అంటే ఏంటి?
డార్క్ వెబ్ అనే పదం మనం ఇప్పటికే చాలా సార్లు విని ఉంటాం. కేవలం కొన్ని బ్రౌజర్ల ద్వారా మాత్రమే దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఇంటర్నెట్ యాక్టివిటీని ఎవరికీ తెలియకుండా, ప్రైవేట్‌గా డార్క్ వెబ్ ఉంచుతుంది. దీని ద్వారా చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు కూడా సాగుతూ ఉంటాయి. ఎన్నో పెద్ద కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించిన డేటా డార్క్ వెబ్‌లో ఎన్నో సార్లు లీక్ అయింది.

ఒకవేళ మనకు సంబంధించిన డేటా డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో చెప్పే ఫీచర్‌ను గూగుల్ వన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ పేరు, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నంబర్, సోషల్ సెక్యూరిటీ నంబర్ (మనదేశంలో ఆధార్ అనుకోవచ్చు)  వంటి సమాచారం డార్క్ నెట్‌లో ఉంటే మీకు వెంటనే సమాచారం వస్తుంది. గూగుల్ ప్రైవసీ పాలసీకి లోబడి కంపెనీ ఈ సమాచారాన్ని సేకరిస్తుంది. 

ఈ ఫీచర్‌ను ఉపయోగించడం ఎలా?
ఇంతకు ముందు వరకు కేవలం అమెరికాలోనే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మనదేశంలో కూడా దీన్ని తీసుకువచ్చారు. గూగుల్ వన్ సబ్‌స్క్రైబర్లకు దీనికి సంబంధించిన మెయిల్స్ రావడం కూడా మొదలైంది. దీన్ని గూగుల్ వన్ యాప్‌లో కూడా చూపిస్తున్నారు. ఒకవేళ మీకు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే దీన్ని ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం.

1. మీ బ్రౌజర్‌లో గూగుల్ వన్ పేజీ ఓపెన్ చేయండి.
2. మీ గూగుల్ ఖాతాలో లాగిన్ అవ్వండి.
3. అక్కడ కనిపించే ‘Dark Web Report’ పేజీలోకి వెళ్లండి.
4. అనంతరం ‘Setup’పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ వంటి వివరాలను అందించాలి. ప్రస్తుతానికి సోషల్ సెక్యూరిటీ నంబర్ మానిటరింగ్ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది.
6. ఇక్కడ మానిటరింగ్ ప్రొఫైల్ సెట్ చేయండి.
7. తర్వాతి పేజీలో అడ్రస్ ఎంటర్ చేయండి.
8. అనంతరం ‘Done’పై క్లిక్ చేశాక ప్రాథమిక స్కాన్ ప్రారంభం అవుతుంది.

ఒకవేళ మీరు అందించిన డేటాకు సంబంధించి ఏమైనా డార్క్ వెబ్‌లో కనిపిస్తే వెంటనే దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు మనదేశంలో రూ.130 నుంచి ప్రారంభం కానున్నాయి. మీ డేటా డార్క్ వెబ్‌లో ఉందన్న డౌటనుమానం ఉంటే ఒకసారి ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని డౌట్ క్లియర్ అయ్యాక ప్లాన్ నిలిపివేయవచ్చు.

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget