అన్వేషించండి

Copilot vs ChatGPT: ఛాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తున్న మైక్రోసాఫ్ట్ కోపైలట్ - రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?

Microsoft Vs OpenAI: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రోకి ఛాట్‌జీపీటీ ప్లస్ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. మరి వీటిలో ఏది బెస్ట్?

Copilot Pro vs ChatGPT Plus: మైక్రోసాఫ్ట్ ఇటీవలే దాని కోపైలట్ ఏఐ ప్రో వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇంతకుముందు కంపెనీ దీనిని ఎంటర్‌ప్రైజెస్ కోసం విడుదల చేసింది. కానీ ఇప్పుడు ఇది సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది. కోపైలట్ ప్రో అనేది ఓపెన్ ఏఐ ఛాట్‌జీపీటీ ప్లస్‌ని పోలి ఉంటుంది. దీనిలో వినియోగదారులు క్విక్ రియాక్షన్స్, జీపీటీ-4, జీపీటీ టర్బో-4 వంటి తాజా మోడళ్లకు యాక్సెస్ పొందుతారు.

దేనికి ఎక్కువ చెల్లించాలి?
భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ధర దాదాపు రూ. 2,000 కాగా, ఓపెన్ ఏఐ ఛాట్‌జీపీటీ ప్లస్ ధర రూ. 1,950గా ఉంది. రెండు మోడల్‌లు ఉపయోగిస్తున్నప్పుడు దాదాపు ఒకే విధమైన రియాక్షన్‌ను అందిస్తాయి. అంటే రియాక్షన్ స్పీడ్, ఫీచర్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.

తేడా ఏంటి?
ఛాట్‌జీపీటీ ప్లస్‌కు సభ్యత్వం పొందిన వినియోగదారులు జీపీటీ ప్రయోజనాన్ని పొందుతారు. జీపీటీ స్టోర్‌లో మూడు మిలియన్లకు పైగా కస్టమ్ జీపీటీలు లిస్ట్ అయ్యాయి. వినియోగదారులు తాము చేసే పని ప్రకారం వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రస్తుతం జీపీటీలకు సపోర్ట్ చేయదు. అయితే లాంచ్ సమయంలో ఈ ఫీచర్ త్వరలో యాడ్ అవుతుందని కంపెనీ తెలిపింది.

ఇది కోపైలట్ ప్రోతో ప్రయోజనం
మైక్రోసాఫ్ట్ 365కి సబ్‌స్క్రయిబ్ చేసుకున్న కోపైలట్ ప్రో యూజర్‌లు అనేక యాప్‌లలో ఏఐ ఫీచర్ల మద్దతును పొందుతారు. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పీపీటీ, అవుట్‌లుక్, వన్ నోట్ మొదలైన వాటిలో ఏఐ సహాయంతో వినియోగదారులు తమ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఏఐ సహాయంతో మీరు పీపీటీలను సృష్టించగలరు. పొడవైన వర్డ్ డాక్యుమెంట్‌లను సమ్మరైజ్ చేయగలరు. అవుట్‌లుకక్‌లో సింగిల్ ప్రాంప్ట్‌లో ఈ-మెయిల్స్‌ను రాయగలరు. ఛాట్‌జీపీటీ ప్లస్‌లో వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని పొందలేరు.

రెండు మోడల్స్‌లో మీరు ఫోటోలను రూపొందించడానికి డాల్-ఈ సపోర్ట్‌ని పొందుతారు. వినియోగదారులు ఏఐ సహాయంతో ఒక రోజులో 100 ఫోటోలను రూపొందించవచ్చు.

ఏది బెస్ట్?
మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో... కంపెనీలకు ఉత్తమమైనది ఎందుకంటే ఇది వారి అనేక పనులను సులభతరం చేస్తుంది. అదే సమయంలో ఛాట్‌జీపీటీ ప్లస్ డెవలపర్‌లు, సాధారణ వినియోగదారులకు చాలా బాగుంటుంది. మీరు మీ పనిని బట్టి అవసరమైన దాన్ని ఎంచుకోవచ్చు.

మరోవైపు  హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్ గతంలో మనదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు దీని భారీ తగ్గింపు అందించారు. ఏకంగా రూ.20 వేల ధరలోపే హానర్ 90 5జీని కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 66W వైర్డ్ సూపర్ ఛార్జ్ టెక్నాలజీ కూడా అందించారు. ఫోన్ వెనక 200 మెగాపిక్సెల్, ముందు వైపు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సార్‌ ఉంది. రెండు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కంపెనీ అందించనున్నట్లు తెలిపింది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Embed widget