ChatGPT vs Bard: చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను తీసుకొస్తున్న గూగుల్ - రెండిటికీ తేడా ఏమిటీ?
ChatGPTకి గూగుల్ భయపడుతోందా? గూగుల్ కొత్తగా మొదలుపెడుతున్న BARD ప్రత్యేకత ఏమిటీ?
చాట్‌జీపీటీకి గూగుల్ భయపడుతోందా? భవిష్యత్తులో గూగుల్‌కు గుదిబండగా మారనుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది. ChatGPTకి వస్తున్న పాపులారిటీ గురించి తెలుసుకున్న గూగుల్.. వెంటనే అప్రమత్తమైంది. దానికి పోటీగా.. Google Bardను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ChatGPTకి గూగుల్ పోటీనివ్వనుందా? లేదా నెటిజనులు గూగుల్ వీడి.. చాట్‌జీపీటీ బాట పట్టనున్నారా?
గూగుల్ నుంచి BARD
ChatGPT నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో BARD (బార్డ్) పేరుతో AI చాట్ బోట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ LaMDA అని గూగుల్ పిలుచుకునే తమ ఓన్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఈ బార్డ్ పని చేస్తుందని సీఈవో సుందర్ పిచాయ్ అనౌన్స్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే బార్డ్.. చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ తీసుకువచ్చిందని టెక్ ప్రపంచం మొత్తం ఫిక్స్ అయిపోయింది.
ChatGPT అంటే ఏమిటీ? గూగుల్‌కు వచ్చే నష్టమేంటీ?
ChatGPT అంటే కృత్రిమ మేధస్సు(AI)తో పనిచేసే ఒక చాట్ బోట్. అంటే మనం అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇస్తుంది చాట్ జీపీటీ. గూగుల్ లో మనం ఏదైనా ఎలా అయితే సెర్చ్ చేస్తామో చాట్ జీపీటీలో కూడా అలాగే మన ప్రశ్నేంటో టైప్ చేస్తే సమాధానం వస్తుంది. కానీ చాట్ జీపీటీలో అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం ప్రశ్నకు సమాధానం మాత్రమే వస్తుంది. గూగుల్ లోలా వందల కొద్దీ న్యూస్ ఆర్టికల్స్, యాడ్స్, వీడియోలు, ఇమేజ్‌లు.. ఈ గోలంతా ఉండదు. అదే ఇప్పుడు యూజర్స్ కు కావాల్సింది. వాళ్లకేం కావాలి? వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అందుకే, Open AI విడుదల చేసిన చాట్ జీపీటీ.. రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో గూగుల్ యూజర్స్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది. వాణిజ్యపరంగా కూడా తిప్పలు తప్పవు.
అప్రమత్తమైన గూగుల్.. త్వరలోనే BARD
చాట్ జీపీటీ సెన్సేషన్ ను గమనించిన గూగుల్ వెంటనే రెడ్ కోడ్ ను ఇష్యూ చేసింది. తమ కంపెనీ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే వ్యవస్థను తీసుకువస్తుందని అప్పుడే ప్రకటించింది. అన్నట్లుగానే బార్డ్(BARD) పేరుతో ఓ కొత్త వ్యవస్థను అతి త్వరలో ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. నిజంగా గూగుల్ చాట్ జీపీటీని చూసి భయపడిందా అంటే.. అవుననే చెప్పాలి. ఇప్పుడు గూగుల్ మేల్కొని తమకుంటూ సొంత AI వ్యవస్థను తీసుకురాకపోతే రేపు గూగుల్ చేసే పనులన్నింటీనీ చాట్ జీపీటీ హ్యాజిల్ ఫ్రీగా చేసేస్తుంది. కాబట్టి అందరూ గూగుల్ ను వదిలేసి చాట్ జీపీటీ వైపే వెళ్లిపోతారు. కేవలం రెండు నెలల్లోనే 10 కోట్ల మంది యూజర్స్ ను చాట్ జీపీటీ సంపాదించటం కూడా గూగుల్ ఇంత త్వరగా BARD తీసుకురావటానికి ప్రధాన కారణం. ఇది మరికొద్ది రోజుల్లో పబ్లిక్ కు అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ ప్రకటించింది.
రెండిటికీ తేడా ఏమిటీ?
గూగుల్ చెందిన BARD.. చాట్‌జీపీటీకి భిన్నంగా పనిచేస్తుందట. యూజర్ అడిగే ప్రశ్నలకు వెబ్‌లో రియల్‌టైమ్‌లో సర్ఫ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, ChatGPT దాని నాలెడ్జ్ రిపోజిటరీలో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందించగలదు. ChatGPT పరిజ్ఞానం 2021 వరకు మాత్రమే పరిమితం చేయబడింది. దీన్నిబట్టి చూస్తుంటే.. ఇప్పటికీ గూగుల్ వద్ద ఉన్న టెక్నాలజీ మాత్రమే తాజా సమాచారాన్ని అందించగలదు. ఇప్పటికే గూగుల్ వద్ద బోలెడంత సమాచారం ఉంది. దీనికి BARD తోడైతే యూజర్స్‌కు మరింత వెసులుబాటు కలుగుతుంది.
సో, చూడాలి ఇప్పుడు దిగ్గజ సంస్థలన్నీ పోటాపోటీగా తీసుకువస్తున్న ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రెండు మూడేళ్లలో ఇంకెన్ని మార్పులను టెక్ ప్రపంచంలో తీసుకురానున్నాయో!
Read Also: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?