News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series Sale: ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. దీని ధ‌ర భారతదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

ఐఫోన్ 15 (iPhone 15), ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన సేల్ (iPhone 15 Sale) ప్రారంభం అయింది. ఈ ఫోన్ల కోసం యాపిల్ స్టోర్ల వద్ద వినియోగదారులు క్యూ కట్టారు. ఆన్‌లైన్‌తో కూడా ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తున్నాయి. ఐఫోన్ 14 కంటే 15లో భారీ మార్పులు చేయడమే ఈ డిమాండ్‌కు కారణం. యాపిల్ అధికారిక వెబ్ సైట్లో ట్రై చేస్తే మోడల్‌ను బట్టి రెండు నుంచి మూడు వారాల మధ్యలో డెలివరీ చూపిస్తుంది.

సెప్టెంబర్ 12వ తేదీన జరిగిన యాపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్లో ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ 14 సిరీస్ కంటే ఇందులో మెరుగైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్లు చేశారు. ఈ సిరీస్‌లో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. గతేడాది ప్రో మోడల్స్‌లో అందించిన ఈ ఫీచర్లను ఇప్పుడు స్టాండర్డ్ వేరియంట్స్‌లో కూడా అందించారు. ఈ రెండు ఫోన్లలోనూ యూఎస్‌బీ టైప్-సీ పోర్టును అందించారు.

ఏ మోడల్ ఎప్పుడు డెలివరీ అవుతుంది? (iPhone 15 Series Deliveries)
యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో చూపిస్తున్న డెలివరీ ఆప్షన్ల ప్రకారం... ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి ప్రారంభ వేరియంట్ల డెలివరీ అక్టోబర్ ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. టాప్ స్టోరేజ్ వేరియంట్లు మాత్రం అక్టోబర్ 4వ తేదీ నుంచి డెలివరీ కానున్నాయి.

ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే... వీటి డెలివరీలు అక్టోబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ వేరియంట్లకు సంబంధించిన డెలివరీలు నవంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. అంటే ఆర్డర్ పెట్టిన నెలన్నర తర్వాత వీటి డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ఐఫోన్ 15, 15 ప్లస్ ధ‌రలు (iPhone 15 Price, iPhone 15 Plus Price in India)
ఐఫోన్ 15 ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 512 జీబీ స్టోరేజ్ ధరను రూ.1,09,900గా నిర్ణయించారు. కొన్ని బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్ కూడా లభించనుంది. 

దీని ప్రారంభ మోడల్ అయిన 128 జీబీ స్టోరేజ్ ధర మనదేశంలో రూ.89,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను రూ.99,900గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 512 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.1,19,900 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 15, 15 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (iPhone 15 Specifcations)
ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అంతేకాకుండా అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ వీటిలో కూడా కంపెనీ అందించింది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను  ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్ అందించనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరాను యాపిల్ అందించింది.

ఏ16 బయోనిక్ చిప్‌పై ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మొబైల్స్ పని చేయనున్నాయి. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఈ ప్రాసెసర్ అందించారు. యూఎస్‌బీ టైప్-సీతో లాంచ్ అయిన మొట్టమొదటి ఐఫోన్ సిరీస్ ఇదే కావడం విశేషం.

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Published at : 22 Sep 2023 07:16 PM (IST) Tags: iPhone 15 iPhone 15 Plus iPhone 15 Series Sale iPhone 15 Dynamic Island iPhone 15 Price in India iPhone 15 Plus Price in India iPhone 15 Sale iPhone 15 Plus Sale iPhone 15 Series Delivery Date

ఇవి కూడా చూడండి

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!

Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !

Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !

WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!

WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ

మూడు వేల కిలోమీటర్ల మైలురాయి చేరిన లోకేష్ పాదయాత్ర- 20న భోగాపురంలో ముగింపు సభ