News
News
X

Apple iPhones: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, భార‌త్‌లో ఈ మోడల్ అమ్మ‌కాల నిలిపివేత‌!

ఐఫోన్ యూజ‌ర్ల‌కు ఆపిల్ కంపెనీ షాక్‌ ఇచ్చింది. iPhone 11, 12 Mini, 13 Pro, 13 Pro Maxతో సహా పాత ఐఫోన్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

FOLLOW US: 

ఐఫోన్-14 సిరీస్ విడుదల

ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్..  ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరికొత్త ఐఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series)ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిరీస్ కింద Apple iPhone 14 Pro, 14 Pro Max ను పరిచయం చేసింది. ఈ రెండు ఫోన్‌లలో కంపెనీ పిల్ ఆకారపు నాచ్‌ ని యూజ్ చేసింది. కొత్త  ట్రూ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. ఇది డైనమిక్ ఐలాండ్ నోటిఫికేషన్‌లతో వస్తుంది. ఐఫోన్ 14 ప్రోలో కొత్త యాక్షన్ మోడ్ ఇవ్వబడింది. ఇందులో 4K వీడియో, డాల్బీ అట్మాస్‌ కు సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభ ధర రూ.79,990గా ఫిక్స్ చేసింది కంపెనీ.

పలు ఫోన్ల అమ్మకాల నిలిపివేత

ఆపిల్ 14 సిరీస్ విడుదల నేపథ్యంలో ఆపిల్‌ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది.  2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అటు iPhone 12 Mini, iPhone 13 Pro, 13 Pro Maxలను సైతం నిలిపివేసింది. GizmoChina నివేదిక ప్రకారం, టెక్ దిగ్గజం అవుట్‌ గోయింగ్ ప్రో మోడళ్లను ఆపిల్ ఐఫోన్ లైనప్‌లో కొత్త ప్రో మోడల్‌లను ప్రతి సంవత్సరం లాంచ్ చేస్తుంది. iPhone 12 Mini, iPhone 13 Pro, 13 Pro Max  మోడల్‌ల విక్రయాన్ని Apple అధికారికంగా నిలిపివేసింది. అయితే స్టాక్‌లు ఉన్నంత వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిటైలర్ల నుండి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

నిలిపివేసిన ఐఫోన్ల ప్రత్యేకతలు

ఐఫోన్ 13 ప్రో సిరీస్ కొన్ని మేజర్ అప్ గ్రేడ్స్ తో వచ్చింది ఆపిల్ కంపెనీ. ఈ సిరీస్ లోని ఫోన్లు  120Hz LTPO డిస్‌ప్లే, మెరుగైన ట్రిపుల్ కెమెరా సిస్టమ్, మెరుగైన బ్యాటరీ లైఫ్ సహా పలు ఫీచర్‌లను పరిచయం చేసింది. ఐఫోన్ 12 మినీని 2020 నుంచి నిలిపివేసింది. ఇది మొదటి మినీ ఐఫోన్. OLED డిస్‌ప్లేతో వచ్చే అత్యంత సరసమైన ఐఫోన్. అటు 2019 నుంచి iPhone 11ని నిలిపివేసింది. ఇది డ్యూయల్-కెమెరా సెటప్, 4GB RAM, 18W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొదటి బేస్ ఐఫోన్. తాజాగా యాపిల్ 'ఫార్ అవుట్ ఈవెంట్'లో Apple iPhone 14 సిరీస్‌ను ఆవిష్కరించింది.  వీటితో పాటు AirPods Pro 2nd Gen, Apple Watch Series 8, Apple Watch Ultra ఉన్నాయి.  ఐఫోన్ 13, ఐఫోన్ 12 ఫోన్లపై భారత్ లో ధర తగ్గింపు ఆఫర్ ను అందిస్తోంది.

Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?

Published at : 09 Sep 2022 03:21 PM (IST) Tags: iPhone 13 Pro iPhone 14 Series Apple iPhones iPhone 11 12 Mini 13 Pro Max

సంబంధిత కథనాలు

Oneplus Nord Watch: రూ.ఐదు వేలలోపే వన్‌ప్లస్ వాచ్ - ఏకంగా 105 స్పోర్ట్స్ మోడ్స్ కూడా!

Oneplus Nord Watch: రూ.ఐదు వేలలోపే వన్‌ప్లస్ వాచ్ - ఏకంగా 105 స్పోర్ట్స్ మోడ్స్ కూడా!

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

Apple Watch: పేలిన ఆపిల్‌ వాచ్‌- విషయాన్ని బయటకు చెప్పొద్దని వినియోగదారునికి కంపెనీ రిక్వస్ట్‌

Apple Watch: పేలిన ఆపిల్‌ వాచ్‌- విషయాన్ని బయటకు చెప్పొద్దని వినియోగదారునికి కంపెనీ రిక్వస్ట్‌

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!