Apple Airpods Pro: ఎయిర్ పోడ్స్ కొనాలనుకుంటున్నారా? - బ్లాక్ ఫ్రైడే సేల్ వరకు ఆగక్కర్లేదు - ప్రస్తుతం భారీ ఆఫర్!
యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో ఇయర్ ఫోన్స్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Black Friday Sale 2023: త్వరలో బ్లాక్ ఫ్రైడే సేల్ ఈ-కామర్స్ సైట్‌ల్లో ప్రారంభం కానుంది. ఇందులో మీకు భారీ తగ్గింపులు అందించనున్నారు. అయితే మీరు బ్లాక్ ఫ్రైడే సేల్ కోసం వేచి ఉండవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు యాపిల్ ఎయిర్ పోడ్స్ ప్రోని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, అప్పటి దాకా ఆగాల్సిన అవసరం లేదు.
బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. అయితే అనేక ఈ-కామర్స్ సైట్‌లలో పండుగ విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇవి నవంబర్ నెల అంతా కొనసాగుతాయి. ఈ సేల్స్‌లో మీరు మాక్‌బుక్, ఐఫోన్, ఇతర యాపిల్ ఉత్పత్తులతో పాటు యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోని డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రోపై ప్రస్తుతం భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో రూ. 26,900 ధరతో లిస్ట్ అయింది. అయితే పండుగ సేల్‌లో మీరు యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రోని 29 శాతం తగ్గింపుతో రూ. 18,999కి కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు మీరు ఇక్కడ ఇతర యాపిల్ ఉత్పత్తులపై కూడా గొప్ప తగ్గింపులను కూడా పొందుతారు.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మెరుగైన సౌండ్ కోసం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ని కలిగి ఉంది. ఇది 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ కూడా అందించనుంది. ఇది కాకుండా మీరు ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ని కూడా ఉపయోగించవచ్చు.
యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్‌తో వస్తుంది. కేస్‌ను ఎటువంటి వైర్లు లేదా ప్లగ్‌లు లేకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌పై ఉంచవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?