(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!
అమెజాన్‌లో ఐప్యాడ్, శాంసంగ్, లెనోవో ట్యాబ్లెట్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం అమెజాన్‌లో ఐప్యాడ్, శాంసంగ్ ట్యాబ్, లెనోవో ట్యాబ్లెట్లపై 50 శాతం వరకు ఆఫర్లు అందించారు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరో రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది.
1. 2019 యాపిల్ ఐప్యాడ్ మినీ
ఈ ఐప్యాడ్ ప్రస్తుతం రూ.33,900కే అందుబాటులో ఉంది. ఇందులో 64 జీబీ, 256 జీబీ వేరియంట్లు కొనుగోలు చేయవచ్చు. ఇక రంగుల విషయానికి వస్తే.. బ్లాక్, వైట్, పీచ్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఇది ఐదో తరం ఐప్యాడ్ మినీ. ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఐప్యాడ్ పనిచేయనుంది. ఇందులో రెటీనా డిస్‌ప్లేను అందించారు. ట్రూ టోన్, వైడ్ కలర్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఏ12 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించారు. ప్రైవసీ, సెక్యూరిటీ కోసం టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. దీంతో మీరు స్క్రీన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఐప్యాడ్ వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 7 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లను కూడా ఇందులో అందించారు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
2. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ
దీని అసలు ధర రూ.49,999 కాగా.. ఈ సేల్‌లో రూ.44,999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 12 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను అందించారు. సన్నటి మెటల్ బాడీని ఈ ట్యాబ్లెట్ కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంను కంపెనీ ఇందులో అందించడం విశేషం. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. వైఫైకి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మిస్టిక్ బ్లాక్ కలర్ వేరియంట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది ఆన్‌లైన్ క్లాసులకు, గేమింగ్‌కు ఉపయోగించవచ్చు.
3. లెనోవో ట్యాబ్ ఎం10 ఫుల్‌హెచ్‌డీ ట్యాబ్లెట్
ఒకవేళ మీకు తక్కువ ధరలో మంచి ట్యాబ్లెట్ కావాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. దీని అసలు ధర రూ.30,000 కాగా ఈ సేల్‌లో రూ.15,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. వైఫై ఆప్షన్ కూడా ఇందులో అందించారు. లెనోవో ఇతర ట్యాబ్లెట్లపై కూడా మంచి ఆఫర్లు అందించారు.
Also Read: iPhone 15 Series: ఐఫోన్లలో మొదటిసారి ఆ కెమెరాలు.. ఎప్పుడు రానున్నాయంటే?
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి