By: ABP Desam | Updated at : 02 May 2023 08:45 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo Credit: Pixabay
ఉగ్రవాదులను కట్టడి చేసే విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే దేశ భద్రతకు విఘాతం కలిగించే పలు యాప్స్ మీద బ్యాన్ విధించి కేంద్రం, మరికొన్నింటి పైనా నిషేధం వేటు వేసింది. తాజాగా 14 మోబైల్ మెసేజింగ్, కాలింగ్ యాప్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ యాప్స్ తో ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నట్లు గుర్తించిన కేంద్రం, వాటిని బ్లాక్ చేసింది. దేశ భద్రతకు ముప్పు తెచ్చే మొబైల్ అప్లికేషన్ల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తాజా నిర్ణయంతో మరోసారి రుజువైంది. సైబర్ సెక్యూరిటీ విషయంలో కఠిన నిర్ణయాలకు వెనుకాడేది లేదని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
తాజాగా బ్యాన్ విధించిన యాప్స్ లో క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, విక్రమ్, మీడియా ఫైర్, బ్రియార్, బీచాట్, నాండ్ బాక్స్, కోనియన్, IMO, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా ఉన్నాయి. ఈ యాప్స్ ద్వారా ఉగ్రవాదులు కమ్యూనికేషన్ కొనసాగిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటి ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి భారత్ లోని కొంత మంది సానుభూతిపరులు మెసేజ్ లు, కాల్స్ స్వీకరించినట్లు తేల్చాయి. జమ్మూ కాశ్మీర్‌లోని వేర్పాటువాద సంస్థలు, ఆ సంస్థల్లో పని చేసే సానుభూతిపరులకు కోడ్‌తో కూడిన సందేశాలను పంపడానికి పాక్ లోని ఉగ్రవాదులు ఈ అప్లికేషన్ లను ఉపయోగించారని నిఘా వర్గాలు దర్యాప్తులో తేలింది.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, గవర్నింగ్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A కింద 14 మొబైల్ యాప్‌ల ను బ్యాన్ చేసింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమవ్వడానికి ఉపయోగిస్తున్నారనే కారణంతో వాటికి యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
నిజానికి దేశ భద్రతకు విఘాతం కలిగించే మొబైల్ అప్లికేషన్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం కొత్తేమీ కాదు. నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటికే అనేక చైనీస్ యాప్‌లను నిషేధించింది. గత కొన్ని సంవత్సరాలుగా, భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంగా సుమారు 250 చైనీస్ యాప్‌ల పై బ్యాన్ విధించింది. వాటిలో టిక్ టాక్, షేర్ ఇట్, వుయ్ చాట్, హెలో, లైకీ, యుసి న్యూస్, బిగో లైవ్, యుసి బ్రౌజర్, గ్జిన్డెర్, క్యామ్ స్కానర్, పబ్జీ మోబైల్, గారేనా ఫ్రీ ఫైర్ లాంటి యాప్స్ తో సహా మొత్తం 250 చైనీస్ మోబైల్ అప్లికేషన్లపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆన్‌లైన్ గేమింగ్, సోషల్ మీడియా, లోన్ అప్లికేషన్‌ను నిషేధించింది. అయితే, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్‌లపై చర్య తీసుకోవడం ఇదే తొలిసారి.
Read Also: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, ఇకపై మల్టీపుల్ డివైజెస్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ వాడుకోవచ్చు!
Whatsapp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు - ఇక నంబర్ రివీల్ చేయకుండానే!
Best Prepaid Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు - జియో, ఎయిర్టెల్, వీఐ బెస్ట్ ప్లాన్లు!
Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!
Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Byjus Loan Default: బైజూస్‌కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!