అన్వేషించండి

Data Hacking: డేటా కోసం హ్యాకర్లు వాడే టాప్ కంపెనీల లిస్ట్ ఇదే- తెలిసినదే అని క్లిక్‌ చేస్తే నిండా మునిగినట్టే!

అమాయకుల డేటా చోరీ చేయడానికి తరచూ స్కామర్లు వాడే ప్రక్రియ ఫిషింగ్. ప్రముఖ సుప్రసిద్ధ కంపెనీల లోగోలతో ఈమెయిల్ చేసి నమ్మించి మన డేటా తస్కరిస్తున్నారు.

రాక్షసులు ప్రజల మాన ప్రాణాలను ఎలా తీసేవాళ్లో మనం కథల్లో వినే ఉంటాం. వారిని మనం ప్రత్యక్షంగా చూడకపోయినా అంతకంటే ప్రమాదకరమైన మోసగాళ్లను మాత్రం ఇప్పుడు చూస్తునే ఉన్నాం. అలాంటి వారే ఈ సైబర్‌ కేటుగాళ్లు. ప్రముఖ సంస్థల పేర్లనే వాడుకొని మనల్ని ముగ్గులోకి దించి నిండా ముంచేస్తారు. తెలిసిన కంపెనియే కదా అని టెంప్ట్ అయ్యారో అంతే సంగతి. 

 ఫేస్‌బుక్, ట్విటర్, మైక్రోసాఫ్ట్ కావేవి డేటా చోరీకి అనర్హం అంటారు సైబర్ నేరగాళ్లు. కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతతో అమాయకులను లూటీ చేయడానికి స్కామర్లు రోజుకో మార్గాన్ని అన్వేషిస్తున్నారు. అమాయకుల డేటా చోరీ చేయడానికి తరచూ స్కామర్లు వాడే ప్రక్రియ ఫిషింగ్. ప్రముఖ కంపెనీల పేరుతో ఈమెయల్, మెస్సేజ్ పంపిస్తారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ చెక్‌ పాయింట్ వివరాల మేరకు.. మోసాలకు పాల్పడే స్కామర్లు ప్రముఖ, సుప్రసిద్ధ కంపెనీల లోగోలతో ఈమెయిల్ చేసి నమ్మించి మన డేటా తస్కరిస్తున్నారు.

స్కామర్లు తరచూ ఈ 10 పది కంపెనీల పేర్లు వాడుకుంటూ వ్యక్తిగత, ఆర్థిక వివరాలు కాజేస్తున్నారు. 
మైక్రోసాఫ్ట్: సైబర్ నేరగాళ్లు తరచూ ఎక్కువ శాతం వాడే కంపెనీ పేరు మైక్రోసాఫ్ట్. ఈ కంపెనీ పేరుతో ఏకంగా 29 శాతం స్పామ్, ఫిషింగ్ మెయిల్స్ పంపించి ఇంటర్నెట్ వినియోగదారుల డేటా చోరీ చేస్తున్నారు.
గూగుల్: మైక్రోసాఫ్ట్ తరువాత స్కామర్లు ఎక్కువగా గూగుల్ పేరు వాడుతారు. ఈ కంపెనీకి చెందిన లోగోతో 19.5 శాతం ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.
యాపిల్: మూడో స్థానంలో యాపిల్ సంస్థ లోగోను సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు. సాధారణంగా యాపిల్ బ్రాండ్‌పై మధ్య, చిన్న తరగతి వ్యక్తుల్లో ఆసక్తి ఉంటుంది. యాపిల్ ఉత్పత్తులు వాడాలని ఎక్కువ శాతం మధ్య తరగతి యువత అనుకుంటారు. వారి బలహీనతను ఆసరగా చేసుకుని వారిని మోసగించేందుకు 5.2 శాతం ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారు.
వెల్స్ ఫార్గో: ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో ఆర్థిక సేవలు అందిస్తుంది.  అమెరికాకు చెందిన ఈ కంపెనీ 35 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  ఈ సంస్థ పేరుతో దాదాపు 4.2 శాతం మోసపూరిత స్పామ్ మెయిల్స్ వస్తున్నాయి. 
అమెజాన్: ప్రపంచ వాప్తంగా నాలుగు శాతం ఫిసింగ్ ఈమెయిల్స్ ఈ కంపెనీ నకిలీ లోగోతో వెళ్తున్నాయి. 
వాల్‌మార్ట్: అమెజాన్ తరువాత ఆర్థిక నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగించే కంపెనీ వాల్‌మార్ట్. ఈ కంపెనీ పేరు, లోగోతో 3.9 శాతం నకిలీ ఈ మెయిల్స్ పంపిస్తున్నారు. వీటి తరువాత రోబ్లాక్స్ పేరుతో 3.8 శాతం, లింక్డ్ఇన్ పేరుతో 3 శాతం, హోం డిపోట్ పేరుతో 2 శాతం నకిలీ, స్పామ్ మెయిల్స్ వెళ్తున్నాయి. చివరగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేరును వాడుతున్నారు. కేవలం ఈ కంపెనీ పేరుతో 2.1 శాతం మెయిల్స్ పంపిస్తున్నారు.

సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త పడండి ఇలా..
ఏదైనా ప్రముఖ కంపెనీ మీకోసం ప్రత్యేకంగా లాటరీ, గిఫ్ట్ ఓచర్లు ప్రకటించినట్లు ఈమెయిల్ వస్తే వాటిని నమ్మొద్దు. ప్రత్యేకమైన ఆఫర్లను ఆయా సంస్థలు అధికారిక వెబ్‌సైట్లలో ప్రకటిస్తారు. ఈ మెయిల్‌లో వచ్చిన వివరాలు, అధికారిక వెబ్ సైట్‌లో ఉన్న వివరాలను క్రాస్ చెక్ చేసుకోండి. ఆఫర్ల కోసం ముందుగా ఎటువంటి ఆర్థిక చెల్లింపులు చేయొద్దు. మీ ఆధార్, పాన్, బ్యాంక్, క్రెడిట్, డెబిట్ కార్డ్, ఓటీపీ, సీవీవీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ బ్యాంకు అధికారులు కూడా ఓటీపీ, సీవీవీ చెప్పమని ఫోన్ చేయరు. కానీ ఎవరైనా ఫోన్ చేసి వివరాలు చెప్పమని అడిగితే వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తుంచుకోండి.

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Embed widget