X

Yuvraj Singh Arrested: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్.. అలా అన్నందుకే!

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌ను హర్యాణా పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే అతను బెయిల్‌పై విడుదల అయ్యాడు. షెడ్యూల్డు కులాల వారిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడంతో యువీ అరెస్టయ్యాడు.

FOLLOW US: 

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ కావడం దుమారం రేపింది. తన సహచర క్రికెటర్‌పై చేసిన వ్యాఖ్యలు యువీని జైలు వరకు తీసుకెళ్లాయి. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఈవెంట్లో కులం పేరుతో యువీ చేసిన వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

యువరాజ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి హర్యానా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ రావడంతో కొన్ని షరతులతో మాజీ క్రికెటర్ యువరాజ్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. గత ఏడాది షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీకి చెందిన దళిత హక్కుల పోరాటకారుడు రజత్ కల్సాన్ యువీపై ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన కేసు హన్సీ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. 

అరెస్టు అయిన వెంటనే హైకోర్టు ఉత్తర్వులతో వెంటనే బెయిల్ వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు వచ్చాక యువరాజ్ తన లాయర్లతో కలసి హిసార్ చేరుకున్నాడు. కొన్ని గంటలు విచారించిన అనంతరం తిరిగి చండీఘర్ చేరుకున్నాడు. షెడ్యూల్డ్ కులాలపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద తనపై కేసు నమోదైంది.

యువరాజ్ సింగ్ మొత్తంగా 304 అంతర్జాతీయ వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు, 40 టెస్టు మ్యాచ్‌లు టీమిండియా తరఫున ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా గెలవడంలో యువరాజ్ సింగ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించాడు. 2019లో యువీ క్రికెట్ నుంచి పూర్తి స్థాయిలో రిటైరయ్యాడు.

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, పుణె వారియర్స్ ఇండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున యువరాజ్ సింగ్ ఆడాడు.

Also Read: ఐపీఎల్‌ ఫైనల్‌ ముందు ధోనీ నేర్పిన వ్యాపార పాఠమిది! ప్రశంసించిన ఆనంద్‌ మహీంద్రా

Also Read: ధోనీసేనకు అభినందనలు చెప్పినట్టే చెప్పి.. పంచ్ వేసిన గౌతమ్‌ గంభీర్‌

Also Read: టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఇదే.. ఈ ఐపీఎల్‌లో ఎంతమంది హిట్ అయ్యారో తెలుసా?

Also Read: ఈ సీజన్ లో అసలైన విజేత కోల్ కతా... ఐపీఎల్ సెకండ్ పార్ట్ లో ఆ జట్టు గొప్పగా ఆడింది... సీఎస్కే కెప్టెన్ ధోనీ కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Yuvraj Singh Yuvraj Singh Arrested Yuvraj Video Chat Yuvraj Arrested

సంబంధిత కథనాలు

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు రేపే.. తెలుగు తేజానికి అవకాశం దక్కేనా?

Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!

Kohli ODI Captaincy: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!

IND vs NZ 2nd Test: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?

IND vs NZ 2nd Test: బిగ్‌ రికార్డ్‌ బద్దలు కొట్టేందుకు అశ్విన్‌ రెడీ..! ఏంటో తెలుసా?

IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?

IND vs NZ 2nd Test: కోహ్లీ రాకతో టీమ్‌ఇండియాలో కొత్త సమస్య..! రెండో టెస్టులో...?

IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?

IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

AP NGT Polavaram :  పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?