News
News
X

WTC Final Date: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు డేట్ ఫిక్స్ - భారత్‌కు ఛాన్స్ ఉందా?

ఐసీసీ టెస్టు ఛాంపియన్ ఫైనల్ జట్లను బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ నిర్ణయించనుంది.

FOLLOW US: 
Share:

ICC World Test Championship 2023 Final: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఫిబ్రవరి 8వ తేదీన బుధవారం నాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) తేదీలను ప్రకటించింది. 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్‌కు జూన్ 12వ తేదీని రిజర్వ్ డేగా ఉంచారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదటి ఎడిషన్ చివరి మ్యాచ్ సౌతాంప్టన్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఇందులో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.

ఫైనల్‌ భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే అవకాశం
ఈసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌ భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే అవకాశం ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 75.56 విజయాల శాతంతో నంబర్ వన్ స్థానంలో ఉంది. అదే సమయంలో భారత జట్టు 58.93 విజయాల శాతంతో రెండవ స్థానంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి మధ్యే ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత నిర్ణయం
ఫిబ్రవరి 9వ తేదీ నుండి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ద్వారా ఫైనలిస్ట్ జట్లను నిర్ణయించవచ్చు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలంటే, బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో టీమ్ ఇండియా కనీసం 3-1తో ఆస్ట్రేలియాను ఓడించాలి. లేకపోతే జట్టు ఫైనల్‌కు చేరుకోవడానికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక 53.33 విజయ శాతంతో మూడో స్థానంలో ఉంది. మార్చి 9వ తేదీ నుంచి న్యూజిలాండ్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది.

బోర్డర్ గవాస్కర్ సిరీస్ షెడ్యూల్ ఇది
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (మొదటి టెస్ట్) - నాగ్‌పూర్, ఇండియా, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు.

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (రెండో టెస్ట్) - ఢిల్లీ, ఇండియా, ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (మూడో టెస్టు) – ధర్మశాల, ఇండియా, మార్చి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (నాలుగో టెస్టు) - అహ్మదాబాద్, ఇండియా, మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు.

ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.

భారత పర్యటనకు ఆస్ట్రేలియా టెస్టు జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషగ్నే, నాథన్ లియోన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్.

Published at : 08 Feb 2023 10:16 PM (IST) Tags: ICC World Test Championship Ind vs Aus ICC WTC FINAL 2021-23 ICC WTC Final 2021 23

సంబంధిత కథనాలు

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!

Kane Williamson Ruled Out: గాయపడే తిరిగొస్తివి! ఈ 'డైవ్‌'లు ఎందుకు కేన్ మామా - ఐపీఎల్‌ నుంచి ఔట్‌!

Kane Williamson Ruled Out: గాయపడే తిరిగొస్తివి! ఈ 'డైవ్‌'లు ఎందుకు కేన్ మామా - ఐపీఎల్‌ నుంచి ఔట్‌!

‘ఈ సాలా కప్ నహీ’ అంటున్న ఆర్సీబీ కెప్టెన్.. ఏంది బ్రో అంత మాటన్నావ్!

‘ఈ సాలా కప్ నహీ’ అంటున్న ఆర్సీబీ కెప్టెన్.. ఏంది బ్రో అంత మాటన్నావ్!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?