అన్వేషించండి

Wrestlers Protest: అసలు వాళ్లకు న్యాయం జరుగుతుందా? - రెజ్లర్లకు మద్దతుగా కపిల్ దేవ్, నీరజ్ చోప్రా

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది.

Wrestlers Protest: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)  అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను  అరెస్టు చేయాలని, అతడిపై విచారణ కమిటీ నివేదికను బట్టబయలు చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది.  రెజ్లర్ల ధర్నా నేటికి ఆరో  రోజుకు చేరుకుంది.  2021 టోక్యో ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా,  1983లో నిర్వహించిన వన్డే వరల్డ్ కప్ లో  భారత్‌కు సారథిగా వ్యవహరించిన మాజీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్, ఒలింపిక్ ఛాంపియన్ షూటర్ అభినవ్ బింద్రా‌లు  రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు.  న్యాయం కోరుతూ  క్రీడాకారులు రోడ్లమీదకు రావడం తనను ఎంతగానో బాధిస్తుందని  చోప్రా  తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నాడు.  

నన్ను బాధిస్తోంది :  నీరజ్ 

తమ పోరాటానికి మద్దతు తెలిపాలని  వినేశ్ ఫోగట్ ట్విటర్ వేదికగా  అభ్యర్థించిన నేపథ్యంలో   గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘న్యాయం కోరుతూ మన క్రీడాకారులు వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగిస్తోంది. వాళ్లు మన దేశానికి ప్రాతినిథ్యం వహించడానికి, మనల్ని గర్వించేలా చేయడంలో   చాలా కష్టపడ్డారు. ఒక దేశంగా  ప్రతి వ్యక్తి  సమగ్రత,  గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పుడు జరుగుతున్నది ఇంకెప్పుడూ జరుగకూడదు.  ఇది  చాలా సున్నితమైన సమస్య.  దీనిలో విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా  వ్యవహరించి  న్యాయం జరిగేలా అధికారులు వెంటనే  చర్య లు తీసుకోవాలి..’ అని  ట్వీట్ చేశాడు.

 

చాలా బాధాకరం : అభినవ్ బింద్రా 

ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం అందించిన  అభినవ్ బింద్రా  ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘అథ్లెట్లుగా అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు  మేం ప్రతిరోజు కఠిన శిక్షణ పొందుతాం. డబ్ల్యూఎఫ్ఐలో   వేధింపుల ఆరోపణలకు సంబంధించి  మన అథ్లెట్లు వీధుల్లో నిరసన తెలపడం  చాలా బాధాకరం. ఈ విషయంలో   నిష్పక్షపాత  విచారణ జరగాలి. ఈ అంశం ఆటల్లో  క్రీడాకారులకు సురక్షిత, సరైన రక్షణ యంత్రాంగాన్ని ఎత్తి చూపుతున్నది. ఆ దిశగా మనం పనిచేయాలి..’అని పేర్కొన్నాడు. 

 

న్యాయం జరుగుతుందా..? : కపిల్ దేవ్ 

కపిల్‌దేవ్ తన ఇన్‌స్టా స్టోరీస్ లో రెజ్లర్లు  మీడియాతో మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ‘వాళ్లక  న్యాయం జరుగుతుందా..?’అని  ప్రశ్నించాడు. 

 

ఇదిలాఉండగా  రెజ్లర్లు రోడ్డెక్కడాన్ని  భారత ఒలింపిక్ సంఘం  (ఐఓఏ) అధ్యక్షురాలు  పి.టి. ఉష తప్పుబట్టారు. ధర్నా చేసే ముందు  రెజ్లర్లు తమ వద్దకు  వస్తే బాగుండేదని,  వాళ్లు ఇలా ధర్నా చేయడం దేశ ప్రతిష్టకు చేటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ధర్నాకు రాజకీయ పార్టీల మద్దతు కోరడాన్ని ఆమె తప్పుబట్టారు. 

టాప్ హెడ్ లైన్స్

WPL 5th Season Schedule: తొలి మ్యాచ్‌లోనే MIతో తలపడనున్న ఆర్సీబీ.. వడోదర, ముంబై వేదికలుగా షెడ్యూల్ విడుదల , ఫిబ్రవరి 7న మెగా ఫైనల్
తొలి మ్యాచ్‌లోనే MIతో తలపడనున్న ఆర్సీబీ.. వడోదర, ముంబై వేదికలుగా షెడ్యూల్ విడుదల , ఫిబ్రవరి 7న మెగా ఫైనల్
Sachin -Sooryavanshi Critique: 15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు
15 ఏళ్ల వైభ‌వ్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వ‌డంపై సచిన్ అసంతృప్తి.. జో రూట్ టెస్ట్ రికార్డు వేటపై ఆసక్తికర వ్యాఖ్యలు, వన్డే ఫార్మాట్ మార్పులకు పిలుపు
Kohli Birthday Celebrations: వెల్లింగ్టన్ ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ బర్త్‌డే సాంగ్ .. కోహ్లీ భావోద్వేగం.. 38 ఏళ్లు పూర్తి చేసుకున్న‌ రన్ మెషీన్, 28 వేల పరుగులతో అంతర్జాతీయ క్రికెట్ లో తిరుగులేని రారాజు
వెల్లింగ్టన్ ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ బర్త్‌డే సాంగ్ .. కోహ్లీ భావోద్వేగం.. 38 ఏళ్లు పూర్తి చేసుకున్న‌ రన్ మెషీన్, 28 వేల పరుగులతో అంతర్జాతీయ క్రికెట్ లో తిరుగులేని రారాజు
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu Case: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. విచారణ ఏపీలోనే!
Stock Market Rally: మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
మార్కెట్లలో సునామీ ర్యాలీ - 2000 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. అసలైన కారణాలివే!
Regena Cassandra : ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
ఇష్టం లేకుంటే ముందే తప్పుకోవాలి - సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే కామెంట్స్... రెజీనా రియాక్షన్
Ramayana Review Telugu - 'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
'రామాయణ' రివ్యూ: వెండితెరపై అద్భుతం జరిగిందా? లేదా? ఇతిహాసాన్ని ఎలా తీశారు?
PVN Madhav Letter to Amit Shah : వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
వరుస తుపాన్లతో ఏపీకి తీవ్ర నష్టం - ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పి.వి.ఎన్. మాధవ్ లేఖ!
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
Virat Kohli Birthday : 38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
38 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం ఏంటి? డైట్, వర్కౌట్ రహస్యాలు ఇవే
Romantic Drama OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్యూట్ లవ్ స్టోరీ - అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కొత్త మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget