అన్వేషించండి

Paris 2024: పసిడి పతకం గెలిస్తే రూ.41.60 లక్షలు- ఆటగాళ్లకు బంపర్‌ ఆఫర్

Paris 2024: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ సరికొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

World Athletics introduces prize money for Olympic gold medallists: వరల్డ్‌ అథ్లెటిక్స్‌(World Athletics) సరికొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌(Olympic) అథ్లెటిక్స్‌(Athletes)లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో 48 విభాగాల్లో పసిడి పతకాలు గెలిచే వారికి ప్రైజ్‌మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. 2024 ఒలింపిక్స్‌లో భాగంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగాల్లో పోటీపడి స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు నగదు బహుమానం కింద 50 వేల యూఎస్‌ డాలర్లు భారత కరెన్సీలో రూ.41.60 లక్షలు అందించేందుకు సిద్ధమైంది. ఇలా నగదు బహుమానాన్ని ప్రకటించిన తొలి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ(WA) నిలిచింది. 

ఒలింపిక్స్‌లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రోత్సాహకాలు అందించేందుకు గాను 2.4 మిలియన్ల యూఎస్‌ డాలర్లను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేసినట్టు తెలిపింది. 2028 లాస్‌ ఎంజేల్స్‌ ఒలింపిక్స్‌ నుంచి రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఒలింపిక్‌ పతకాల్లో ఈఫిల్‌ టవర్‌
2024 ఒలంపిక్  పతకాల తుది రూపు బహిర్గతం అయ్యింది. ప్రఖ్యాత ఈఫిల్ టవర్( Eiffel Tower)  పునరుద్ధరణ పనలు సమయంలో తొలగించిన కొన్ని ఇనుప ముక్కలతో ఈసారి పతకాలను తయారు చేశారు. పతకం మధ్యలో ఇనుమును ఉంచి చుట్టూ బంగారం, రజతం, కాంస్య  తాపడాన్ని అద్దారు. పతకాలలో వాడిన లోహాలన్ని కొత్తగా గనుల్లో తవ్వి వెలికితీయలేదని ఒలంపిక్ క్రీడల నిర్వహకులు తెలిపారు. వాడిన లోహాలనే రీసైకిల్  చేసి పతకాలలో వినియోగించామని చెప్పారు. ఒలంపిక్స్ , పారాఒలంపిక్స్  క్రీడల కోసం నిర్వాహకులు మెుత్తం 5 వేల 84 పతకాలను తయారు చేయిస్తున్నారు. వాటిలో 2 వేల 600 పతకాలను ఒలంపిక్స్ క్రీడలకు, మరో 2 వేల 400 పతకాలను పారా ఒలంపిక్స్  క్రీడల విజేతలను ఇవ్వనున్నారు. అయితే అన్ని పతకాలను విజేతల కోసమే కాకుండా కొన్నింటిని మ్యూజియంలో ఉంచుతారు. మరికొన్నింటిని భద్రపరుస్తారు. ఎవరైనా క్రీడాకారులు డోపింగ్ కు పాల్పడి పతకం కోల్పోతే ఆ తర్వాతి స్థానంలో క్రీడాకారుడు లేదా క్రీడాకారిణికి ఆ భద్రపరిచిన పతకాన్ని ఇస్తారు. ఫ్రాన్స్  రాజధాని పారిస్ లో జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు 33వ ఒలంపిక్  క్రీడలు జరగనున్నాయి. 

పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి ఇప్పటికే  16 మంది షూటర్లు తమ బెర్తులను ఖాయం చేసుకున్నారు.  మిగతా క్వాలిఫయర్స్‌ పోటీల అనంతరం ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. భారత్‌ తరఫున అత్యధికంగా టోక్యో ఒలింపిక్స్‌లో 15 మంది షూటర్లు బరిలో దిగారు. జకార్తాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లోనే ఇషా సింగ్, వరుణ్‌ తోమర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో బంగారు పతకాలు సాధించి పారిస్ ఒలింపిక్స్‌ బెర్తులను ఖరారు చేసుకున్నారు. 2021లో జపాన్‌ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌.. 15 మంది షూటర్లతో బరిలోకి దిగగా తాజాగా ఆ సంఖ్య 16కు చేరింది.

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
Vaibhav Sooryavanshi Confident: డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
డ్రాప్ చేసినా కాన్ఫిడెన్స్ త‌గ్గేది లేదంటున్న  వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేలో స‌త్తా చాటుతాన‌ని, ఇక్క‌డ తీపి జ్ఞాప‌కాలున్న‌య‌ని వెల్ల‌డి!
Sanju Samson Vs Rohit Sharma: రోహిత్  కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
రోహిత్ శర్మ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్.. ! అస‌లేం జ‌రిగిందంటే..!!
Tilak Varma Clarity: తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!
తన స్ట్రైక్ రేట్ పై వస్తున్న విమర్శలపై తిలక్ వర్మ క్లారిటీ, జింబాబ్వే టి20 సిరీస్ కు ముందు సంచలన ట్విస్ట్!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget