News
News
X

Ravi Shastri on Rahul Tripathi: అతనాడితే స్కోరు బోర్డే పరుగెడుతుందన్న రవిశాస్త్రి!

Ravi Shastri on Rahul Tripathi: టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠికి (Rahul Tripathi) టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అండగా నిలిచాడు.

FOLLOW US: 

Ravi Shastri on Rahul Tripathi: టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠికి (Rahul Tripathi) టీమ్ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అండగా నిలిచాడు. అతడు క్రీజులో ఉంటే పరుగుల వరద పారడం ఖాయమన్నాడు. ప్రత్యర్థి జట్టైనా,  బౌలర్లైనా అతడిపై ఆధిపత్యం చెలాయించలేరని ధీమా వ్యక్తం చేశాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో అతడు కచ్చితంగా ఆకట్టుకుంటాడని అంచనా వేశాడు.

'రాహుల్‌ త్రిపాఠి క్రీజులో ఉంటే స్కోర్‌ బోర్డు పరుగులు పెడుతుంది. బ్యాటు అంచులకు తగిలే బంతుల్ని అతడు ఆడడు. చక్కని షాట్లు ఆడే సామర్థ్యం ఉంది. ఆటపై 360 డిగ్రీల్లో పట్టు ఉండటంతో ప్రత్యర్థి జట్టైనా, బౌలర్లైనా అతడిపై ఆధిపత్యం చెలాయించలేరు. త్రిపాఠి మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తాడు. మూడో స్థానంలో అతడు అద్భుతంగా ఆడతాడు. తర్వాతి బ్యాటర్లకు పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తాడు' అని రవిశాస్త్రి ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో అన్నాడు.

Also Read: దటీజ్‌ విరాట్‌ కోహ్లీ! ఆగ్రహంతో ఇండియన్‌ ఫ్యాన్స్‌నీ తిట్టేశాడు!!

Also Read: విశాఖ వికెట్‌ కీపర్‌కు రిషభ్ పంత్‌ భయపడ్డాడా?

దేశవాళీ క్రికెట్లో రాహుల్‌ త్రిపాఠికి మంచి పేరుంది. అతడు అద్భుతమైన బ్యాటర్‌. ఐపీఎల్‌లో ప్రతిసారీ రాణిస్తాడు. ఈ మధ్యే ముగిసిన సీజన్లో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)కు ఆడాడు. మూడో స్థానంలో వచ్చి దుమ్మురేపాడు. ప్రత్యర్థి బౌలర్లు ఎంత చాకచక్యంగా బంతులేసినా విధ్వంసకరమైన ఇన్నింగ్సులు ఆడేశాడు. 158 స్ట్రైక్‌రేట్‌తో 413 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీసులోనే అతడిని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. ఇతర కుర్రాళ్లను పరీక్షించడంతో చోటు దక్కలేదు. అయితే ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీసులో సెలక్టర్లు అతడికి అవకాశం ఇచ్చారు. మరి ఎలా రాణిస్తాడో చూడాల్సిందే.

ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపికవ్వగానే రాహుల్‌ త్రిపాఠి సంతోషం వ్యక్తం చేశాడు. 'ఇది నాకో పెద్ద అవకాశం. నా కల నెరవేరింది. ఇందుకు నేనెంతో గర్వపడుతున్నాను. సెలక్టర్లతో సహా అందరూ నాపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. నేను పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. తుది జట్టులో చోటు దక్కితే కచ్చితంగా అత్యుత్తమంగా ఆడతాను' అని అతడు పేర్కొన్నాడు.

View this post on Instagram
 
A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

Published at : 25 Jun 2022 06:47 PM (IST) Tags: Ravi Shastri SRH IPL 2022 rahul tripathi IND vs IRE

సంబంధిత కథనాలు

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్‌ అయ్యాడని క్రికెటర్‌ చెంపలు వాయించిన ఐపీఎల్‌ ఓనర్‌!!

IND vs ZIM: ఓ మై గాడ్‌! టీమ్‌ఇండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

IND vs ZIM: ఓ మై గాడ్‌! టీమ్‌ఇండియాకే వార్నింగ్‌ ఇచ్చిన జింబాబ్వే కోచ్‌!

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

Indians In Foreign Leagues: ఎంఎస్‌ ధోనీకైనా ఇదే రూల్‌! కఠిన ఆదేశాలు ఇవ్వబోతున్న బీసీసీఐ

MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్‌ లైన్‌ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!

MS Dhoni Har Ghar Tiranga: డీపీ మార్చిన ధోనీ! ట్యాగ్‌ లైన్‌ చదివితే దేశభక్తి ఉప్పొంగుతుంది!

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

టీమిండియాకు పెద్ద దెబ్బ - టీ20 ప్రపంచకప్‌కు స్టార్ బౌలర్ దూరం?

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!