By: ABP Desam | Updated at : 30 Aug 2021 11:29 PM (IST)
సుమిత్ అంటిల్, ప్రధాని నరేంద్ర మోదీ
టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సుమిత్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. "నీ ప్రదర్శనతో దేశానికి కీర్తి తెచ్చావు. ఈ విజయంతో భారతదేశ యువత నీ నుంచి అద్భుతమైన స్ఫూర్తిని పొందుతారు. నీ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోంది. ఇలాగే భవిష్యత్తులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి అని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమిత్ అంటిల్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A golden moment for the golden boy!!
— SAI Media (@Media_SAI) August 30, 2021
Hon'ble PM Shri. @narendramodi congratulates #SumitAntil after his historic Gold Medal win at #Tokyo2020 Paralympics
Hon'ble PM has spoken to every para medalist to congratulate & encourage them for bringing glory to the nation
Listen in👇 pic.twitter.com/w7Qx2mmsNH
సుమిత్ అంటిల్‌కు సీఎం జగన్ అభినందనలు
టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్ అంటిల్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. '' పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించినందుకు సుమిత్‌కు శుభాకాంక్షలు. నీ స్వర్ణంతో దేశానికి ఒకేరోజు రెండు బంగారు పతకాలు రావడం ఆనందం కలిగించింది. జావెలిన్ త్రోలో మూడు ప్రయత్నాల్లోనూ అద్బుత ప్రదర్శన చేసి కొత్త రికార్డు సృష్టించావు. నీ కెరీర్ ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ జగన్ ట్వీట్ చేశారు.
That special moment
— Anurag Thakur (@ianuragthakur) August 30, 2021
when India’s 🇮🇳 Prime Minister
calls to congratulate you…
Just after you’ve won the #Paralympics
GOLD🥇 and broken the world record…
Well Done Sumit Antil !#Praise4Para #Cheer4India
| @narendramodi @Media_SAI @PIB_India | pic.twitter.com/pZapR2bbAm
ఇక టోక్యో పారాలింపిక్స్‌లో మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఐదో ప్రయత్నంలో ఈటెను ఏకంగా 68.55 మీటర్లు విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్! టీమ్‌ఇండియాకు నెర్వస్ ఫీలింగ్!
Samson Post Viral: సంజూ శాంసన్ పోస్ట్! టీమ్‌ఇండియాపై 'బాహుబలి' ఇంటర్వెల్ సీన్ రిపీట్!
ICC ODI World Cup 2023: ఈ ఐదుగురికీ ఇదే తొలి ప్రపంచకప్! క్రీజులో నిలిస్తే రికార్డులు బద్దలే!
Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల జోరు, ఆర్చరీలో స్వర్ణం, వాక్ రేస్‌లో కాంస్యం
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
/body>