By: ABP Desam | Updated at : 15 Dec 2021 12:16 PM (IST)
Edited By: Murali Krishna
కోహ్లీ ప్రెస్ మీట్
రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇద్దరూ ఇద్దరే! ఎవరికి వారే సాటి. వీరిద్దరూ కలిసి ఆడిన ఇన్నింగ్స్ చూసి భారత అభిమానులు ముచ్చటపడిన సందర్భాలెన్నో. కాలరెగరేసిన సంఘటనలు మరెన్నో.
కానీ ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు భారత్ అభిమానులను కలవరపెడుతున్నాయి. ఒకరుంటే మరొకరు టీమ్‌లో ఉండరని కూడా ఏవేవో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు మధ్యాహ్నం సంచలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. మరి కోహ్లీ ఈ ప్రెస్ మీట్‌లో ఏం చెప్తాడు?
రోహిత్‌తో విభేదాలు..
ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ముంబయిలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు విరాట్ కోహ్లీ. దక్షిణాఫ్రికా టూర్ కోసం భారత జట్టు బయలుదేరే ముందే ఈ ప్రెస్ మీట్ జరగనుంది.
ఈ ప్రెస్ మీట్‌లో వన్డే కెప్టెన్ రోహిత్‌తో విభేదాల గురించి కోహ్లీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అలానే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తయిన వెంటనే మొదలుకానున్న వన్డే సిరీస్‌కు తాను ఆడతాడా లేదా అనే దానిపై కూడా కోహ్లీ మాట్లాడే అవకాశం ఉందని సమాచారం.
ఇటీవల పరిణామాలు..
విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌లో ఆడబోవడం లేదని వార్తలు వస్తున్నాయి. జనవరిలో వ్యక్తిగత కారణాల కారణంగా తనకు బ్రేక్ కావాలని విరాట్ కోరినట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నానని, తను ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండబోనని తెలిపాడు. టీ20లకు కెప్టెన్‌గా ఉండబోనని ప్రకటించిన అనంతరం కోహ్లీని బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది.
ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డేలకు, టీ20లకు కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఇప్పుడు తనకు గాయం కావడంతో టెస్టు సిరీస్‌కు దూరం అయినట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికా టూర్‌కు వన్డే జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ బీసీసీఐ.. విరాట్ కోహ్లీకి సెలవు ఇస్తే.. తన స్థానంలో జట్టుకు ఎవరు వస్తారో చూడాల్సి ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో ఎంతో మంది యువ ఆటగాళ్లు మెరుగ్గా పెర్ఫార్మ్ చేస్తున్నారు.
వీరిలో కొంతమందికి దక్షిణాఫ్రికా టూర్‌లో అవకాశం రావచ్చని తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ స్థానంలో గుజరాతీ ఓపెనర్ ప్రియాంక్ పాంచల్‌ను జట్టుకు ఎంపిక చేశారు. రోహిత్ ఈ టెస్టు సిరీస్‌లో వైస్ కెప్టెన్‌గా కూడా నియమితుడయ్యాడు. మరి ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో కూడా తెలియాల్సి ఉంది.
Also Read: Ganguly on IPL 2022:: ఒమిక్రాన్‌పై గంగూలీ కామెంట్స్..! వచ్చే ఐపీఎల్‌ను...?
Also Read: Rohit Sharma Update: బయటి మాటల్ని పట్టించుకోం.. బలమైన బంధమే ముఖ్యమన్న రోహిత్
Also Read: India's Tour Of South Africa: ఈ నలుగురూ ఆడితే దక్షిణాఫ్రికా టూర్‌లో భారత్‌కు తిరుగులేదు.. ఎవరంటే?
Also Read: Pushpa Event: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
IPL 2022: ఈ రికార్డ్ LSGకే సొంతమేమో! ప్లేఆఫ్స్ చేరిన RR, RCB, GTపై గెలవనేదుగా!!
LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్‌లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్ పైనే! RCB, LSGలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?
GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్ 'కిల్లర్' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్
GT vs RR, Qualifier 1: జోస్ ది బాస్ - నాకౌట్లో బట్లర్ 89 - GT ముందు భారీ టార్గెట్ !
Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్! వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్ యాక్షన్
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్ రూల్స్
Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్