US Open 2023: సంచలనాలేమీ లేకుండానే మొదలైన యూఎస్ ఓపెన్ - రెండో రౌండ్‌కు చేరిన స్టార్ ప్లేయర్స్
ఇటీవలే మొదలైన యూఎస్ ఓపెన్ - 2023లో తొలి రౌండ్‌లో సంచలన ఫలితాలేమీ నమోదుకాలేదు. స్టార్ ప్లేయర్లందరూ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.
US Open 2023: ఈ ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్‌లో స్టార్ ప్లేయర్లు అలవోకగా విజయాలు సాధించి రెండో రౌండ్‌కు చేరారు. అగ్రశ్రేణి క్రీడాకారిణులు నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కరజ్, డెనియల్ మెద్వదేవ్, సిట్సిపాస్, ఆన్స్ జాబెర్, కోకో గాఫ్ ముందంజ వేశారు. మంగళవారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో జకో.. 6-0, 6-2, 6-3తో ఫ్రాన్స్‌కు చెందిన ముల్లర్‌ను అలవోకగా ఓడించాడు. కొద్దిరోజుల క్రితమే ముగిసిన వింబూల్డన్ లో జకోవిచ్‌ను ఓడించిన స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరజ్.. 6-2, 3-2 తేడాతో జర్మన్ ప్లేయర్ డొమినిక్ పై అలవోకగా నెగ్గాడు.
గతేడాది కోవిడ్ టీకా వేసుకోకపోవడంతో యూఎస్ ఓపెన్‌కు దూరమైన జకోవిచ్.. ఈ ఏడాది నిబంధనలు సడలించడంతో ఈ టోర్నీలో ఆడుతున్నాడు. తొలి రౌండ్‌లో ఎలాంటి ప్రతిఘటన లేకుండానే జకోవిచ్.. రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఈ విజయంతో జకో.. తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశముంది.
Keep an eye out for more player impersonations from Novak 😆 pic.twitter.com/eXtsD0dNzt
— US Open Tennis (@usopen) August 29, 2023
ఇక రష్యా స్టార్ ప్లేయర్ డెనియల్ మెద్వదెవ్.. 6-1, 6-1, 6-0తో హంగేరీకి చెందిన బలాజ్స్‌ను చిత్తు చేశాడు. గ్రీస్ కుర్రాడు సిట్సిపాస్.. 6-2, 6-3, 6-4 తేడాతో కెనాడా ప్లేయర్ రోనిచ్‌ను ఓడించాడు.
Carlos Alcaraz can carry a tune 🎵
— US Open Tennis (@usopen) August 30, 2023
He gives his best @SebastianYatra impression! pic.twitter.com/qMbAZ3nG0g
ఉమెన్స్ సింగిల్స్ విషయానికొస్తే.. ట్యూనీషియా ప్లేయర్ ఆన్స్ జాబెర్ కూడా యూఎస్ ఓపెన్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో జాబెర్.. 7-5, 7-6 (7-4) తేడాతో కొలంబియా క్రీడాకారిణి కమిలా ఒసోరియోను ఓడించింది. అమెరికాకు చెందిన కోకో గాఫ్.. 3-6, 6-2, 6-4 తేడాతో సిగ్మాండ్ (జర్మనీ)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది. రెండ్రోజుల క్రితమే వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్.. 6-0, 6-1 తేడాతో పీటర్సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. మరో స్టార్ ప్లేయర్ 6-3, 6-2 తేడాతో జనెవ్స్కాపై గెలిచింది. మాజీ వరల్డ్ నెంబర్ వన్, గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న అమెరికా నల్లకలువ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
"I always feel loved in New York."
— US Open Tennis (@usopen) August 29, 2023
The Big 🍎 showing all the love for Ons Jabeur. pic.twitter.com/HTjW8CIgnv
యూఎస్ ఓపెన్ మ్యాచ్‌లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోకో గాఫ్ ఆడిన మ్యాచ్‌ను ఈ దంపతులు వీక్షించారు.
Former First Lady @MichelleObama was in the house to celebrate the 50th anniversary of equal prize money at the US Open! pic.twitter.com/CaiTWI0ye3
— US Open Tennis (@usopen) August 29, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial