Virat Kohli: బయో బుడగల్లో నరకం..! ఒక చిత్రంతో చెప్పిన విరాట్ కోహ్లీ
'బయో బడుగల్లో ఉండి ఆడటం ఇలాగే ఉంటుంది తెలుసా..!' అంటూ విరాట్ కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు. కుర్చీలో తనను కట్టేసిన చిత్రాన్ని జత చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం వైరల్‌గా మారింది.
కరోనా మహమ్మారి రాకతో ప్రపంచంలో అందరి స్వేచ్ఛా హరించుకుపోయింది! అనేక దేశాల్లో ఆంక్షలు పెట్టారు. సొంతవారినీ కలుసుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. మానసిక క్షోభను అనుభవించారు. అంతర్జాతీయ క్రీడా రంగమూ ఇందుకు భిన్నమేమీ కాదు. బయో బుడగల్లో ఉంటూ అభిమానులను అలరించాల్సిన పరిస్థితులు వచ్చాయి.
Also Read: తుది సంగ్రామం నేడే.. కప్పు కోల్‌కతా కొడుతుందా.. చెన్నై చేతికొస్తుందా?
క్రికెట్, ఫుట్‌బాట్ సహా అనేక క్రీడలు తిరిగి మొదలవ్వడంతో అభిమానులు సంతోషించారు. కాసేపు తమకు ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తోందని భావిస్తున్నారు. ఇందుకోసం క్రీడాకారులు పడుతున్న బాధలు, ఇబ్బందులు మాత్రం వారికి అంతగా తెలియవు. నెలల తరబడి కుటుంబాలకు దూరమై బయో బుడగల్లో ఉంటూ ఆడటం ఎంత కష్టమో వారికి తెలియదు. ఈ పరిస్థితి సరిగ్గా వర్ణిస్తూ టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఓ చిత్రం పంచుకున్నాడు.
Also Read: నేనైతే అశ్విన్‌కు చోటివ్వను..! కేవలం పరుగుల్ని నియంత్రిస్తే సరిపోదన్న మంజ్రేకర్
'బయో బడుగల్లో ఉండి ఆడటం ఇలాగే ఉంటుంది తెలుసా..!' అంటూ విరాట్ కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు. కుర్చీలో తనను కట్టేసిన చిత్రాన్ని జత చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం వైరల్‌గా మారింది. బయో బుడగల్లో ఉండి ఆడటం గురించి చాలా సార్లు కోహ్లీ గొంతెత్తాడు. సుదీర్ఘ కాలం బుడగల్లో ఉండటం కష్టమని పేర్కొన్నాడు. బోర్డులన్నీ ఆటగాళ్ల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని షెడ్యూళ్లు రూపొందించాలని కోరాడు.
Also Read: ఓటమితో గుండె పగిలిన రిషభ్ పంత్.. కన్నీరు పెట్టుకున్న పృథ్వీ షా! చూసిన వాళ్లూ బాధపడ్డారు
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో పర్యటించనప్పుడు టీమ్‌ఇండియా చాలా కష్టాలు పడింది. ఆటగాళ్లు హోటల్ గదుల్లో ఒంటరిగా ఉన్నారు. ఆసీస్‌లోనైతే సెక్యూరిటీనీ మోహరించారు. సరైన ఆహారం దొరకలేదు. బయట ప్రజలు తిరిగేందుకు అనుమతించినా ఆటగాళ్లను మాత్రం హోటల్, స్టేడియం దాటనీయలేదు. ఇక అమ్మాయిల జట్టు మరింత ఘోరమైన అనుభవాలనే చవిచూసింది. ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో కేవలం ఒక బెడ్ పట్టేంత రూమ్‌లోనే ఉన్నారు.
Also Read: టీ20 వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు.. అక్షర్ పటేల్ స్థానంలో వేరే ప్లేయర్.. ఎవరంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
This is what playing in bubbles feels like. pic.twitter.com/e1rEf0pCEh
— Virat Kohli (@imVkohli) October 15, 2021