Indian Squad of T20 WC: టీ20 వరల్డ్ కప్ జట్టులో కీలక మార్పు.. అక్షర్ పటేల్ స్థానంలో వేరే ప్లేయర్.. ఎవరంటే?
ఈ నెలలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును గతంలోనే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులో కీలక మార్పు చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.
టీ20కు వరల్డ్‌కప్‌కు ఎంపిక అయిన భారత జట్టులో కీలక మార్పు జరిగింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. అక్షర్ పటేల్‌ను స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో చేర్చారు. అయితే దీనికి గల కారణాలను తెలపలేదు.
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవి చంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
Also Read: ధోనీ ది గ్రేట్! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు
ఆవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మాన్ మెరివాలా, వెంకటేష్ అయ్యర్, కరణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతంలు దుబాయ్‌లో ఉన్న బయో బబుల్‌లో జట్టుతో చేరి సన్నాహాల్లో సాయపడతారు. ఈ మేరకు బీసీసీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లు అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్ 12 మాత్రం అక్టోబర్ 24వ తేదీ నుంచి జరగనుంది. భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
నవంబర్ 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. వెస్టిండీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చివరి ఓవర్లో బెన్ స్టోక్స్ వేసిన మొదటి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచి కార్లోస్ బ్రాత్‌వైట్ మ్యాచ్‌ను గెలిపించిన క్షణాలను మరిచిపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌కు అంత సులువు కాదు. ఈ వరల్డ్‌కప్‌కు అన్ని జట్లూ పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాయి. కాబట్టి అదే స్థాయి యాక్షన్‌ను ఈ వరల్డ్‌కప్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు.
Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: 15-20శాతం తగ్గిన ఐపీఎల్ రేటింగ్.. స్టార్ సతమతం.. ఆందోళనలో అడ్వర్టైజర్లు!