News
News
వీడియోలు ఆటలు
X

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

2023 ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడనున్న తెలుగు ఆటగాడు షేక్ రషీద్. ఎవరు ఇతను?

FOLLOW US: 
Share:

ఐపీఎల్ 2023లో భగత్ వర్మ తర్వాత చెన్నై జట్టులో భాగమైన మరో తెలుగు ఆటగాడు షేక్ రషీద్. గుంటూరుకు చెందిన ఈ 18 సంవత్సరాల కుర్రాడిని రూ. 20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. వెస్టిండీస్‌లో జరిగిన 2022 అండర్ - 19 వరల్డ్ కప్‌లో వైస్ కెప్టెన్ కావడంతో ఒక్కసారిగా రషీద్ వెలుగులోకి వచ్చాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన రషీద్ 10 ఇన్నింగ్స్‌లో 211 పరుగులు సాధించాడు. ఒక అర్థ సెంచరీ కూడా ఉంది. టీ20 క్రికెట్‌లో మూడు మ్యాచ్‌ల్లో 56 పరుగులు సాధించాడు. తన స్ట్రైక్ రేట్ 112 పరుగులుగా ఉంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ స్టార్లతో నిండి ఉంది కాబట్టి కొత్త వారికి ఎంత వరకు అవకాశం వస్తుందో వేచి చూడాలి.

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 31వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో ఏప్రిల్ 3వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ ముందు తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లోని మూడో మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ జట్టు రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
31 మార్చి 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v గుజరాత్ టైటాన్స్ - నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
2 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v లక్నో సూపర్ జెయింట్స్ - చెపాక్ స్టేడియం, చెన్నై
8 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ముంబై ఇండియన్స్, వాంఖడే స్టేడియం, ముంబై
12 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాజస్థాన్ రాయల్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
17 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
21 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v సన్‌రైజర్స్ హైదరాబాద్, చెపాక్ స్టేడియం, చెన్నై
23 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v కోల్‌కతా నైట్ రైడర్స్, ఈడెన్ గార్డెన్ స్టేడియం, కోల్‌కతా
27 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v రాజస్థాన్ రాయల్స్, జైపూర్
30 ఏప్రిల్ 2023 - చెన్నై సూపర్ కింగ్స్ కింగ్స్ v పంజాబ్ కింగ్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
4 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v లక్నో సూపర్ జెయింట్స్, ఎకానా స్టేడియం, లక్నో
6 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ముంబై ఇండియన్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
10 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ఢిల్లీ క్యాపిటల్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
1 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v కోల్కతా నైట్ రైడర్స్, చెపాక్ స్టేడియం, చెన్నై
20 మే 2023 - చెన్నై సూపర్ కింగ్స్ v ఢిల్లీ క్యాపిటల్స్, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి స్క్వాడ్
వికెట్ కీపర్లు: మహేంద్ర సింగ్ ధోని, డెవాన్ కాన్వే (న్యూజిలాండ్).

బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే.

ఆల్ రౌండర్లు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), శివమ్ దూబే, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, డ్వైన్ ప్రిటోరియస్ (SA), మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కైల్ జామీసన్ (న్యూజిలాండ్), అజయ్ మండల్, భగత్ వర్మ, నిశాంత్ సింధు.

బౌలర్లు: దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ (శ్రీలంక), సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ (శ్రీలంక)

Published at : 30 Mar 2023 10:36 PM (IST) Tags: IPL Shaik Rasheed IPL 2023 Chennai Super Kings

సంబంధిత కథనాలు

Team India Tour Of West Indies: టీమిండియా విండీస్ టూర్‌కు షెడ్యూల్ ఖరారు! - అమెరికాలోనూ మ్యాచ్‌లు

Team India Tour Of West Indies: టీమిండియా విండీస్ టూర్‌కు షెడ్యూల్ ఖరారు! - అమెరికాలోనూ మ్యాచ్‌లు

Ashes 2023: గాయంతో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఔట్ - రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని ఒప్పిస్తున్న హెడ్‌కోచ్

Ashes 2023: గాయంతో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఔట్ - రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని ఒప్పిస్తున్న హెడ్‌కోచ్

Kohli Test Records: రికార్డుల వేటలో రన్ మిషీన్ - కోహ్లీని ఊరిస్తున్న మైల్ స్టోన్స్

Kohli Test Records: రికార్డుల వేటలో రన్ మిషీన్ - కోహ్లీని ఊరిస్తున్న మైల్ స్టోన్స్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: మాకా.. నాకౌట్‌ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్‌ రెస్పాన్స్‌ ఇదీ!

WTC Final 2023: మాకా.. నాకౌట్‌ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్‌ రెస్పాన్స్‌ ఇదీ!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!