News
News
X

T20 WC 2021: షాహిన్‌ అఫ్రిది చేసిందే నేనూ చేస్తా! టీమ్‌ఇండియా మ్యాచ్‌కు ముందు బౌల్ట్‌ కామెంట్స్‌

టీమ్‌ఇండియాతో మ్యాచుకు న్యూజిలాండ్‌ సిద్ధమవుతోంది. పాక్‌ తరహాలోనే కోహ్లీసేనను ఇబ్బంది పెట్టాలని అనుకుంటోంది. షాహిన్‌ అఫ్రిదిలా తానూ బంతితో రాణిస్తానని ట్రెంట్‌ బౌల్ట్‌ ధీమాగా ఉన్నాడు.

FOLLOW US: 

టీమ్‌ఇండియాపై షాహిన్‌ అఫ్రిది చేసిందే తానూ చేస్తానని న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అంటున్నాడు. త్వరగా వికెట్లు తీస్తే తమ విజయానికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నాడు. కోహ్లీసేన తమకు కఠిన సవాళ్లు విసరగలదని వెల్లడించాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

దుబాయ్‌ వేదికగా ఆదివారం భారత్‌, న్యూజిలాండ్‌ తలపడుతున్నాయి. ప్రపంచకప్‌ సూపర్‌ 12లో ఈ రెండు జట్లకు ఇది రెండో మ్యాచ్‌. యాదృచ్ఛికంగా ఈ రెండు జట్లు వరుసగా పాకిస్థాన్‌ చేతిలోనే ఓటమి పాలయ్యాయి. గ్రూప్‌-2లోని బలమైన జట్లు కావడంతో ఈ మ్యాచులో గెలిచిన వారికి సెమీస్‌ వెళ్లేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

'బంతి ఎప్పుడిస్తారన్న దానిబట్టి నా ప్రదర్శన ఉంటుంది. ఇప్పటికైతే నాకు ఎలాంటి ప్లాన్‌ తెలియదు. ఏ బౌలర్‌కు ఎన్ని ఓవర్లు ఇస్తారు? ఎప్పుడిస్తారో తెలియదు. టీమ్‌ఇండియాపై షాహిన్‌ బౌలింగ్‌ అద్భుతం. కోహ్లీసేన నాణ్యమైన జట్టు. త్వరగా వికెట్లు తీయడం పైనే మా దృష్టి ఉంది. ఏదేమైనా మేం కట్టుదిట్టంగా సరైన ప్రాంతాల్లో బంతులు వేయాలి. అదృష్టవశాత్తు బంతి స్వింగ్‌ అయితే షాహిన్‌ అఫ్రిది చేసిందే నేనూ చేస్తాను' అని బౌల్ట్‌ ధీమా వ్యక్తం చేశాడు.

టీమ్‌ఇండియా బలమైన జట్టు కావడంతో కఠిన సవాళ్లు ఎదురవుతాయని ట్రెంట్‌ బౌల్ట్‌ తెలిపాడు. మొదట బ్యాటింగ్‌ చేసినా, ఛేదనకు దిగినా తాము బంతితో రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. 'బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మేం మొదట ఏది ఎంచుకున్నా మెరుగ్గా చేయాలి. ఎందుకంటే భారత్‌ కఠినమైన జట్టు. సరైన వ్యూహాలు రచించి ముందుకెళ్లాలి. బంతితో రాణించాలి. మొదట బ్యాటింగ్‌ చేస్తే మాత్రం భారీ లక్ష్యం నిర్దేశించాలి. అలా చేస్తామనే ఆశిస్తున్నాం' అని బౌల్ట్‌ అన్నాడు.

Also Read: AFG vs PAK, Match Highlights: పాకిస్తాన్ హ్యాట్రిక్.. ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం

Also Read: T20 WC 2021, WI vs BANG Match Highlites: డిఫెండింగ్‌ ఛాంప్స్‌ డిఫెండ్‌ చేసింది..! బంగ్లాపై 3 పరుగుల తేడాతో విండీస్‌ విజయం

Also Read: Puneeth Rajkumar Death: నువ్విక లేవని తెలిసి.. త్వరగా వెళ్లావని తలచి..! కన్నీటి సముద్రంలో మునిగిన క్రికెటర్లు!

Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్‌ ఇవే! ఐపీఎల్‌ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Oct 2021 03:39 PM (IST) Tags: Virat Kohli India NewZealand T20 World Cup 2021 T20 WC 2021 Ind Vs NZ Trent Boult Shaheen Afridi

సంబంధిత కథనాలు

కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ సెరెనా సంచలన నిర్ణయం

కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ సెరెనా సంచలన నిర్ణయం

Team India Squad: ఆసియాకప్‌కు తిరిగొస్తున్న కోహ్లీ - 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ!

Team India Squad: ఆసియాకప్‌కు తిరిగొస్తున్న కోహ్లీ - 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ!

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

India Medal Tally: 22 స్వర్ణాలతో నాలుగో స్థానంలో భారత్ - కామన్వెల్త్ గేమ్స్‌లో మన ప్రస్థానం ఇదే!

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

స్వర్ణ విజేత పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

టాప్ స్టోరీస్

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి

Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?

Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?

KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు

KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ