అన్వేషించండి

Indian Cricket: వాలెంటైన్స్ డే స్పెషల్ - మన ఇండియన్ క్రికెటర్ల క్రేజీ లవ్ స్టోరీస్

Love Stories of Indian Cricketers: క్రికెట్ ప్లేయర్ల ప్రేమ  కధల విషయానికి వస్తే ఆటగాళ్లలో చాలమందివి ప్రేమ వివాహాలే. వీరిలో ముందుగా గుర్తుకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.

Some beautiful Love Stories of Indian Cricketers: ప్రేమ - ఈ రెండు అక్షరాల పదానికి ప్రతి ఒక్కరి జీవితంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ఎంతటి గొప్పవారైనా ప్రేమకు దాసోహమవ్వాల్సిందే. తమ ప్రేమను దక్కించుకోవడానికి నానా తిప్పలు పడాల్సిందే. ప్రేమికుల రోజున మన ఆటగాళ్ల లవ్ స్టోరీల గురించి తెలుసుకుందామా!

సచిన్ - అంజలి 

క్రికెట్ ప్లేయర్ల ప్రేమ  కథల విషయానికి వస్తే ఆటగాళ్లలో చాలామందివి ప్రేమ వివాహాలే. వీరిలో ముందుగా గుర్తుకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). ఎంతో మంది సీనియర్లకు రాని పేరు, సంపాదని 20 ఏళ్లకే సచిన్ సొంతమయ్యాయి. సచిన్ ఆడుతుంటే కోట్లాది మంది అభిమానులు కళ్లప్పగించి చూస్తుండే వాళ్లు. వారిలో ఒకరు డాక్టర్ అంజలి. సచిన్ అంటే ఆమెకు విపరీతమైన అభిమానం. అటు సచిన్ కి కూడా అంజలీ అంటే విపరీతమైన ప్రేమ. చాలాకాలం మూగ ప్రేమ  తరువాత మొత్తానికి ఒకానొక రోజు ధైర్యం చేసి సచిన్‌ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో  తన కన్నా వయస్సులో 6 ఏళ్ల పెద్దది అయినా అంజలిని వివాహం చేసుకున్నాడు మన మాస్టర్ బ్లాస్టర్.

సౌరవ్ గంగూలీ-డోనా

టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, ప్రస్తుత టీం ఇండియా కోచ్  సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) - డోనా(Dona)ల ప్రేమ కథ మరింత రసవత్తరంగా ఉంటుంది. డోనా, సౌరవ్ గంగూలీలు చిన్ననాటి స్నేహితులు. అయితే ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే వారే గానీ పెద్దగా మాట్లాడుకునే వారు కాదు. అయితే రిలేషన్ ని ఎలా అయినా ముందుకు తీసుకువెళ్లాలనుకున్న దాదా ఎలాగైతేనేమి డోనాతో మాట కలిపాడు. డేటింగ్‌కు వస్తావా అని అడగడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఈ క్రమంలో గంగూలీకి ఇంగ్లాండ్‌లో జరిగే లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌కు పిలుపొచ్చింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఇరు కుటుంబాలకు తెలియడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు భగ్గుమన్నాయి. పెళ్లికి ఇరు కుటుంబాల్లో ససేమిరా అనడంతో గంగూలీ- డోనాను తన స్నేహితుడి ఇంట్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత ఈ విషయం తెలియడంతో ఇరుకుటుంబాల్లో కాస్త  గొడవైనప్పటికీ.. చివరకు ఒప్పుకొన్నారు. 

మహేంద్ర సింగ్ ధోనీ-సాక్షి 

ఇక టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథ సారథి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) లవ్ స్టోరీ విషయానికి వస్తే మన హీరో ధోనీకి తన చిన్నతనంలోనే సాక్షి(Sakshi)తో పరిచయం ఉంది. ఇద్దరూ రాంచీలోని ఒకే పాఠశాలలో చదువుకునేవారు. అయితే సాక్షి కుటుంబం డెహ్రాడూన్‌కు షిప్ట్ అవడంతో ధోని సాక్షిల పరిచయానికి ఫుల్ స్టాప్ పడింది. తిరిగి వీరిద్దరిని కలపడానికి కాలం 10 సంవత్సరాలు తీసుకుంది. సాక్షిని తొలిచూపులోనే ధోనీ ఇష్టపడ్డాడు. సాక్షిని కలవాలని మాట్లాడాలని తహతహలాడాడు. అప్పుడు వీరిద్దరి మధ్య వారధిలా ధోని మేనేజర్ పనిచేశాడు. అయితే ధోని ప్రేమని సాక్షి మొదట్లో జోక్ గా తీసుకుంది. అయితే ధోని ప్రేమ నిజమని రుజువయ్యాక సాక్షి కూడా రిలేషన్ షిప్ ను సీరియస్ గా తీసుకుంది. 2 సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ..

ఇది కూడా పరిచయం అక్కర్లేనీ సెలబ్రిటీ జంట. వీరిద్దరి సాగిన రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి తెలియనివారు లేరు. 2013లో షాంఫూ ప్రకటనలో నటించిన తర్వాత విరాట్ కోహ్లీ(Virat kohli), అనుష్క శర్మ(Anuksha Sharma) కొన్నాళ్లపాటు ఎవరికీ తెలియకుండా తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు. కానీ.. హైదరాబాద్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో శతకం సాధించిన విరాట్ కోహ్లి.. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ని వీక్షిస్తున్న అనుష్కకి మైదానం నుంచే ప్లైయింగ్ కిస్‌ ఇవ్వడంతో వీరి లవ్‌స్టోరీ వెలుగులోకి వచ్చింది. దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట 2017 ఆఖర్లో ఇటీలీ వేదికగా వివాహ బంధంతో ఒక్కటైంది.

రోహిత్ శర్మ-రితిక 

ఇక హిట్ మ్యాన్ మన రోహిత్ శర్మ విషయానికి వస్తే పెళ్లికి ముందు రితికా(Ritika) స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసేది. తరువాత రోహిత్ శర్మ(Rohit Sharma)కు మేనేజర్‌గా వచ్చింది రితికా. అలా ఏర్పడిన పరిచయం తర్వాత స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి చివరకు పెళ్లి దాకా వెళ్లింది. వీరే కాదు మన హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, మాక్స్ వెల్ ఇలా ఎంతోమంది క్రికెట్ ఆటగాళ్లు ప్రేమయాత్రలు చేసిన వారే. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget