Mirabai Chanu Wins Gold : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి స్వర్ణం, వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్
Mirabai Chanu Wins Gold : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. వెయిట్ లిఫ్టింగ్ లో 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది.
Mirabai Chanu Wins Gold : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ స్వర్ణం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. కామన్ వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి మళ్లీ అదరగొట్టేసింది. 49 కేజీల విభాగంలో 88 కిలోల బరువును ఎత్తిన మీరా సరికొత్త రికార్డులను నెలకొల్పటంతో పాటు స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది. రజత పతక విజేతగా నిలిచిన లిఫ్టర్ కంటే 12 కిలోల బరువు ఎక్కువ ఎత్తి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది మీరాబాయి చాను. నాలుగేళ్ల క్రితం జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణపతక విజేతైన మీరాబాయి చానుకు కామన్ వెల్త్ గేమ్స్ లో ఇది మూడో పతకం.
The exceptional @mirabai_chanu makes India proud once again! Every Indian is delighted that she’s won a Gold and set a new Commonwealth record at the Birmingham Games. Her success inspires several Indians, especially budding athletes. pic.twitter.com/e1vtmKnD65
— Narendra Modi (@narendramodi) July 30, 2022
మూడో పతకం
మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించింది. మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో చాను మొత్తం 201 కిలోల బరువును ఎత్తి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి ఇది మూడో పతకం. అంతకుముందు సంకేత్ సర్గర్ (రజతం), గురురాజా (కాంస్యం) అందించారు. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన 2018 CWGలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న చాను, స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు ఎత్తి మిగతా క్రీడాకారులకు అందనంత ఎత్తులో నిలించింది.
2018లోనూ స్వర్ణం
మీరాబాయి దేశంలో అత్యంత ఆదరణ ఉన్న వెయిట్ లిఫ్టర్లలో ఒకరు. 2022లో మళ్లీ స్వర్ణ పథకం సాధించిన ఆమె ఇప్పటికే 2014 కామన్వెల్త్ గేమ్స్ లో రజతం, 2018 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలిచింది. ఆమె 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ పతకాలు, ఆసియా ఛాంపియన్‌షిప్ పతకాలను కూడా ఆమె సాధించింది. టోక్యో ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి రజత పతక అందించిన రికార్డులకెక్కింది మీరాబాయి చాను.
The golden girl #MirabaiChanu snatch complete with personal beat 88 KG. pic.twitter.com/pizVDaIEKw
— Vipin yadav (@i_am_vipinyadav) July 30, 2022