Ross Taylor Retirement: క్రికెట్‌కు న్యూజిలాండ్ ఆటగాడు రాస్‌టేలర్ గుడ్‌బై.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పుకుంటున్నట్టు రాస్‌టేలర్ ప్రకటించాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో వందకుపైగా మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ క్రికెటర్ టేలర్.
ఏళ్లతరబడి స్థిరంగా రాణించి న్యూజిలాండ్ క్రికెట్‌ను అద్భుతమైన విజయాలు అందించిన టాప్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. స్వదేశంలో జరిగే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్ మ్యాచ్‌ల తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించాడు.
ఈ 37ఏళ్ల రాస్‌టేలర్ కివీస్ తరఫున 445 మ్యాచ్‌లు ఆడి 18,074 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెటర్ల జాబితాలో న్యూజిలాండ్ తరఫున టాప్ బ్యాట్స్‌మెన్ రాస్‌టేలర్. ప్రతి ఫార్మాట్‌లో కూడా వందకుపైగా మ్యాచ్‌లు ఆడిన అతి కొద్దిమంది అంతర్జాతీయ క్రికెటర్లలో రాస్ టేలర్ ఒకడు.
సోషల్ మీడియా వేదికగా రాస్ టేలర్ తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇన్నాళ్ల తీవ్ర చర్చల తర్వాత ఇవాళ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను. స్వదేశంలో జరిగే మ్యాచ్‌లను ఆస్వాదించి ఆటకు వీడ్కోలు చెప్పబోతున్నాను. బంగ్లాదేశ్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్‌తో ఆరు వన్డేలు స్వదేశంలో జరగనున్నాయి. 17ఏళ్లుగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇన్నేళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా భావిస్తాను. అని తన ట్విటర్ వాల్‌పై రాసుకొచ్చాడు రాస్‌టేలర్.
View this post on Instagram
2006లో తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు రాస్‌టేలర్. ఆ తర్వాత తనదైన మార్క్ ఆటతో కివీస్‌కు ఎన్నో విజయాలు అందించారు. కెప్టెన్‌గా గతేడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను న్యూజిలాండ్‌కు అందిచాడు టేలర్. పైనల్ మ్యాచ్‌లో ఇండియాను ఓడించి కివీస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
ఐపీఎల్‌లో కూడా హిట్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు టేలర్. బెంగళూరు అభిమానులకు టేలర్‌పై ప్రత్యేక అభిమానం ఉంది.
#OnThisDay in 2️⃣0️⃣0️⃣9️⃣, we witnessed one of the most iconic knocks in RCB’s history with Ross Taylor scoring 8️⃣1️⃣*(33), helping us chase down 1️⃣7️⃣3️⃣ at the Centurion vs KKR. 🔥#PlayBold #WeAreChallengers pic.twitter.com/tJsnWXKMCS
— Royal Challengers Bangalore (@RCBTweets) May 12, 2021
ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటతీరు మార్చుకునే క్రికెటర్ రిటైర్మెంట్ ఆటకు నిజంగా తీరని లోటుగా క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: విజయానికి ఆరు వికెట్లు.. దక్షిణాఫ్రికా ఎంత కొట్టాలంటే?
Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్ భావోద్వేగం
Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!
Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!