అన్వేషించండి

Rohit Sharma: రోహిత్ శర్మ సాధించిన అరుదైన రికార్డులు.. ఏడేళ్లయినా ఆ రికార్డు ఇంకా సేఫ్!

భారత క్రికెట్ జట్టుకు కొత్త వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఈ ఫార్మాట్‌లో అరుదైన రికార్డులు ఉన్నాయి.

రోహిత్ శర్మ భారతజట్టుకు కొత్త వన్డే కెప్టెన్‌గా నియమితమైన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు ఈ బాధ్యతలను బీసీసీఐ అందించింది. ఇప్పటినుంచి టీమిండియాను టీ20, వన్డే ఫార్మాట్లలో రోహిత్ శర్మ ముందుకు నడిపించనున్నాడు. వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తిగత రికార్డులు ఉన్నాయి.

తన వన్డే కెరీర్‌లో రోహిత్ శర్మ మొత్తంగా 227 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 48.96 సగటుతో 9,205 పరుగులను హిట్ మ్యాన్ తన వన్డే కెరీర్‌లో సాధించాడు. అందులో 29 శతకాలు, 43 అర్థ శతకాలు ఉన్నాయి. వన్డేల్లో 832 ఫోర్లు, 244 సిక్సర్లు రోహిత్ ఖాతాలో ఉన్నాయి. టీమిండియాకు ఆడిన అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో హిట్ మ్యాన్ కూడా ఒకడు.

వన్డేల్లో ఒక మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్ పేరు మీదనే ఉంది. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డు సాధించాడు. ఏడు సంవత్సరాలు అయినా ఆ రికార్డు ఇప్పటికీ బద్దలు కాలేదు. ఆ ఇన్నింగ్స్‌లో రోహిత్ 33 ఫోర్లు కొట్టాడు. ఇది కూడా రికార్డే. దీంతోపాటు వన్డేల్లో రోహిత్ మూడు సార్లు డబుల్ సెంచరీ సాదించాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఐదు శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా రోహితే.

మొత్తం మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ సెంచరీలు సాధించాడు. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సపోర్ట్ చేశారు. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైనదేనని, టీమిండియాకు మేలు చేస్తుందని అన్నారు.

మరోవైపు రోహిత్ శర్మ మాత్రం విరాట్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. తను జట్టుకు మంచి నాయకుడుగా ఉండేవాడని ప్రశంసించాడు. ఒక నాయకుడిగా, బ్యాటర్‌గా తన అవసరం జట్టుకు ఎంతో ఉందన్నాడు. టీ20 ఫార్మాట్‌లో 50 సగటు ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం అన్నాడు. ఈ అనుభవంతో విరాట్ ఎన్నో సార్లు జట్టును కష్టాల్లో నుంచి బయటపడేశాడని తెలిపాడు.

Also Read: 83 Film Update: ప్రపంచకప్‌ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్‌ డెవిల్స్‌..! ఎందుకో తెలుసా?

Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్‌!

Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?

Also Read: IND vs SA: ద్రవిడ్‌ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!

Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!

Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్‌, కోహ్లీ ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget