By: ABP Desam | Updated at : 10 Mar 2023 09:42 PM (IST)
వికెట్ తీసిన ఆనందంలో యూపీ బౌలర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (Image Credit: WPLT20 Twitter)
Royal Challengers Bangalore Women vs UP Warriorz, WPL 2023: ఈ మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరస్ట్ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. యూపీ వారియర్జ్‌తో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు కుప్పకూలారు. 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 72 పరుగులతో పటిష్టంగా కనిపించిన బెంగళూరు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 138 పరుగులకే ఆలౌట్ అయింది. బెంగళూరు బ్యాటర్లలో ఎలీస్ పెర్రీ (52: 39 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఒంటరి పోరాటం చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ కోరుకున్న శుభారంభం మాత్రం లభించలేదు. మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో స్మృతి మంధాన ఫెయిల్యూర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఆరు బంతుల్లో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది.
మరో ఓపెనర్ సోఫీ డివైన్, వన్ బౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో బెంగళూరును ఎకిల్ స్టోన్ దెబ్బ కొట్టింది. జోరు మీదున్న సోఫీ డివైన్‌ను పెవిలియన్ బాట పట్టించింది.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేదు. కేవలం 65 పరుగుల వ్యవధిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లు కోల్పోయింది. దీంతో 19.3 ఓవర్లలోనే రాయలల్ ఛాలెంజర్స్ బెంగళూరు 138 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ నాలుగు వికెట్లు దక్కించుకుంది. దీప్తి శర్మ మూడు వికెట్లు తీసుకోగా, రాజేశ్వరి గయక్వాడ్ ఒక వికెట్ పడగొట్టింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల తుదిజట్టు
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఎరిన్ బర్న్స్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, సహానా పవార్, కోమల్ జంజాద్, రేణుకా ఠాకూర్ సింగ్
యూపీ వారియర్జ్ తుది జట్టు
అలిస్సా హీలీ (కెప్టెన్, వికెట్ కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, దేవిక వైద్య, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయక్వాడ్
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!@EllysePerry put on a superb show with the bat for @RCBTweets & scored a fine FIFTY 👏 👏 #TATAWPL | #RCBvUPW
— Women's Premier League (WPL) (@wplt20) March 10, 2023
Watch Her Innings 🎥👇https://t.co/tqsCQFjgjB pic.twitter.com/TQwx7WRFee
I. C. Y. M. I
— Women's Premier League (WPL) (@wplt20) March 10, 2023
How Ecclestone won the battle of Sophies 🎥 🔽 #TATAWPL | #RCBvUPW | @Sophecc19 | @UPWarriorz https://t.co/SMLP8LsmtB pic.twitter.com/wSNC59QJXQ
Innings Break!
— Women's Premier League (WPL) (@wplt20) March 10, 2023
An impressive bowling performance from @UPWarriorz! 👏 👏
4⃣ wickets for @Sophecc19
3⃣ wickets for @Deepti_Sharma06 @EllysePerry top scores for @RCBTweets 👍 👍
The #UPW chase is coming up shortly!
Scorecard ▶️ https://t.co/aLy7IOKGXp#TATAWPL | #RCBvUPW pic.twitter.com/rtcbmavjPv
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!
UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్.. హరికేన్ ఇన్నింగ్స్ - ఆఖరి లీగులో గుజరాత్‌కు తప్పని ఓటమి!
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !