By: ABP Desam | Updated at : 02 Apr 2023 07:40 PM (IST)
టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు (Image Credits: Twitter)
Royal Challengers Bangalore vs Mumbai Indians: ఐపీఎల్‌లో ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ కూడా కచ్చితంగా ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఇప్పుడు జరుగుతోంది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుఫ్లెసిస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్
ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నెగ్గడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇంతవరకు టైటిల్ నెగ్గని టీమ్ ఏదైనా ఉందా..? అంటే అది కచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే. ఒక్కటా..? రెండా..? పదిహేనేండ్లుగా ఒకే కల (ఈసాలా కప్ నమ్దే)ను మళ్లీ మళ్లీ కంటున్న ఆ జట్టు అభిమానులకు ఈ ఏడాది గుండెకోత తప్పేట్లు లేదు. అసలే కీలక టోర్నీలో అదృష్టం బాగోలేక తంటాటు పడుతున్న ఆ జట్టుకు ఈ సీజన్ లో వరుస షాకులు తాకుతున్నాయి. ఆర్సీబీ కీలక పేసర్ జోష్ హెజిల్వుడ్ ఈ సీజన్ లో సగం మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు.
ఆర్సీబీకి ఉన్న ప్రధాన పేసర్ హెజిల్వుడ్. ఈ ప్రపంచ నెంబర్ వన్ బౌలర్.. ఈ ఏడాది స్వదేశం (ఆస్ట్రేలియా) లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డాడు. మూడో టెస్టులో ఆడలేదు. గాయం పూర్తిగా కోలుకోకున్నా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడతానని టీమ్ తో కలిసి ఎగేసుకుని భారత్ కు వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక అతడు ఇంకా ఫిట్ గా లేడని, మరికొన్నాళ్లు విశ్రాంతి కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా మళ్లీ అతడిని ఢిల్లీ టెస్టు ముగిశాక సిడ్నీ ఫ్లైట్ ఎక్కించింది. సరే టెస్టు సిరీస్ కు మిస్ అయినా వన్డే సిరీస్ వరకైనా వస్తాడనుకుంటే దానికీ రాలేదు. వన్డే సిరీస్ పోయినా ఐపీఎల్ వరకైనా కుదురుకుంటాడనుకుంటే ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు ‘ఫస్టాఫ్ కు మిస్ అవుతున్నా..’అని సెలవిచ్చాడు.
గాయం నుంచి తాను ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని.. ఏప్రిల్ 14 వరకూ పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని హెజిల్వుడ్ చెప్పుకొచ్చాడు. అప్పటికీ కూడా అందుబాటులో ఉంటాడా..? అంటే అదీ అనుమానమే. అవసరమైతే మరో వారం రోజులు రెస్ట్ తీసుకుని పూర్తి సన్నద్ధత సాధించాక బరిలోకి దిగుతానని చెప్పాడు. వన్డేలు, టెస్టులతో పోల్చుకుంటే టీ20లలో ఆడేది తక్కువ టైమే అయినా వేసే 4 ఓవర్లూ పూర్తి పేస్ తో వేయాల్సి ఉంటుందని.. దానికోసం చాలా శారీరకంగా చాలా శ్రమించాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ లెక్కన చూసుకుంటే ఏప్రిల్ నాలుగో వారం దాక జోష్ ఆడేది అనుమానమే.
IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు
WTC Final 2023: నన్ను పెళ్లి చేసుకుంటావా! - గిల్‌కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్
Shardul Thakur Record: లార్డ్ శార్దూల్ అంటార్రా బాబూ - దిగ్గజాలకు సొంతమైన రికార్డును సమం చేసిన ఠాకూర్
IND vs AUS, WTC Final 2023: వార్నర్ ఔట్ - పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే
WTC Final 2023: ప్చ్.. టీమ్ఇండియా 296 ఆలౌట్! అజింక్య సెంచరీ మిస్ - ఆసీస్‌కు భారీ లీడ్!
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్