Ravindra Jadeja as Pushpa: పుష్పగా మారిన జడ్డూ!! ఫ్లవర్ కాదు ఫైర్ అంటున్న టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్
జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏడాది పొడవునా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటంతో ఎక్కువగా గాయాల పాలవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీసు తర్వాత గాయపడటంతో అతడిని దక్షిణాఫ్రికా సిరీసుకు ఎంపిక చేయలేదు.
టీమ్‌ఇండియా సీనియర్ క్రికెటర్ రవీంద్ర జడేజా 'పుష్ఫ' అవతారం ఎత్తాడు! 'పుష్ఫంటే ఫ్లవర్ అనుకుంటున్నారా ఫైరు' అని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పుష్ఫరాజ్ లుక్‌ను రీక్రియెట్ చేశాడు. దీనికి బన్నీ సైతం 'తగ్గేదే లే' అని బదులివ్వడం ప్రత్యేకం.
రవీంద్ర జడేజా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏడాది పొడవునా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటంతో ఎక్కువగా గాయాల పాలవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీసు తర్వాత గాయపడటంతో అతడిని దక్షిణాఫ్రికా సిరీసుకు ఎంపిక చేయలేదు.
Also Read: IPL New Sponsor: వివో ఔట్! ఇకపై 'టాటా ఐపీఎల్'! చైనా కంపెనీకి గుడ్‌బై!!
Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్ మెగా వేలం
జడ్డూది గుజరాత్ అయినప్పటికీ దక్షిణాది ప్రాంతాలు, సినిమాలపై ఎక్కువగానే అవగాహన ఉంది! ఎందుకంటే అతడు ఇండియన్ ప్రీమియర్ లీగులో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ఆడుతుండటమే ఇందుకు కారణం. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఎన్నో మ్యాచులు ఆడాడు. తాజాగా విశ్రాంతి తీసుకుంటున్న జడ్డూ ఎక్కువగా సినిమాలు చూస్తున్నట్టు తెలుస్తోంది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'పుష్ఫ' పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయింది. వందల కోట్ల రూపాయాలు కలెక్షన్లు వసూలు చేసింది. అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన రోజునే లక్షల మంది ఈ సినిమాను వీక్షించారు. ఈ సినిమాలో బన్నీ 'రా' లుక్‌లో కనిపించే సంగతి తెలిసిందే. కాస్త రింగుల జట్టు, ట్రిమ్ చేయని గడ్డంతో ఉంటాడు. జడ్డూ సైతం అచ్చం అలాగే కనిపించాడు.
'పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైరు' అని కామెంట్ పెట్టాడు. చిత్రాన్ని స్వైప్ చేస్తే సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పాడు. ఆ చిత్రంలో జడ్డూ సిగరెట్ నోట్లో పెట్టుకొని ఉండటంతో ఓ డిస్‌క్లైమర్ ఇచ్చాడు. 'ఇది కేవలం ప్రతీకాత్మక చిత్రం మాత్రమే. సిగరెట్, బీడీ, పొగాకు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్‌కు కారకం. ధూమపానం చేయకండి' అని సలహా ఇస్తున్నాడు. ఈ పోస్టుకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఇక బన్నీ ఈ పోస్టుకు 'తగ్గేదే లే' అంటూ కామెంట్ పెట్టాడు.
View this post on Instagram